Rahul Dravid: వరల్డ్‌ కప్‌ ఓటమి తర్వాత తొలిసారి బయటికొచ్చిన ద్రవిడ్‌!

ఇండియా వరల్డ్‌ కప్‌ 2023 ఫైనల్లో ఓడిపోవడంతో టీమిండియా హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ తీవ్ర నిరాశ చెందారు. సుదీర్ఘ టోర్నీకి సరైన ముగింపు లభించకపోవడంతో.. ఆయన కొంత రెస్ట్‌ తీసుకుంటున్నారు. అయితే.. వరల్డ్‌ కప్‌ ఓటమి తర్వాత.. ద్రవిడ్‌ తొలిసారి బయటికొచ్చాడు..

ఇండియా వరల్డ్‌ కప్‌ 2023 ఫైనల్లో ఓడిపోవడంతో టీమిండియా హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ తీవ్ర నిరాశ చెందారు. సుదీర్ఘ టోర్నీకి సరైన ముగింపు లభించకపోవడంతో.. ఆయన కొంత రెస్ట్‌ తీసుకుంటున్నారు. అయితే.. వరల్డ్‌ కప్‌ ఓటమి తర్వాత.. ద్రవిడ్‌ తొలిసారి బయటికొచ్చాడు..

వంద కోట్లకు పైగా క్రికెట్‌ అభిమానులను నిరాశకు గురిచేస్తూ.. ఇటీవల జరిగిన వన్డే వరల్డ్‌ కప్‌ 2023 ఫైనల్‌లో టీమిండియా ఓటమి పాలైన విషయం తెలిసిందే. టోర్నీ ఆసాంతం అద్భుతంగా ఆడిన రోహిత్‌ సేన.. కప్పుకు ఒక్క అడుగు దూరంలో చతికిల పడింది. ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలైన భారత్‌.. వరల్డ్‌ కప్‌ కలల్ని ముక్కలు చేసుకుంది. ఈ ఓటమితో భారత ఆటగాళ్లతో పాటు, క్రికెట్‌ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఇప్పుడిప్పుడే ఆ ఓటమి తాలుకూ మనోవేదను నుంచి బయటపడుతున్నారు. ప్రస్తుతం యువకులతో కూడిన టీమిండియా.. ఆస్ట్రేలియాపై టీ20 సిరీస్‌ గెలిచినా.. భారత క్రికెట్‌ అభిమానులు పెద్దగా పట్టించుకోవడం లేదు.

అలాగే సీనియర్‌ స్టార్‌ క్రికెటర్లు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ.. ఆడకపోవడం కూడా ప్రభావం చూపిస్తోంది. ఇక ఆటగాళ్ల పరిస్థితి ఇలా ఉంటే.. మరో వైపు టీమిండియా హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ సైతం వరల్డ్‌ కప్‌ ఫైనల్‌లో ఓటమితో తీవ్ర నిరాశకు గురయ్యారు. ఆయన కూడా ప్రస్తుతం ఆటకు దూరంగా ఉన్నారు. కుటుంబంతో గడుపుతున్నారు. అయితే.. ఇటీవల హెడ్‌ కోచ్‌గా ద్రవిడ్‌ పదవీ కాలాన్ని బీసీసీఐ పొడిగించిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది జూన్‌-జులైలో జరిగే టీ20 వరల్డ్‌ కప్‌ 2024 వరకు ద్రవిడే టీమిండియాకు హెడ్‌ కోచ్‌గా వ్యవహరించనున్నారు.

కాగా.. వరల్డ్‌ కప్‌ ఓటమి తర్వాత.. ద్రవిడ్‌ తొలిసారి బయటికివచ్చారు. ఎంతో సింపుల్‌గా భార్యతో కలిసి తన కుమారుడి ఆటను వీక్షేందుకు వెళ్లారు. మైసూర్‌లోని శ్రీకంఠదుట్ట నరసింహరాజ వడయార్ స్టేడియంలో శుక్రవారం కర్ణాటక, ఉత్తరాఖండ్ జట్ల మధ్య జరిగిన కూచ్ బెహార్ ట్రోఫీ మ్యాచ్‌ని వీక్షించేందుకు వెళ్లారు. కర్ణాటక జట్టుకు ద్రవిడ్‌ కుమారుడు సమిత్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. కొడుకు ఎలా ఆడుతున్నాడో చూసేందుకు తండ్రి ద్రవిడ్‌, తల్లి విజయ రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కాగా, ఈ మ్యాచ్‌లో ద్రవిడ్‌ కుమారుడు సమిత్‌ మంచి ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. మరి ద్రవిడ్‌ సింప్లిసిటీపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments