టీమిండియా స్టార్ క్రికెటర్ కింగ్ విరాట్ కోహ్లీపై ఆలిండియా ఎంట్రన్స్ ఎగ్జామ్ లో ఓ ప్రశ్న అడిగారు. మరి కోహ్లీపై అడిగిన ఆ క్వశ్చన్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
టీమిండియా స్టార్ క్రికెటర్ కింగ్ విరాట్ కోహ్లీపై ఆలిండియా ఎంట్రన్స్ ఎగ్జామ్ లో ఓ ప్రశ్న అడిగారు. మరి కోహ్లీపై అడిగిన ఆ క్వశ్చన్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
సాధారణంగా ఏ రంగంలోనైనా ప్రసిద్ధి చెందిన దిగ్గజాలకు సంబంధించి.. విద్యార్థులకు నిర్వహించే పరీక్షల్లో ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. ఇప్పటికే ఎంతో మంది ప్రముఖుల గురించి ఇదివరకే జరిగిన ఎన్నో ఎగ్జామ్స్ లో ప్రశ్నలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా టీమిండియా స్టార్ బ్యాటర్, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీపై ఆలిండియా ఎంట్రన్స్ ఎగ్జామ్ లో ప్రశ్న అడిగారు. తన ఆటతీరుతో, రికార్డులతో ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ను సంపాదించుకున్నాడు కింగ్ కోహ్లీ. ఇటీవలే వన్డేల్లో 50 శతకాలు పూర్తి చేసి సచిన్ ఆల్ టైమ్ రికార్డును బ్రేక్ చేసిన విషయం మనందరికి తెలిసిందే. మరి ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ లో కోహ్లీపై ఏ ప్రశ్న అడిగారు? ఆ వివరాలు..
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. రికార్డుల మీద రికార్డులు నెలకొల్పుతూ వరల్డ్ క్రికెట్ ను శాసిస్తున్నాడు. అసాధ్యమనుకున్న ఘనతలను కూడా తన పేరిట లిఖించుకుంటూ ముందుకు సాగుతున్నాడు ఈ రన్ మెషిన్. ప్రస్తుతం సౌతాఫ్రికాతో జరిగే టెస్ట్ సిరీస్ కోసం సన్నద్ధం అవుతున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా విరాట్ కోహ్లీకి సంబంధించిన ఒక ప్రశ్న ఆలిండియా లా పరీక్షల్లో అడిగారు. ఇటీవలే ఆలిండియా లా ఎంట్రన్స్ టెస్ట్(AILET) పరీక్ష జరిగింది. అందులో ఐపీఎల్ కు సంబంధించిన ప్రశ్న ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఇంతకీ ఆ క్వశ్చన్ ఏంటంటే? 2008లో ప్రారంభమైన ఐపీఎల్ మెగాటోర్నీలో ఇప్పటి వరకు ఒకే ఫ్రాంచైజీ తరఫున ఆడిన ప్లేయర్ ఎవరు? అంటూ ప్రశ్న అడిగారు.
ఇక ఆ ప్రశ్నకు ఆప్షన్స్ కింద బెన్ స్టోక్స్, వార్నర్, పాండ్యా,విరాట్ కోహ్లీ పేర్లను ఇచ్చారు. కాగా.. ఈ ప్రశ్నకు కరెక్ట్ ఆన్సర్ విరాట్ కోహ్లీ అని ప్రతీ క్రికెట్ లవర్ కు తెలిసిందే. ఇదిలా ఉండగా, వార్నర్ ఐపీఎల్ లో ఢిల్లీ, సన్ రైజర్స్ జట్లకు, స్టోక్స్ చెన్నై, రాజస్థాన్, పూణే జట్లకు ప్రాతినిథ్యం వహించిన విషయం విదితమే. ఇక పాండ్యా ముంబై, గుజరాత్ లకు ఆడాడు. కేవలం కోహ్లీ ఒక్కడు మాత్రమే గత 16 ఐపీఎల్ ఎడిషన్లుగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ 16 సీజన్లలో మెుత్తం 237 మ్యాచ్ లు ఆడి.. 7263 రన్స్ చేశాడు. అందులో 7 శతకాలతో పాటుగా, 50 అర్దశతకాలు ఉన్నాయి. మరి విరాట్ కోహ్లీపై లా ఎంట్రన్స్ ఎగ్జామ్ లో ప్రశ్న ఇవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
AILET (All India Law Entrance Test) featured a question spotlighting Virat Kohli’s commitment to RCB in the IPL.
📸: @RCBTweets pic.twitter.com/tl08fp1onj
— CricTracker (@Cricketracker) December 10, 2023