Somesekhar
టీ20 ప్రపంచ కప్ గెలిచిన టీమిండియా ఆటగాళ్లతో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ భేటీలో పలు ఆసక్తికర విషయాలు చర్చకు వచ్చాయి. రిషబ్ పంత్ తల్లి తనకు ధైర్యం చెప్పిందని మోదీ ఈ సందర్భంగా వెల్లడించారు. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
టీ20 ప్రపంచ కప్ గెలిచిన టీమిండియా ఆటగాళ్లతో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ భేటీలో పలు ఆసక్తికర విషయాలు చర్చకు వచ్చాయి. రిషబ్ పంత్ తల్లి తనకు ధైర్యం చెప్పిందని మోదీ ఈ సందర్భంగా వెల్లడించారు. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
Somesekhar
టీ20 ప్రపంచ కప్ గెలిచిన టీమిండియా ఆటగాళ్లకు స్వదేశంలో ఘన స్వాగతం లభించింది. వరల్డ్ కప్ నెగ్గిన తర్వాత భారత ఆటగాళ్లు ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ఆయనతో కలిసి అల్పాహారం సేవించారు. ఈ సందర్భంగా మోదీ ఆటగాళ్లతో సంభాషించారు. ఈ సంభాషణలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. కాగా.. కారు యాక్సిడెంట్ లో తీవ్ర గాయాలపాలైన వికెట్ కీపర్ రిషబ్ పంత్ తన తప్పు వల్లే ప్రమాదం జరిగిందని ప్రధానికి చెప్పారు. ఇక పంత్ కు యాక్సిడెంట్ జరిగినప్పుడు మోదీ అతని తల్లి సరోజ్ కు ఫోన్ చేసిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..
ప్రపంచ కప్ గెలిచిన టీమిండియా ఆటగాళ్లు ప్రధాని మోదీతో భేటీ అయిన విషయం తెలిసిందే. అయితే ఈ భేటీలో పలు ఆసక్తికర విషయాలు చర్చలోకి వచ్చాయి. ఈ సందర్భంగా టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ కు యాక్సిడెంట్ అయిన సమయంలో పంత్ తల్లి సరోజ్ కు మోదీ ఫోన్ చేసిన విషయాన్ని గుర్తుకు చేసుకున్నారు. ఈ భేటీలో మోదీ మాట్లాడుతూ..”రిషబ్ పంత్ మీకు యాక్సిడెంట్ అయినప్పుడు మీ అమ్మగారిని నేను ఫోన్ చేసి మాట్లాడాను. మెరుగైన చికిత్స కోసం విదేశాలకు వెళ్లాలా? అని డాక్టర్లను అడిగాను. ఇక ఆ టైమ్ లో మీరు కచ్చితంగా కోలుకుంటారని ఆమె చాలా నమ్మకంగా చెప్పింది. మీ అమ్మగారితో మాట్లాడుతుంటే.. ఆమె నాకే ధైర్యం చెప్పినట్లు అనిపించింది. అలాంటి తల్లి దీవెనలు పొందిన వ్యక్తి జీవితంలో ఏదో ఒకటి సాధిస్తాడని నాకు అప్పుడే అర్ధమైంది. అంత పెద్ద భారీ ప్రమాదం నుంచి కోలుకుని కేవలం 18 నెలల్లోనే తిరిగిరావడం ఎందరికో స్ఫూర్తిదాయకం” అని మోదీ రిషబ్ పంత్ పై ప్రశంసలు కురిపించాడు. ఇక ఈ సంభాషణలో మోదీ కొన్ని చమత్కారాలు కూడా చేశారు.