Babar Azam: చరిత్ర సృష్టించిన బాబర్ అజాం.. ఈ రికార్డ్ లో ధోని కూడా బాబర్ వెనకే!

ఐర్లాండ్ తో జరిగిన రెండో టీ20లో 7 వికెట్ల తేడాతో పాకిస్తాన్ విజయం సాధించింది. ఈ గెలుపుతో సరికొత్త చరిత్ర సృష్టించాడు పాక్ కెప్టెన్ బాబర్ అజాం. ఆ వివరాల్లోకి వెళితే..

ఐర్లాండ్ తో జరిగిన రెండో టీ20లో 7 వికెట్ల తేడాతో పాకిస్తాన్ విజయం సాధించింది. ఈ గెలుపుతో సరికొత్త చరిత్ర సృష్టించాడు పాక్ కెప్టెన్ బాబర్ అజాం. ఆ వివరాల్లోకి వెళితే..

పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజాం రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతూ ముందుకు సాగుతున్నాడు. ప్రస్తుతం ఐర్లాండ్ పర్యటనలో ఉంది పాకిస్తాన్. మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్ లోనే పాక్ కు ఊహించని షాక్ ఇచ్చింది ఐర్లాండ్ టీమ్. అయితే ఓటమి నుంచి పుంజుకున్న పాక్ రెండో మ్యాచ్ లో ఐర్లాండ్ ను 7 వికెట్ల తేడాతో చిత్తుచేసింది. ఇక ఈ మ్యాచ్ గెలవడం ద్వారా సరికొత్త చరిత్రను లిఖించాడు పాక్ కెప్టెన్ బాబర్ అజాం. ఈ రికార్డ్ లో ధోని కూడా బాబర్ వెనకే ఉండటం గమనార్హం.

ఐర్లాండ్ తో జరుగుతున్న టీ20 సిరీస్ లో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజాం రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతున్నాడు. తొలి మ్యాచ్ లో హాఫ్ సెంచరీ చేసి.. టీ20 మ్యాచ్ లో అత్యంత వేగంగా వందకు పైగా 50+ స్కోర్లు చేసి ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఇక తాజాగా జరిగిన రెండో మ్యాచ్ లో కూడా ఓ రేర్ ఫీట్ ను సాధించాడు. ఈ మ్యాచ్ లో 7 వికెట్ల తేడాతో ఐర్లాండ్ ను చిత్తు చేసింది పాక్. దీంతో కెప్టెన్ గా మెన్స్ టీ20 క్రికెట్ లో సరికొత్త చరిత్రను నెలకొల్పాడు బాబర్. అంతర్జాతీయ టీ20 పురుషుల క్రికెట్ లో కెప్టెన్ గా అత్యధిక విజయాలు సాధించిన ప్లేయర్ గా బాబర్ నిలిచాడు. అతడు ఇప్పటి వరకు 78 మ్యాచ్ లకు కెప్టెన్ గా వ్యవహరించి.. 45 విజయాలు సాధించాడు.

కాగా.. ఇంతకు ముందు ఈ రికార్డ్ ఉగాండ కెప్టెన్ బ్రియన్ మసాబా పేరిట ఉండేది. అతడు కేవలం 56 మ్యాచ్ ల్లో 44 విజయాలు జట్టుకు అందించాడు. ఈ లిస్ట్ లో ఆఫ్గాన్ కెప్టెన్ అస్ఘర్ ఆఫ్గాన్(42), ఇయాన్ మోర్గాన్(42), ఎంఎస్ ధోని(41) విజయాలతో తర్వాత స్థానాల్లో ఉన్నారు. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. అనంతరం 194 పరుగుల భారీ లక్ష్యాన్ని పాక్ 16.5 ఓవర్లలో కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. మరి రికార్డుల మీద రికార్డులు బ్రేక్ చేస్తూ ముందుకు సాగుతున్న పాక్ కెప్టెన్ బాబర్ అజాంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments