క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన వన్డే వరల్డ్ గ్రాండ్‌గా మొదలైంది. తొలి మ్యాచ్‌లో తలపడిన డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్, రన్నరప్ న్యూజిలాండ్‌లు ప్రేక్షకులను తమ గేమ్‌తో బాగా ఎంటర్టైన్ చేశాయి. అయితే అందరూ ఎక్స్పెక్ట్ చేసినట్లుగా జరగలేదు. స్టార్ ప్లేయర్లతో ఎంతో పవర్‌ఫుల్‌గా ఉన్న ఇంగ్లీష్ టీమ్‌ను కివీస్ చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో గెలిచిన న్యూజిలాండ్ ప్రత్యర్థి జట్లకు హెచ్చరికలు పంపింది. తమను తక్కువగా అంచనా వేస్తే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని వార్నింగ్ ఇచ్చింది. మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్న ఫస్ట్ మ్యాచ్ కాస్తా వన్ సైడ్ అవ్వడంతో.. ఇప్పుడు టీమిండియా ఆడబోయే మ్యాచులపై అందరి ఫోకస్ షిఫ్ట్ అయింది.
భారత్ తన తొలి మూడు మ్యాచుల్లో ఆస్ట్రేలియా, పాకిస్థాన్ లాంటి బలమైన టీమ్స్‌ను ఎదుర్కోవాల్సి ఉంది. టీమిండియా అన్ని విభాగాల్లోనూ స్ట్రాంగ్‌గా ఉంది. అయితే టర్నింగ్‌కు సహకరించే స్వదేశీ పిచ్‌లపై స్పిన్ బౌలింగ్ చేసే పార్ట్ టైమ్ బౌలర్లు లేకపోవడం భారత్‌కు కాస్త మైనస్ అనే చెప్పాలి. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, శుబ్‌మన్ గిల్ లాంటి బ్యాటర్లలో ఒక్కరు కూడా స్పిన్ వేయలేరు. ఇందులో కోహ్లీ మీడియం పేస్ వేయగలడు. కానీ విరాట్ అంత ఎఫెక్టివ్ బౌలర్ కాదు. రోహిత్ ఆఫ్ స్పిన్నర్ అనేది తెలిసిందే. కానీ అతడు బౌలింగ్ ఆపేసి చాన్నాళ్లు అయింది.
రోహిత్ భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చింది స్పిన్నర్‌గానే అనే విషయం చాలా మందికి తెలియదు. ఆస్ట్రేలియా స్టార్ స్టీవ్ స్మిత్ మాదిరిగానే స్పిన్నర్‌గా జాతీయ జట్టులోకి వచ్చాడు రోహిత్. ఐపీఎల్-2009లో డెక్కన్ ఛార్జర్స్‌కు ఆడిన రోహిత్ ఖాతాలో ఒక హ్యాట్రిక్ కూడా ఉంది. ఐపీఎల్లో హ్యాట్రిక్ తీసి, సెంచరీ కొట్టిన ఏకైక క్రికెటర్ కూడా హిట్‌మ్యానే కావడం విశేషం. అయితే టీమిండియాకు ఓపెనర్‌గా ప్రమోషన్ పొందిన తర్వాత అతడు బౌలింగ్ చేయడం పూర్తిగా తగ్గించేశాడు. 2012 నుంచి 2016 వరకు కేవలం 4 వన్డేల్లో మాత్రమే రోహిత్ బౌలింగ్ చేశాడు.
2016 టీ20 వరల్డ్ కప్ తర్వాత రోహిత్ పూర్తిగా బౌలింగ్ చేయడం మానేశాడు. ఐపీఎల్లో ఆఖరిగా 2014లో బౌలింగ్ చేసిన హిట్‌మ్యాన్.. 2021లో అత్యవసర పరిస్థితుల్లో 7 బంతులు బౌలింగ్ చేశాడు. అయితే సచిన్, గంగూలీ, సెహ్వాగ్ లాంటి వెటరన్ క్రికెటర్లు తమ కెరీర్లో బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ అదరగొట్టారు. రెగ్యులర్ బౌలర్లకు వికెట్లు దొరకనప్పుడు పార్ట్ టైమర్లు చాలా కీలకం అవుతారు. కానీ ఇప్పుడు టీమిండియాలో అలాంటి బౌలర్ లేకపోవడం మైనస్‌గా మారింది. తాను ఎందుకు బౌలింగ్ ఆపేశాననే దానిపై తాజాగా రోహిత్ స్పందించాడు. ‘బౌలింగ్ చేస్తున్నప్పుడు నా వేలికి కాస్త ఇబ్బంది కలగడం మొదలైంది. అది నా బ్యాటింగ్ మీద ప్రభావం చూపించకూడదనే బౌలింగ్ వేయడం తగ్గించా. అయితే ఇప్పటికీ కొన్నిసార్లు నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తూనే ఉంటా. అవసరమైతే బౌలింగ్ చేయడానికి సిద్ధమే’ అని రోహిత్ చెప్పుకొచ్చాడు.
ఇదీ చదవండి: నాడు తండ్రికి అవమానం! 27 ఏళ్లకు బదులు తీర్చుకున్న నెదర్లాండ్స్ బౌలర్!