Somesekhar
T20 వరల్డ్ కప్ ముందు ఓ విధ్వంసకర ప్లేయర్ తన ఇంటర్నేషనల్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించి అందరికి షాకిచ్చాడు. టీ20 స్పెషలిస్ట్ ప్లేయర్ గా ముద్రపడ్డ అతడు.. ఈ నిర్ణయం తీసుకోవడం అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. మరి ఆ ప్లేయర్ ఎవరు? ఎందుకు గుడ్ బై చెప్పాడు? ఇప్పుడు తెలుసుకుందాం.
T20 వరల్డ్ కప్ ముందు ఓ విధ్వంసకర ప్లేయర్ తన ఇంటర్నేషనల్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించి అందరికి షాకిచ్చాడు. టీ20 స్పెషలిస్ట్ ప్లేయర్ గా ముద్రపడ్డ అతడు.. ఈ నిర్ణయం తీసుకోవడం అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. మరి ఆ ప్లేయర్ ఎవరు? ఎందుకు గుడ్ బై చెప్పాడు? ఇప్పుడు తెలుసుకుందాం.
Somesekhar
క్రికెట్ ప్రేమికులను ఉర్రూతలూగిస్తున్న ఐపీఎల్ 2024 మరికొన్ని రోజుల్లో ముగియనుంది. అయితే ఆ వెంటనే మరో మహా సంగ్రామం ప్రారంభం కానుంది. జూన్ 2 నుంచి టీ20 వరల్డ్ కప్ వెస్టిండీస్, అమెరికా దేశాల్లో జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టోర్నీలో పాల్గొనే 20 జట్లు తమ ప్లాన్స్ ను రెడీ చేసుకునే పనిలో పడ్డాయి. అయితే ఓ విధ్వంసకర ఓపెనర్ మాత్రం తన ఇంటర్నేషనల్ క్రికెట్ కు వీడ్కోలు పలికి అందరిని ఆశ్చర్యానికి గురిచేశాడు. మరి వరల్డ్ కప్ వేళ.. ఎందుకు కెరీర్ ముగించాడు? ఆ ప్లేయర్ ఎవరు? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
టీ20 వరల్డ్ కప్ 2024 టైటిల్ ను ఎలాగైనా ఎగరేసుకుపోవాలని స్టార్ టీమ్స్ ఆరాటపడుతున్నాయి. అందుకోసం పటిష్టమైన జట్లను టోర్నీ బరిలోకి దింపుతున్నాయి. ఈ క్రమంలోనే కొందరు స్టార్ ప్లేయర్లకు సైతం జట్టులు ప్లేస్ దక్కడం లేదు. దాంతో నిరాశకు గురైన సదరు ఆటగాళ్లు తమ కెరీర్ కు వీడ్కోలు పలుకుతున్నారు. తాజాగా టీ20 వరల్డ్ కప్ లో చోటు దక్కకపోవడంతో.. న్యూజిలాండ్ విధ్వంసకర ఓపెనర్ కొలిన్ మున్రో తన ఇంటర్నేషనల్ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. ఈ క్రమంలోనే అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు.
అయితే ఐపీఎల్ లాంటి ఫ్రాంచైజీ లీగ్స్ కు అందుబాటులో ఉంటానని మున్రో పేర్కొన్నాడు. వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కకపోవడంతో.. నా వీడ్కోలుకు ఇదే సరైన సమయం అని భావించినట్లు అతడు చెప్పుకొచ్చాడు. ఇక టీ20 స్పెషలిస్ట్ బ్యాటర్ గా ప్రపంచ క్రికెట్ లో గుర్తింపు పొందాడు మున్రో. ఇక అతడి కెరీర్ విషయానికి వస్తే.. 2012లో కొలిన్ మున్రో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. 57 వన్డేలు, 65 టీ20 మ్యాచ్‌లను ఆడాడు. వన్డేల్లో 1,271, టీ20ల్లో 1,724 పరుగులు చేశాడు. టీ20ల్లో దంచికొట్టే బ్యాటర్ గా పేరున్న మున్రోకు వరల్డ్ కప్ లో చోటు దక్కకపోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.
Colin Munro has announced his retirement from international cricket. pic.twitter.com/TIKfrYcy1Q
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 10, 2024