Nidhan
Anshul Kamboj 5 Wickets Haul In Duleep Trophy: పేస్, బౌన్స్, స్వింగ్ ఉన్న పిచ్‌పై పేసర్లు వికెట్ల పండుగ చేసుకుంటారు. అయితే పిచ్ నుంచి ఏమాత్రం హెల్ప్ దొరకకపోయినా వికెట్లు తీయడం కొందరికే సాధ్యం. అలాంటి అరుదైన పెర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నాడు ఓ ముంబై ఇండియన్స్ బౌలర్.
Anshul Kamboj 5 Wickets Haul In Duleep Trophy: పేస్, బౌన్స్, స్వింగ్ ఉన్న పిచ్‌పై పేసర్లు వికెట్ల పండుగ చేసుకుంటారు. అయితే పిచ్ నుంచి ఏమాత్రం హెల్ప్ దొరకకపోయినా వికెట్లు తీయడం కొందరికే సాధ్యం. అలాంటి అరుదైన పెర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నాడు ఓ ముంబై ఇండియన్స్ బౌలర్.
Nidhan
పేస్, బౌన్స్, స్వింగ్ ఉన్న పిచ్‌పై పేసర్లు వికెట్ల పండుగ చేసుకుంటారు. అయితే జీవం లేని పిచ్‌లు కనిపిస్తే మాత్రం భయపడిపోతారు. పిచ్ నుంచి హెల్ప్ దొరక్కపోతే వికెట్లు పడగొట్టడం అంత ఈజీ కాదు. అందునా సవాల్ విసిరే టెస్టుల్లో నిర్జీవమైన పిచ్‌ల మీద వికెట్లు తీయడం ఎంతటి తోపు పేసర్కైనా కష్టమే. కానీ కొందరు మాత్రం ఈ పనిలో స్పెషలిస్ట్‌లుగా పేరు తెచ్చుకున్నారు. కండీషన్స్‌కు భయపడకుండా బ్యాటర్ల వీక్నెస్, తమ స్ట్రెంగ్త్‌ను నమ్ముకొని పర్ఫెక్ట్ లైన్ అండ్ లెంగ్త్‌లో బంతులు వేస్తూ బ్యాటర్లను వణికిస్తుంటారు. అలాంటి అరుదైన పెర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నాడో ముంబై ఇండియన్స్ బౌలర్. అతడే అన్షుల్ కాంబోజ్. దులీప్ ట్రోఫీ సెకండ్ రౌండ్లో స్టన్నింగ్ స్పెల్‌తో అందర్నీ ఇంప్రెస్ చేశాడీ పేసర్. స్టార్ బ్యాటర్లను ఓ ఆటాడుకున్నాడు.
దులీప్ ట్రోఫీలో ఇండియా-సీ తరఫున బరిలోకి దిగిన అన్షుల్ కాంబోజ్.. ఇండియా-బీతో మ్యాచ్‌లో సత్తా చాటాడు. ప్రత్యర్థి జట్టు టాప్-5 బ్యాటర్లను అతడే పెవిలియన్‌కు పంపించాడు. ఇండియా-బీ ఓపెనర్ నారాయణ్ జగదీషన్‌తో పాటు స్టార్ బ్యాటర్లు సర్ఫరాజ్ ఖాన్, ముషీర్ ఖాన్, రింకూ సింగ్, నితీష్ కుమార్ రెడ్డిని ఔట్ చేసి చావుదెబ్బ తీశాడీ రైటార్మ్ పేసర్. ఇందులో రెండు వికెట్లు ఎల్బీడబ్ల్యూ ద్వారా వచ్చినవే. ముషీర్, సర్ఫరాజ్‌ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్న అన్షుల్.. నితీష్ రెడ్డిని క్లీన్ బౌల్డ్ చేశాడు. పర్ఫెక్ట్ లైన్ అండ్ లెంగ్త్‌ను పట్టుకొని అందులోనే బాల్స్ వేస్తూ పోయాడతను. బ్యాటర్ల బలహీనతలను టార్గెట్ చేస్తూ ఫలితాలు రాబట్టాడు. పిచ్ నుంచి బౌన్స్, పేస్‌కు సహకారం లేకపోయినా.. బాల్ స్వింగ్ అవ్వకున్నా ఓపికతో బౌలింగ్ చేస్తూ వికెట్లు తీశాడు. అతడి నమ్మకం, కష్టం వృథా పోలేదు. 5 వికెట్లు ఖాతాలో పడ్డాయి. సర్ఫరాజ్, రింకూ, నితీష్, ముషీర్ లాంటి స్టార్లను భయపెట్టిన ఈ కుర్ర బౌలర్ గురించి మరింత తెలుసుకుందాం..
23 ఏళ్ల అన్షుల్ కాంబోజ్ సొంత రాష్ట్రం హరియాణా. ఈ ఏడాది ఐపీఎల్లో ముంబై ఇండియన్స్‌కు ఆడటం ద్వారా అతడు వెలుగులోకి వచ్చాడు. ఈ సీజన్లో ఎంఐ తరఫున అరంగేట్రం చేసిన రెండో భారతీయ బౌలర్ కాంబోజే. గతంలో అండర్-19లో సూపర్బ్ పెర్ఫార్మెన్స్‌లతో దుమ్మురేపాడతను. ఈ ఏడాది విజయ్ హజారే ట్రోఫీలోనూ సత్తా చాటాడు. 10 మ్యాచుల్లో 17 వికెట్లతో తన టాలెంట్ ఏంటో అందరీకి చూపించాడీ రైటార్మ్ పేసర్. అలా ఐపీఎల్లో ఆడే అవకాశం దక్కించుకున్నాడు. ఓవరాల్‌గా ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఆడిన 14 మ్యాచుల్లో 27 వికెట్లు తీశాడు. లిస్ట్ ఏలో 15 మ్యాచుల్లో 23 వికెట్లు పడగొట్టాడు. ఇప్పుడు దులీప్ ట్రోఫీ పెర్ఫార్మెన్స్తో మరోమారు అందరి ఫోకస్ తన మీద పడేలా చూసుకున్నాడు. మరి.. అన్షుల్ కాంబోజ్ ఫైరింగ్ స్పెల్‌పై మీ ఒపీనియన్‌ను కామెంట్ చేయండి.
ANSHUL KAMBOJ – REMEMBER THE NAME 🔥
In a flat pitch, nothing happening for bowlers but Kamboj took 5 wickets – Jagadeesan, Musheer, Sarfaraz, Rinku & Nitish Kumar Reddy.
Another scouting work by Mumbai Indians for Indian Cricket. pic.twitter.com/oRlSsj2ojF
— Johns. (@CricCrazyJohns) September 14, 2024