టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ గ్రౌండ్ లో ఎంత చురుగ్గా ఉంటాడో మనందరికి తెలిసిందే. ఫిట్ నెస్ కు, అగ్రెసివ్ నెస్ కు పెట్టింది పేరు విరాట్ కోహ్లీ. అలాంటి విరాట్ కోహ్లీకి ఓ డిజార్డర్ ఉందన్న సంచలన నిజాన్ని బయటపెట్టాడు బీసీసీఐ మాజీ చీఫ్ సెలక్టర్ MSK ప్రసాద్. తాజాగా ఓ ప్రముఖ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో విరాట్ కోహ్లీకి సంబంధించిన ఆసక్తికర విషయాలు వెల్లడించారు. వీటితో పాటుగా రాయుడు తన మీద చేసిన ఆరోపణలపై కూడా ఆయన స్పందించారు. మరి ఇంతకీ విరాట్ కోహ్లీకి ఉన్న ఆ జబ్బు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
విరాట్ కోహ్లీ.. సమకాలీన క్రికెట్ చరిత్రలో తనకంటూ ఓ హిస్టరీని క్రియేట్ చేసుకున్నాడు. ఇక గ్రౌండ్ లో ఎంత చాలాకీగా, అగ్రెసివ్ గా ఉంటాడో మనందరికి తెలియని విషయం కాదు. అలాంటి విరాట్ కోహ్లీకీ ఓ డిజార్డర్ ఉందని వెల్లడించారు బీసీసీఐ మాజీ చీఫ్ సెలక్టర్ MSK ప్రసాద్. తాజాగా ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విరాట్ కోహ్లీ గురించి అలాగే రాయుడు తనమీద చేసిన ఆరోపణల గురించి చెప్పుకొచ్చాడు. విరాట్ గ్రౌండ్ లో చాలా కోపంగా ఉంటాడని ఎమ్మెస్కే ప్రసాద్ అన్నారు.
ఈ క్రమంలోనే ఒక్కోసారి మన ముఖంలోకి చాలా కోపంగా చూస్తాడని, అప్పుడు కొడతాడా అన్నంత భయం వేస్తుందని ఆయన తెలిపారు. ఇక విరాట్ కోహ్లీకి ఓసీడీ జబ్బు ఉందని వెల్లడించారు ఎమ్మెస్కే. టేబుల్ పై కాఫీ చుక్క పడితే వెంటనే దాన్ని టవల్ తో తుడిచి మళ్లీ ఆ టవల్ ను ఆరేస్తాడని ఎమ్మెస్కే ప్రసాద్ చెప్పుకొచ్చాడు. ఇక అంబటి రాయుడిని నేను తొక్కలేదని ఎమ్మెస్కే ప్రసాద్ అన్నారు. ఇక తాను క్రికెటర్ ఎలా అవ్వాలి అనుకున్నారో ఈ ఇంటర్వ్యూలో వివరించారు ఎమ్మెస్కే ప్రసాద్.