మహేంద్ర సింగ్ ధోని.. ప్రశాంతతకు మరో పేరు. అలాంటి ధోనిని కోపంతో ఊగిపోవడం మీరెప్పుడైనా చూశారా? అయితే ఈ వీడియోలో చూడండి.
మహేంద్ర సింగ్ ధోని.. ప్రశాంతతకు మరో పేరు. అలాంటి ధోనిని కోపంతో ఊగిపోవడం మీరెప్పుడైనా చూశారా? అయితే ఈ వీడియోలో చూడండి.
మహేంద్ర సింగ్ ధోని.. ప్రశాంతత, నెమ్మది తనానికి మారు పేరుగా ప్రపంచ క్రికెట్ లో తనదైన ముద్ర వేసుకున్నాడు. నరాలు తెగే ఉత్కంఠ మ్యాచ్ ల్లో ప్రేక్షకులు ఊపిరిబిగపట్టి చూస్తుంటే.. ధోని మాత్రం తుఫాన్ ముందు ఎంత ప్రశాంతంగా ఉంటుందో.. అంతే ప్రశాంతగా కనిపిస్తాడు. ఇక గ్రౌండ్ లో ధోని ఇతర ఆటగాళ్లపై కోప్పడిన సందర్భాలు వేళ్లపై లెక్కించవచ్చు. ప్రత్యర్థి ప్లేయర్లను కవ్వించడం ధోని డిక్షనరీలోనే లేదు. అలాంటి ధోని, ఓ మ్యాచ్ లో కోపంతో ఊగిపోయాడు. ఓ మ్యాచ్ లో పాక్ ఆటగాడిని రనౌట్ చేసే సందర్భంలో ఎప్పుడూ చూడని ధోనిని ప్రేక్షకులకు చూపించాడు. ప్రస్తుతం ఈ రనౌట్ కు సంబంధించిన పాత వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
మహేంద్ర సింగ్ ధోని.. థ్రిల్లింగ్ మ్యాచ్ చేజారి పోతున్నా, ఎంతో ప్రశాంతంగా మ్యాచ్ ను ప్రత్యర్థి చేతిలో నుంచి తనవైపు లాక్కుని జట్టుకు తిరుగులేని విజయాలను అందిస్తూ ఉంటాడు. ఇలాంటి లెక్కలేనన్ని విజయాలు టీమిండియాకు అందించాడు. ఇక ధోని లాంటి మిస్టర్ కూల్ కెప్టెన్ ప్రపంచంలోనే లేడు అంటే అతిశయోక్తి కాదు. అంతలా గ్రౌండ్ లో ప్రశాంతంగా కదులుతూ.. ప్రత్యర్థి ప్లేయర్లను తన ప్రణాళికలతో బురిడీ కొట్టిస్తుంటాడు. కాగా.. కూల్ నెస్ కు పర్యాయ పదంగా ఉన్న ధోనిని మైదానంలో కోపంగా చూసిన సందర్భాలు చాలా తక్కువ. గెలవాల్సిన మ్యాచ్ ఓడిపోతున్నా గానీ.. సహచర ఆటగాళ్లపై నోరు జారడు ధోని. మరి అలాంటి ధోని గ్రౌండ్ లో కోపంతో ఊగిపోవడం మీరెప్పుడైనా చూశారా? కానీ ఈ మ్యాచ్ లో మాత్రం ధోని రుద్రుడి వలే ఊగిపోయాడు. అందుకు సంబంధించిన ఓల్డ్ వీడియో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది.
అది ఇండియా-పాక్ మ్యాచ్. పాక్ విజయానికి ఇంకా 37 బంతుల్లో 65 పరుగులు కావాలి. అప్పటికి పాక్ 6 వికెట్లు కోల్పోయి 231 రన్స్ చేసింది. ఈ క్రమంలో ఆర్పీ సింగ్ బౌలింగ్ లో అనవసర రన్ కోసం ప్రత్నించారు పాక్ క్రికెటర్లు. అదే సమయంలో బాల్ ను అందుకున్న ఆర్పీ సింగ్ డైరెక్ట్ గా ధోనికి విసిరాడు. అంతే బాల్ అందుకున్న ధోని ఉగ్రుడై వికెట్లను కసి తీరా బలంగా కొట్టాడు. దీంతో పెవిలియన్ బాట పట్టాడు దాయాది బ్యాటర్. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ కావడంతో.. నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. ధోనిని ఇంతకు ముందెన్నడూ ఇలా చూడలేదని కొందరు అభిమానులు కామెంట్స్ చేస్తుండగా.. పాక్ అంటే ధోని ఇలాగే రెచ్చిపోతాడు అంటూ మరికొందరు రాసుకొస్తున్నారు. మరి ధోని ఇలాంటి రనౌట్ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.