Somesekhar
భారతదేశ అత్యున్నత రెండో క్రీడా పురస్కారం అర్జున అవార్డను దక్కించుకున్నాడు వరల్డ్ కప్ హీరో మహ్మద్ షమీ.
భారతదేశ అత్యున్నత రెండో క్రీడా పురస్కారం అర్జున అవార్డను దక్కించుకున్నాడు వరల్డ్ కప్ హీరో మహ్మద్ షమీ.
Somesekhar
జాతీయ క్రీడా అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2023 సంవత్సరానికిగాను కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఈ అవార్డులను ప్రకటించింది. అందులో భాగంగా.. భారతదేశ అత్యున్నత రెండో క్రీడా పురస్కారం అర్జున అవార్డను దక్కించుకున్నాడు వరల్డ్ కప్ హీరో మహ్మద్ షమీ. అర్జున అవార్డుకు మహ్మద్ షమీతో పాటుగా 26 మంది ఎంపికైయ్యారు. ఈ అవార్డులను 2024 జనవరి 09న భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతుల మీదుగా అందుకోనున్నాడు.
టీమిండియా వరల్డ్ కప్ హీరో మహ్మద్ షమీకి భారత అత్యున్నత రెండో క్రీడా పురస్కారం అయిన అర్జున అవార్డును ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. 2023 సంవత్సరానికిగాను ఈ పురస్కారాలను కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ జాతీయ క్రీడా అవార్డులను ప్రకటించింది. ఈ అవార్డుల్లో భాగంగా.. టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ అర్జున అవార్డుకు ఎంపికై అందరి ప్రశంసలు దక్కించుకున్నాడు. ఈ అవార్డును జనవరి 9, 2024న భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతులమీదుగా అందుకోనున్నారు. అర్జున అవార్డుకు 26 మంది, ద్రోణాచార్య అవార్డు రెగ్యూలర్ కేటగిరీలో ఐదుగురు ఎంపికైయ్యారు. ఇక భారత స్టార్ బ్యాడ్మింటన్ జోడీ సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టి దేశ అత్యున్నత క్రీడా పురస్కారం అయిన మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డును అందుకోనున్నారు. మరి మహ్మద్ షమీకి అర్జున అవార్డు ప్రకటించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Mohamed Shami will receive the Arjuna Award from the President on January 9th.
– Shami, legend of Indian cricket. pic.twitter.com/CxOx1vLZ0k
— Johns. (@CricCrazyJohns) December 20, 2023