ఇంజెక్షన్లు తీసుకొని వరల్డ్‌ కప్‌ ఆడా! సంచలన విషయాలు బయటపెట్టిన షమీ

ఇటీవల ముగిసిన వన్డే వరల్డ్‌ కప్‌ 2023లో టీమిండియా స్టార్‌ పేసర్‌ మొహమ్మద్‌ షమీ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. 7 మ్యాచ్‌ల్లో 24 వికెట్లతో విజయం సాధించి.. టోర్నీలోనే టాప్‌ వికెట్‌ టేకర్‌గా నిలిచాడు. అయితే.. ఓ వరల్డ్‌ కప్‌లో తాను ఇంజెక్షన్లు తీసుకోని ఆడినట్లు షమీ వెల్లడించాడు.

ఇటీవల ముగిసిన వన్డే వరల్డ్‌ కప్‌ 2023లో టీమిండియా స్టార్‌ పేసర్‌ మొహమ్మద్‌ షమీ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. 7 మ్యాచ్‌ల్లో 24 వికెట్లతో విజయం సాధించి.. టోర్నీలోనే టాప్‌ వికెట్‌ టేకర్‌గా నిలిచాడు. అయితే.. ఓ వరల్డ్‌ కప్‌లో తాను ఇంజెక్షన్లు తీసుకోని ఆడినట్లు షమీ వెల్లడించాడు.

టీమిండియా స్టార్‌ క్రికెట్‌ మొహమ్మద్‌ షమీ.. వన్డే వరల్డ్‌ కప్‌ 2023లో అద్భుత ప్రదర్శన కనబర్చాడు. ఆరంభంలో తొలి నాలుగు మ్యాచ్‌లు ఆడే అవకాశం షమీకి రాకపోయినా.. ఒక్కసారి టీమ్‌లోకి వచ్చిన తర్వాత తన సత్తా ఏంటో చూపించాడు. ప్రత్యర్థి బ్యాటర్లను బెంబేలెత్తిస్తూ.. నిప్పులు చెరిగే బంతులతో దుమ్ములేపాడు. కేవలం 7 మ్యాచ్‌ల్లో 24 వికెట్లు పడగొట్టి టోర్నీలో టాప్‌ వికెట్‌ టేకర్‌గా నిలిచాడు. అయితే.. వరుసగా పది మ్యాచ్‌లు గెలిచిన టీమిండియా.. ఫైనల్లో ఓటమి పాలవ్వడం భారత క్రికెట్‌ అభిమానులను తీవ్రంగా నిరాశపర్చింది. ఒక్క ఓటమి వందకోట్ల మంది హృదయాలను ముక్కలు చేసింది. వరల్డ్‌ కప్‌ ఫైనల్లో ఎదురైన ఓటమి నుంచి ఇప్పుడిప్పుడే భారత్‌ ఆటగాళ్లు, క్రికెట్‌ అభిమానులు బయటపడుతున్నారు. ఈ క్రమంలో షమీ.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.

తాజాగా ముగిసిన వన్డే వరల్డ్‌ కప్‌ గురించి పలు విషయాలు వెల్లడించిన షమీ.. అలాగే 2015 వన్డే వరల్డ్‌ కప్‌ సందర్భంగా తాను ఎదుర్కొన్న ఇబ్బందులను, పడిన బాధలను కూడా షమీ ప్రస్తావించాడు. ఆ వరల్డ్‌ కప్‌ కోసం తాను పూర్తిగా ఫిట్‌గా లేనని అయినా కూడా దేశంలో ఆడాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. భరించలేని నొప్పితో గ్రౌండ్‌లోకి దిగి జట్టు కోసం ఆడానని అన్నాడు. నా ప్లేస్‌లో వేరే వాళ్లు ఉంటే అంత నొప్పి భరించేవాళ్లు కాదేమో అని పేర్కొన్నాడు. అయితే మ్యాచ్‌ ఆడి వచ్చిన వెంటనే తాను నేరుగా ఆస్పత్రికి వెళ్లి నొప్పికి ఇంజెక్షన్లు తీసుకునే వాడినని తెలిపాడు. ప్రతి ఆడిన మ్యాచ్‌ తర్వాత అలాగే చేశానన్నాడు.

2015 వరల్డ్‌ కప్‌లో మొత్తం 7 మ్యాచ్‌లు ఆడిన షమీ.. 17 వికెట్లు తీశాడు. ఒక మ్యాచ్‌లో 35 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీసి అద్భుత ప్రదర్శన కనబర్చాడు. ఆ టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన నాలుగో బౌలర్‌గా నిలిచాడు. ఆ వరల్డ్‌ కప్‌లో టీమిండియా సెమీ ఫైనల్‌ వరకు వెళ్లింది. భారత్‌ సెమీస్‌ చేరడంతో షమీ కీలక పాత్ర పోషించాడు. ఇక ఆ టోర్నీ నుంచి షమీ వెనుదిరిగి చూడలేదు. భారత జట్టులో అద్భుత బౌలర్‌గా ఎదిగాడు. వరల్డ్‌ కప్స్‌లో అనిల్ కుంబ్లే, జహీర్ ఖాన్, జవగల్ శ్రీనాథ్ వంటి లెజెండ్స్‌ను దాటి.. ప్రపంచ కప్ టోర్నమెంట్‌లో 18 మ్యాచ్‌లలో 55 వికెట్లు పడగొట్టి టీమిండియా తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. మరి ఈ వరల్డ్‌ కప్‌లో షమీ ప్రదర్శనతో పాటు.. 2015లో ఇంజెక్షన్లు తీసుకుని, నొప్పిని భరిస్తూ.. వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌లు ఆడటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments