వీడియో: డెడ్లీ యార్కర్‌.. బ్యాటర్‌కు తీవ్ర గాయం! గ్రౌండ్‌ నుంచి బయటికి..

వీడియో: డెడ్లీ యార్కర్‌.. బ్యాటర్‌కు తీవ్ర గాయం! గ్రౌండ్‌ నుంచి బయటికి..

Mitchell Starc, Shamar Joseph: ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో వెస్టిండీస్‌ బ్యాటర్‌ తీవ్రంగా గాయపడ్డాడు. పైగా ఒక నో బాల్‌కు ఈ ఘటన జరగడం దారుణం. దీంతో ఆసీస్‌ తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

Mitchell Starc, Shamar Joseph: ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో వెస్టిండీస్‌ బ్యాటర్‌ తీవ్రంగా గాయపడ్డాడు. పైగా ఒక నో బాల్‌కు ఈ ఘటన జరగడం దారుణం. దీంతో ఆసీస్‌ తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

క్రికెట్‌లో ఆటగాళ్లు గాయపడటం సాధారణంగా జరుగుతూనే ఉంటుంది. కొన్ని సార్లు చాలా సీరియస్‌ గాయాలు కూడా అవుతుంటాయి. తాజాగా ఆస్ట్రేలియా-వెస్టిండీస్‌ మధ్య జరుతున్న రెండో టెస్టులోనూ అలాంటి ఒక సంఘటనే చోటు చేసుకుంది. ఆసీస్‌ స్పీడ్‌స్టర్‌ మిచెల్‌ స్టార్క్‌ బౌలింగ్‌లో వెస్టిండీస్‌ బ్యాటర్‌ తీవ్రంగా గాయపడ్డాడు. అయితే.. ఇందులో దారుణం ఏంటంటే.. అది నో బాల్‌ కావడం. స్టార్క్‌ వేసిన నో బాల్‌కు ఆటగాడు గాయపడి.. గ్రౌండ్‌ బయటికి వెళ్లిపోయాడు. ఇది వెస్టిండీస్‌కు పెద్ద ఎదురుదెబ్బ అనే చెప్పాలి.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మిచెల్‌ స్టార్క్‌ వేసిన ఇన్నింగ్స్‌ 73వ ఓవర్‌ నాలుగో బంతిని ఆడటంతో వెస్టిండీస్‌ బ్యాటర్‌ షమర్‌ జోసెఫ్‌ విఫలం అయ్యాడు. దాంతో ఆ డెడ్లీ యార్కర్‌ నేరుగా వెళ్లి కుడి కాలి బొటన వేలిపై తాకింది. బాల డైరెక్ట్‌గా తాకడంతో జోసెఫ్‌ కాలికి తీవ్ర గాయమైంది. ఆ నొప్పితో అతను అల్లాడి పోయాడు. ఆస్ట్రేలియా దానికి కూడా అపీల్‌ చేయడంతో.. అంపైర్‌ లెగ్‌ బిఫోర్‌గా అవుట్‌ ఇచ్చాడు. కానీ, రీప్లేలో స్టార్క్‌ లైన్‌ను క్రాస్‌ చేసి ఓవర్‌ స్టెప్‌ వేయడంతో దాన్ని నో బాల్‌గా పరిగణించారు. దీంతో జోసెఫ్‌ నాటౌట్‌గా నిలిచాడు. నో బాల్‌ కారణంగా లెగ్‌ బిఫోర్‌ అవుట్‌ నుంచి బతికిపోయినా.. బాల్‌ తగిలిన నొప్పిని మాత్రం తట్టుకోలేకపోయాడు జోసెఫ్‌. కాలి వేళ్లకు గాయం కావడంతో అతను రిటైర్డ్‌ హర్ట్‌గా గ్రౌండ్‌ వీడాల్సి వచ్చింది. అదే చివరి వికెట్‌ కావడంతో.. వెస్టిండీస్‌ రెండో ఇన్నింగ్స్‌ 193 పరుగుల వద్ద ముగిసింది.

అవుట్‌ చేసి వెస్టిండీస్‌ ఇన్నింగ్స్‌ ముగించలేకపోయిన ఆస్ట్రేలియా ఇలా నో బాల్‌తో గాయపర్చి మరీ వెస్టిండీస్‌ ఇన్నింగ్స్‌ను ముగించిందని విమర్శలు వస్తున్నాయి. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన వెస్టిండీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 311 పరుగులు చేసింది. ఆరంభంలో 5 వికెట్లు వెంటవెంటనే కోల్పోయినా.. తిరిగి పుంజుకుని అద్భుతంగా ఆడింది వెస్టిండీస్‌. ఒక ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 289 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌కు దిగిన వెస్టిండీస్‌ 193 పరుగులు మాత్రమే చేసింది. అయితే.. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాకు యువ క్రికెటర్లతో కూడిన వెస్టిండీస్‌ గట్టి పోటీ ఇచ్చిందనే చెప్పాలి. ప్రస్తుతం ఆస్ట్రేలియా 216 పరుగుల విజయం లక్ష్యంతో బరిలోకి దిగింది. మరి ఈ మ్యాచ్‌లో స్టార్క్‌ నో బాల్‌తో జోసెఫ్‌ను గాయపర్చడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments