రోహిత్, కోహ్లీ కాదు.. ఆ భారత బ్యాటర్ ఆట చూడటం మాకిష్టం: హేడెన్

Rohit Sharma, Virat Kohli, Matthew Hayden: ప్రస్తుత టీమిండియా బ్యాటింగ్ గురించి మాట్లాడుకుంటే ఎవరికైనా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీనే గుర్తుకొస్తారు. అంతగా తమ బ్యాటింగ్ తో వీళ్లు బలమైన ముద్ర వేశారు. కానీ ఆస్ట్రేలియన్లకు మాత్రం మరో బ్యాటర్ ఆట చూడటమే ఇష్టమట.

Rohit Sharma, Virat Kohli, Matthew Hayden: ప్రస్తుత టీమిండియా బ్యాటింగ్ గురించి మాట్లాడుకుంటే ఎవరికైనా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీనే గుర్తుకొస్తారు. అంతగా తమ బ్యాటింగ్ తో వీళ్లు బలమైన ముద్ర వేశారు. కానీ ఆస్ట్రేలియన్లకు మాత్రం మరో బ్యాటర్ ఆట చూడటమే ఇష్టమట.

ప్రస్తుత టీమిండియా బ్యాటింగ్ యూనిట్ గురించి మాట్లాడితే ఎవరికైనా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీనే గుర్తుకొస్తారు. అద్భుతమైన బ్యాటింగ్ తో ఈ జోడీ వేసిన ముద్ర అలాంటిది. టన్నుల కొద్దీ పరుగులు, లెక్కలేనన్ని రికార్డులతో రోకో జోడీ మోడర్న్ లెజెండ్స్ గా పేరు తెచ్చుకున్నారు. భారత ఉపఖండంలోనే గాక ఓవర్సీస్ సిరీస్ ల్లోనూ వీళ్లు అంతే బాగా ఆడుతూ టీమిండియాకు సూపర్బ్ విక్టరీస్ అందిస్తూ వస్తున్నారు. అందుకే వీళ్లకు స్వదేశంతో బయటి దేశాల్లోనూ ఫాలోయింగ్ ఎక్కువ. అయితే ఆస్ట్రేలియా లెజెండ్ మాథ్యూ హేడెన్ మాత్రం రోహిత్-కోహ్లీ కంటే ఆ యంగ్ బ్యాటర్ గేమ్ అంటేనే తమకు ఇష్టమని అంటున్నాడు. అతడి బ్యాటింగ్ అంటే తమ దేశ అభిమానులకు పిచ్చి అని చెబుతున్నాడు. మరి.. ఆసీస్ ఫ్యాన్స్ కు అంతగా నచ్చిన ఆ భారత బ్యాటర్ ఎవరనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం..

టీమిండియా యంగ్ వికెట్ కీపర్, బ్యాట్స్ మన్ రిషబ్ పంత్ అంటే తమ దేశ ఫ్యాన్స్ కు చాలా ఇష్టమని హేడెన్ అన్నాడు. అతడు అద్భుతమైన బ్యాటర్ అంటూ ప్రశంసల్లో ముంచెత్తాడు. బౌలర్లపై అటాకింగ్ కు దిగి నిలదొక్కుకోకుండా చేయడంలో పంత్ సిద్ధహస్తుడని మెచ్చుకున్నాడు. ‘పంత్ కు మంచి మజిల్ మెమరీ ఉంది. విజయం కోసం అతడు ఏమైనా చేస్తాడు. గెలుపు తీరాలకు చేరే వరకు విశ్రమించడు. గతంలో ఆస్ట్రేలియాకు వచ్చినప్పుడు అతడి బ్యాటింగ్ ను ఇక్కడి ప్రజలు ఎంతగానో ఇష్టపడ్డారు. అతడి అటాకింగ్ నేచర్ ఇక్కడి అభిమానులకు బాగా నచ్చింది. ఇన్నోవేటివ్ షాట్లతో విరుచుకుపడతాడు. ఇలాంటి తరహా బ్యాటింగ్ అంత ఈజీ కాదు. కానీ పంత్ అలవోకగా ఆడేస్తున్నాడు’ అని హేడెన్ ప్రశంసించాడు.

పంత్ తో పాటు విరాట్ కోహ్లీ కూడా ఈసారి ఆసీస్ టూర్ లో రెచ్చిపోయి ఆడేందుకు ప్రయత్నిస్తాడని హేడెన్ తెలిపాడు. కంగారూ కండీషన్స్ కు తగ్గట్లు భారత్ ఎలాంటి స్ట్రాటజీలతో బ్యాటింగ్ చేస్తుందో చూసేందుకు ఆసక్తిగా ఉన్నానని పేర్కొన్నాడు. ఇక, 2021లో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో పంత్ ఏ రేంజ్ లో బ్యాటింగ్ లో అదరగొట్టాడో తెలిసిందే. గబ్బాలో కంగారూలను ఓడించడం బిగ్ టీమ్స్ డ్రీమ్. అలాంటి గ్రౌండ్ లో ఆ టీమ్ ను చిత్తు చేసింది భారత్. ఆ టెస్ట్ లో 138 బంతుల్లో 89 పరుగుల ఇన్నింగ్స్ తో అదరగొట్టాడు పంత్. ఈ టెస్ట్ తో పాటు ఆ సిరీస్ లో పంత్ ఆడిన ధనాధన్ ఇన్నింగ్స్ లు ఆసీస్ అభిమానులకు బాగా నచ్చినట్లున్నాయి. అందుకే హేడెన్ పైవ్యాఖ్యలు చేశాడు. ఈ ఏడాది ఆఖర్లో మరోమారు బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియాకు పయనం కానుంది టీమిండియా. ఈసారి పంత్ ఎలా ఆడతాడో చూడాలి.

Show comments