లక్నో సూపర్‌ జెయింట్స్‌కు భారీ ఎదురుదెబ్బ! స్టార్‌ బౌలర్‌ IPLకు దూరం!

Shivam Mavi, LSG, IPL 2024: ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో మంచి ప్రదర్శనతో రాణిస్తున్న లక్నో సూపర్‌ జెయింట్స్‌కు తాజాగా ఓ భారీ షాక్‌ తగిలింది. ఆ జట్టులోని ఓ స్టార్‌ బౌలర్‌ ఐపీఎల్‌ 2024 సీజన్‌ మొత్తానికి దూరం అయ్యాడు. దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం..

Shivam Mavi, LSG, IPL 2024: ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో మంచి ప్రదర్శనతో రాణిస్తున్న లక్నో సూపర్‌ జెయింట్స్‌కు తాజాగా ఓ భారీ షాక్‌ తగిలింది. ఆ జట్టులోని ఓ స్టార్‌ బౌలర్‌ ఐపీఎల్‌ 2024 సీజన్‌ మొత్తానికి దూరం అయ్యాడు. దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం..

ఐపీఎల్‌ 2024లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ మూడు మ్యాచ్‌ల్లో రెండు విజయాలతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. ఇలాంటి కీలకమైన టైమ్‌లో ఆ టీమ్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ టీమ్‌లోని ఓ స్టార్‌ బౌలర్‌ ఐపీఎల్‌కు పూర్తి దూరం అయ్యాడు. అయితే.. లక్నో స్పీడ్‌ బౌలర్‌ అనగానే చాలా మంది యువ సంచలనం మయాంక్‌ యాదవ్‌ అని కంగారు పడి ఉంటారు. అయితే.. ఇప్పుడు ఐపీఎల్‌కు దూరమైంది మయాంక్‌ యాదవ్‌ కాదులేండి. టీమిండియా పేసర్‌ శివమ్‌ మావీ. ఈ బౌలర్‌ ఐపీఎల్‌ 2024 సీజన్‌ మొత్తానికి దూరమైనట్లు సమాచారం.

టీమిండియా తరఫున 6 టీ20 మ్యాచ్‌లు ఆడిన మావీ.. ఐపీఎల్‌లో కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌కు ఆడి మంచి పేరు తెచ్చుకున్నాడు. అయితే.. ఐపీఎల్‌ 2023 సీజన్‌లో గుజరాత్‌ టైటాన్స్‌కు ప్రాతినిథ్యం వహించిన అతను.. ఆ సీజన్లో ఒక్క మ్యాచ్‌ కూడా ఆడలేదు. ఐపీఎల్‌ 2024 సీజన్‌ కోసం జరిగిన వేలంలో శివమ్‌ మావీని లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఏకంగా రూ.6.40 కోట్ల భారీ ధర పెట్టి కొనుగోలు చేసింది. లక్నోకు ఆడిన ఆవేశ్ ఖాన్‌.. రాజస్థాన్‌ రాయల్స్‌కు మారడంతో అతని ప్లేస్‌ను భర్తీ చేసేందుకు మావీని అంత రేట్‌ పెట్టి కొనుగోలు చేసింది ఎల్‌ఎస్‌జీ. అయితే ఇప్పుడు గాయంతో మావీ పూర్తి ఐపీఎల్ సీజన్‌కు దూరం అయ్యాడు.

అయితే.. మావీ లేకపోయినా లక్నో టీమ్‌పై పెద్దగా ప్రభావం పడే ప్రమాదం కనిపించడం లేదు. ఎందుకంటే.. ఆ టీమ్‌లో మయాంక్‌ యాదవ్‌ అనే కుర్రాడు దుమ్మరేపుతున్నాడు. మార్చి 30న పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో మయాంక్‌ యాదవ్‌ 4 ఓవర్లలో 27 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టి మ్యాచ్‌నే ములుపు తిప్పేశాడు. పంజాబ్‌ వైపు ఉన్న మ్యాచ్‌ను లక్నో వైపు లాగేశాడు. అలాగే మంగళవారం ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో అయితే.. ఆర్సీబీ ఓటమిని శాసించాడు. 4 ఓవర్లలో కేవలం 14 రన్స్‌ ఇచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టాడు. అతనికి తోడు నవీన్‌ ఉల్‌ హక్‌, రవిబిష్ణోయ్‌, సిద్ధార్థ్‌, యశ్‌ ఠాకూర్‌, స్టోయినీస్‌తో కూడిన బౌలింగ్‌ ఎటాక్‌తో లక్నో పటిష్టంగానే ఉంది. మరి శివమ్‌ మావీ గాయంతో ఐపీఎల్‌కు దూరం కావడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments