Gambhir-Sreesanth: గంభీర్ తో గొడవ.. శ్రీశాంత్ కు లీగల్ నోటీసులు జారీ!

Sreesanth: గంభీర్ తో గొడవ.. శ్రీశాంత్ కు లీగల్ నోటీసులు జారీ!

  • Author Soma Sekhar Updated - 05:56 PM, Fri - 8 December 23

Sreesanth: గౌతమ్ గంభీర్-శ్రీశాంత్ మధ్య లెజెండ్స్ లీగ్ క్రికెట్ లో జరిగిన గొడవ ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఈ వివాదంలో శ్రీశాంత్ కు లీగల్ నోటీసులు జారీ చేశారు.

Sreesanth: గౌతమ్ గంభీర్-శ్రీశాంత్ మధ్య లెజెండ్స్ లీగ్ క్రికెట్ లో జరిగిన గొడవ ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఈ వివాదంలో శ్రీశాంత్ కు లీగల్ నోటీసులు జారీ చేశారు.

  • Author Soma Sekhar Updated - 05:56 PM, Fri - 8 December 23

లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2023లో భాగంగా ఇటీవల గుజరాత్ జెయింట్స్ వర్సెస్ ఇండియా క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరగగా.. ఈ పోరులో టీమిండియా మాజీ ఆటగాళ్లు అయిన గౌతమ్ గంభీర్, శ్రీశాంత్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఇద్దరు ఆటగాళ్లు ఒకరినొకరు కొట్టుకునేదాక పోయింది ఈ గొడవ. సహచర ఆటగాళ్లు, అంపైర్లు ఇద్దరికి సర్దిచెప్పడంతో గ్రౌండ్ లో గొడవ సద్దుమణిగింది. కానీ బయటకి వచ్చాక గంభీర్ తనను ఫిక్సర్ అంటూ అసభ్యకర పదజాలంతో దూషించాడని సోషల్ మీడియా వేదికగా వీడియోలో వెల్లడించాడు. ఈ నేపథ్యంలో శ్రీశాంత్ కు లీగల్ నోటీసులు జారీ చేశారు లెజెండ్స్ లీగ్ క్రికెట్ టోర్నీ నిర్వాహకులు.

గౌతమ్ గంభీర్-శ్రీశాంత్ మధ్య లెజెండ్స్ లీగ్ క్రికెట్ లో జరిగిన గొడవ ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. వీరిద్దరూ బాహాబాహీకి దిగడంతో తోటి ఆటగాళ్లు, అంపైర్లు వారికి సర్దిచెప్పారు. ఇక ఈ వివాదంపై శ్రీశాంత్ వీడియో రూపంలో తన వాదన వినిపించాడు. అందులో గంభీర్ తనను ఫిక్సర్ అన్నాడని, బూతులు తిట్టాడని, సెహ్వాగ్ లాంటి స్టార్ క్రికెటర్లకు కూడా కనీస మర్యాద ఇవ్వడని చెప్పుకొచ్చాడు శ్రీశాంత్. తొలుత గంభీర్ తనను తిట్టిన తిట్లను చెప్పనని ప్రకటించి.. ఆ తర్వాత మరో వీడియోలో శ్రీశాంత్ వాటిని చెప్పుకొచ్చాడు. ఈ విషయమై LLC టోర్నీ నిర్వాహకులు శ్రీశాంత్ కు లీగల్ నోటీసులు పంపించారు.

శ్రీశాంత్ సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేయడంతో.. టోర్నమెంట్ కాంట్రాక్ట్ నిబంధనలను ఉల్లంఘించాడని నిర్వాహకులు పేర్కొన్నారు. ఇక అతడు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో డిలీట్ చేసిన తర్వాతే అతడితో చర్చలు జరుపుతామని యాజమాన్యం తెలిపింది. ఇదిలా ఉండగా.. అంపైర్లు ఇచ్చిన నివేదికలో గంభీర్ శ్రీశాంత్ ను ఫిక్సర్ అన్నాడని ఎక్కడా పేర్కొనకపోవడం గమనార్హం. దీంతో స్టార్ పేసర్ చుట్టూ ఉచ్చుబిగిస్తోంది. ఇక ఈ వివాదంపై గంభీర్ ఇప్పటి వరకు డైరెక్ట్ గా స్పందించలేదు. కానీ పరోక్షంగా స్పందిస్తూ..”ప్రపంచం మెుత్తం నీ మీద దృష్టిపెట్టినప్పుడు నువ్వు ఒక చిరునవ్వు నవ్వు” అంటూ తాను నవ్వుతున్న పిక్ ను పోస్ట్ చేశాడు గంభీర్. మరి శ్రీశాంత్ కు లీగల్ నోటీసులు ఇవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments