వీడియో: మంచి మనుసు చాటుకున్న హార్ధిక్‌ పాండ్యా అన్న! సోషల్‌ మీడియా షేక్‌..

Krunal Pandya: ఐపీఎల్‌ 2024లో అత్యంత ఎక్కువగా ట్రోలింగ్‌కు గురైన క్రికెటర్‌ హార్ధిక్‌ పాండ్యా. కానీ, అతని అన్న కృనాల్‌ పాండ్యా మాత్రం క్రికెట్‌ అభిమానుల హృదయాలను గెలుచుకుంటున్నాడు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం..

Krunal Pandya: ఐపీఎల్‌ 2024లో అత్యంత ఎక్కువగా ట్రోలింగ్‌కు గురైన క్రికెటర్‌ హార్ధిక్‌ పాండ్యా. కానీ, అతని అన్న కృనాల్‌ పాండ్యా మాత్రం క్రికెట్‌ అభిమానుల హృదయాలను గెలుచుకుంటున్నాడు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం..

ఐపీఎల్‌ 2024 ప్రారంభం అయినప్పటి నుంచి టీమిండియా క్రికెటర్‌, ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌గా ఉన్న హార్ధిక్‌ పాండ్యా ఎంత దారుణమైన ట్రోలింగ్‌ జరుగుతుందో చూస్తూనే ఉన్నాం. సోషల్‌ మీడియాలోనే కాదు.. ఏకంగా స్టేడియంలో కూడా పాండ్యాను క్రికెట్‌ అభిమానులు దారుణంగా అవమానిస్తున్నారు. ఇంతకీ పాండ్యా చేసిన తప్పు ఏంటంటే.. తనను కెప్టెన్‌గా ఉండమని ముంబై ఇండియన్స్‌ జట్టు కోరితే అందుకు ఒప్పుకోవడమే పాండ్యా చేసిన తప్పు. అయితే.. అది రోహిత్‌ శర్మ ప్లేస్‌లో కెప్టెన్‌ అవ్వడంతో ఫ్యాన్స్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే.. ఒక వైపు పాండ్యాను క్రికెట్‌ అభిమానులు ట్రోల్ చేస్తూనే.. వాళ్ల అన్న కృనాల్‌ పాండ్యాపై మాత్రం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఎందుకో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

కృనాల్ పాండ్యా లక్నో సూపర్‌ జెయింట్స్‌ టీమ్‌లో కీ ప్లేయర్‌గా ఉన్న విషయం తెలిసిందే. బ్యాటింగ్‌తో పాటు ముఖ్యంగా బౌలింగ్‌లో ఎల్‌ఎస్‌జీకి కొండంత అండగా మారిపోయాడు. అతని టీమ్‌ కూడా ఈ ఐపీఎల్‌ సీజన్‌లో మంచి ప్రదర్శన చేస్తోంది. 8 మ్యాచ్‌ల్లో ఐదు విజయాలు, 3 ఓటములతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. లక్నో టీమ్‌ విషయం పక్కనపెడితే.. ఇటీవల కృనాల్‌ తన ఫ్యాన్స్‌ కోసం ఒక మంచి పని చేశాడు. గ్రౌండ్‌లో దాహంతో అలమటిస్తున్న కొంతమంది అభిమానులకు.. ఆటగాళ్ల డగౌట్‌లో ఉండే వాటర్‌ బాటిల్స్‌, కూల్‌డ్రింక్స్‌ను అందించిన తన మంచి మనుసును చాటుకున్నాడు. ఫ్యాన్స్‌కు వాటర్‌ బాటిల్స్‌ ఇస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన క్రికెట్‌ అభిమానులు హార్ధిక్‌ పాండ్యా వాళ్ల అన్న ఇంత మంచోడా అంటూ ఆశ్చర్యపోతున్నారు.

అయితే.. ఒక వైపు తమ్ముడిపై సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌ జరుగుతుంటే.. అన్నపై మాత్రం ప్రశంసల వర్షం కురుస్తుండటం విశేషం. కాగా, హార్ధిక్‌ పాండ్యా, కృనాల్‌ పాండ్యా గతంలో ఇద్దరు కలిసి ముంబై ఇండియన్స్‌కు ఆడిన విషయం తెలిసిందే. అయితే.. 2022 ఐపీఎల్‌ సందర్భంగా హార్దిక్‌ పాండ్యా గుజరాత్‌ టైటాన్స్‌ టీమ్‌కు వెళ్లిపోతే, కృనాల్‌ను వేలంలో లక్నో కొనుగోలు చేసింది. అయితే.. ఈ ఐపీఎల్‌ సీజన్‌ కంటే ముందు గుజరాత్‌ను వీడి పాండ్యా ముంబై ఇండియన్స్‌కు వచ్చేసిన విషయం తెలిసిందే. ముంబైలోకి వచ్చిన పాండ్యాకు ఆ టీమ్‌ మేనేజ్‌మెంట్‌ కెప్టెన్సీ బాధ్యతలు కూడా అప్పగించింది. అప్పటి నుంచి పాండ్యాపై ట్రోలింగ్‌ జరుగుతుంది. మరి హార్దిక్‌ని తిడుతున్న ఫ్యాన్సే కృనాల్‌ను మెచ్చుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments