Kraigg Brathwaite: ఆసీస్ పై విజయం.. దిగ్గజ ప్లేయర్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన విండీస్ కెప్టెన్!

27 సంవత్సరాల తర్వాత ఆసీస్ గడ్డపై తొలి విజయం సాధించింది వెస్టిండీస్ టీమ్. ఈ గెలుపుతో ఆసీస్ దిగ్గజ ప్లేయర్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు విండీస్ కెప్టెన్ క్రైగ్ బ్రాత్ వైట్.

27 సంవత్సరాల తర్వాత ఆసీస్ గడ్డపై తొలి విజయం సాధించింది వెస్టిండీస్ టీమ్. ఈ గెలుపుతో ఆసీస్ దిగ్గజ ప్లేయర్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు విండీస్ కెప్టెన్ క్రైగ్ బ్రాత్ వైట్.

నోటి నుంచి జారిన మాట ఎంతటి విధ్వంసాన్ని సృష్టిస్తుందో మనందరికి తెలియనిది కాదు. చరిత్రలో ఎన్నో సంఘటనలు ఇందుకు ఉదాహరణలుగా నిలిచాయి. ఒకే ఒక్క మాట ఒక వ్యక్తిని, ఒక వ్యవస్థను మార్చుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నానని అనుకుంటున్నారా? దానికీ ఓ రీజన్ ఉంది. ఆస్ట్రేలియా గడ్డపై లాంగ్ టూర్ కోసం అడుగుపెట్టింది వెస్టిండీస్ టీమ్. ఈ నేపథ్యంలో విండీస్ టీమ్ పై ఆసీస్ మాజీ దిగ్గజ క్రికెటర్ రోడ్ని హగ్ నోరుజారాడు. కరేబియన్ టీమ్ ను తన మాటలతో రెచ్చగొట్టాడు. దీంతో ఆ మాటలకు రెచ్చిపోయిన విండీస్ టీమ్ ఆసీస్ ను రెండో టెస్ట్ లో చావుదెబ్బ కొట్టింది.

గబ్బా వేదికగా జరిగిన రెండో టెస్ట్ లో వెస్టిండీస్ టీమ్ ఆసీస్ పై చరిత్రాత్మక విజయం సాధించింది. 27 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియా గడ్డపై విండీస్ టీమ్ టెస్ట్ ల్లో సాధించిన తొలి విజయం ఇది. దాంతో ఈ విజయం వెస్టిండీస్ క్రికెట్ చరిత్రలోనే స్పెషల్ గా నిలిచిపోతుంది. ఇక ఈ గెలుపును చూసి కామెంట్రీ బాక్స్ లోనే కన్నీరు పెట్టుకున్నాడు విండీస్ దిగ్గజం బ్రియన్ లారా. అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదంతా కాసేపు పక్కనపెడితే.. ఈ విజయం వెనక ఓ మోటివేషన్ ఉందని చెప్పుకొచ్చాడు విండీస్ సారథి క్రైగ్ బ్రాత్‌వైట్. మ్యాచ్ అనంతరం బ్రాత్ వైట్ మాట్లాడుతూ..

“ఈ అద్భుతమైన విజయం వెనక ఓ మోటివేషన్ ఉంది. ఆ మాటలే మా విజయానికి కారణం అయ్యాయి. ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు రోడ్ని హగ్ మమ్మల్ని ఓ మాట అన్నాడు. మేము దయనీయ స్థితిలో ఉన్నామని, విజయానికి మాకు ఆశలు లేవని మా ఆత్మగౌరవం దెబ్బతీసే విధంగా విమర్శించాడు. అతడి కామెంట్సే ఈ రోజు ఈ విజయానికి కారణం అయ్యాయి. ఇక్కడి నుంచి నేను రోడ్ని హగ్ ను అడుగుతున్నా.. ఈ మజిల్స్ నీకు సరిపోతాయి అనుకుంటా?” అంటూ తన మజిల్స్ చూపిస్తూ.. స్ట్రాంగ్ రిప్లై ఇచ్చాడు విండీస్ కెప్టెన్ క్రైగ్ బ్రాత్ వైట్. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

కాగా.. విండీస్ జట్టు ఆస్ట్రేలియాలో అడుగుపెట్టి, తొలి టెస్ట్ లో 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిపోయింది. దీంతో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ రోడ్ని హగ్ విండీస్ టీమ్ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించాడు. “వెస్టిండీస్ టీమ్ అత్యంత దయనీయమైన స్థితిలో ఉంది. ఇలాంటి టైమ్ లో వారికి విజయం సాధించడానికి అవకాశాలు కూడా లేవు” అంటూ రోడ్ని హగ్ వ్యాఖ్యానించాడు. ఈ వ్యాఖ్యలను విండీస్ ఆటగాళ్లను చాలా బాధించాయి. ఆ బాధలోంచే కసిని రగిలించి.. రెండో టెస్ట్ లో ఆసీస్ ను చావు దెబ్బకొట్టి చారిత్రక విజయం సాధించారు విండీస్ ఆటగాళ్లు. ఇక ఈ గెలుపులో యంగ్ బౌలర్ షమర్ జోసెఫ్ కీలక పాత్ర పోషించాడు. నిప్పులు చెరిగే బంతులతో ఆసీస్ బ్యాటర్లను వణికించి.. 7 వికెట్లు పడగొట్టాడు. కాగా.. ఆసీస్ దిగ్గజానికి స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడంతో విండీస్ కెప్టెన్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు. కంగారూలకు సరైన సమాధానం ఇచ్చావు, ఇది రివేంజ్ ఆఫ్ ది ఇయర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి బ్రాత్ వైట్ స్ట్రాంగ్ కౌంటర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments