IPL టీమ్స్‌ ఓనర్స్‌ మీటింగ్‌లో గొడవ! ఆ టీమ్‌ కో-ఓనర్‌ను కొట్టిన షారుఖ్‌?

Shah Rukh Khan, Ness Wadia, KKR, PBKS, IPL 2025: ఐపీఎల్‌ 2025 వేలానికి ముందు ఐపీఎల్‌లోని 10 జట్ల ఓనర్లతో జరిగిన మీటింగ్‌లో గొడవ జరిగినట్లు సమాచారం. ఈ గొడవలో కేకేఆర్‌ ఓనర్‌ షారుఖ్‌.. ఓ టీమ్‌ ఓనర్‌పై చేయి చేసుకున్నట్లు తెలుస్తోంది. అసలు గొడవేంటో వివరంగా తెలుసుకుందాం..

Shah Rukh Khan, Ness Wadia, KKR, PBKS, IPL 2025: ఐపీఎల్‌ 2025 వేలానికి ముందు ఐపీఎల్‌లోని 10 జట్ల ఓనర్లతో జరిగిన మీటింగ్‌లో గొడవ జరిగినట్లు సమాచారం. ఈ గొడవలో కేకేఆర్‌ ఓనర్‌ షారుఖ్‌.. ఓ టీమ్‌ ఓనర్‌పై చేయి చేసుకున్నట్లు తెలుస్తోంది. అసలు గొడవేంటో వివరంగా తెలుసుకుందాం..

ఐపీఎల్‌ 2025 సీజన్‌ కోసం నిర్వహించే మెగా వేలానికి ముందు బీసీసీఐ.. ఐపీఎల్‌లోని 10 జట్లు ఓనర్లతో మీటింగ్‌ ఏర్పాటు చేసింది. బుధవారం ముంబైలోని బీసీసీఐ సెంట్రల్‌ హెడ్‌ క్వార్టర్స్‌లో అన్ని జట్ల యజమానులతో బీసీసీఐ అధికారులు సమావేశం అయ్యారు. ఐపీఎల్‌ 2025 కోసం నిర్వహించే వేలం, ఆటగాళ్ల రిటెన్షన్‌, ఇంప్యాక్ట్‌ ప్లేయర్‌ రూల్‌.. పలు అంశాలపై చర్చించేందుకు ఈ మీటింగ్‌ నిర్వహించారు. అయితే.. ఈ మీటింగ్‌లో కొంతమంది ఓనర్ల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిందని సమాచారం. ముఖ్యంగా కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌ ఓనర్‌, బాలీవుడ్‌ హీరో షారుఖ్‌ ఖాన్‌, పంజాబ్ కింగ్స్‌ కో ఓనర్‌ నెస్‌ వాడియా మధ్య గొడవ జరిగిందని, ఈ క్రమంలో షారుఖ్‌ ఖాన్‌.. వాడియాపై చేయి చేసుకున్నట్లు సోషల్‌ మీడియాలో ఒక వార్త వైరల్‌ అవుతోంది.

ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిందనే విషయాన్ని జాతీయ మీడియా కూడా పేర్కొంది. ఆటగాళ్ల రిటెన్షన్‌ విధానం ఇద్దరి మధ్య గొడవకు కారణమైనట్లు సమాచారం. రిటెన్షన్‌ విధానంపై నిబంధనలు మార్చాలని.. ఎత్తమందినైనా రిటేన్‌ చేసుకునే, లేదా కనీసం ఏడుగురు ఆటగాళ్లను రిటెన్‌ చేసుకునే వెసులు బాటు కల్పించాలనే ప్రతిపాదనను షారుఖ్‌ ఖాన్‌ బీసీసీఐ ముందు పెట్టారు. అయితే.. పంజాబ్ కింగ్స్‌ కో-ఓనర్‌ వాడియా మాత్రం.. ఇద్దరు, ముగ్గురు ప్లేయర్లకు మించి రిటెన్షన్‌ అవసరం లేదని.. ఎక్కువ మంది ఆటగాళ్లు వేలంలో పాల్గొనేలా చూడాలని.. బీసీసీఐకి సూచించారు. ఈ విషయంపై ఇద్దరి మధ్య గొడవ జరిగినట్లు గెలుస్తోంది. \

పంజాబ్‌ కింగ్స్‌ ఐపీఎల్‌ 2024 సీజన్‌లో అత్యంత దారుణమైన ప్రదర్శన కనబర్చిన విషయం తెలిసిందే. అందుకే ఆ జట్టు ఓనర్‌ తమ టీమ్‌ను పూర్తిగా ప్రక్షాళన చేసి కొత్త జట్టును నిర్మించుకోవాలని చూస్తున్నారు. అందుకోసమే ఎక్కువ మంది ఆటగాళ్ల రిటెన్షన్‌ను వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు ఐపీఎల్‌ 2024లో కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌ జట్టు ఛాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. పైగా కేకేఆర్‌లో అంతా యువ క్రికెటర్లే ఉన్నారు. దాంతో.. కేకేఆర్‌ ఓనర్‌ షారుఖ్‌ తమ కోర్‌ను టీమ్‌ను వదులుకునేందుకు సిద్ధంగా లేడు. అందుకే ఆయన రిటెన్షన్‌ ప్లేయర్‌ సంఖ్యను ఎక్కువగా ఉండేలా చూడాలని కోరుతున్నారు. మరి ఈ విషయంపై ఇద్దరి మధ్య గొడవ గురించి మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments