Somesekhar
17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలోనే కోల్ కత్తా నైట్ రైడర్స్ టీమ్ సరికొత్త హిస్టరీని క్రియేట్ చేసింది. ఈ ఘనత సాధించిన ఏకైక టీమ్ గా కేకేఆర్ నిలిచింది. ఆ వివరాల్లోకి వెళితే..
17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలోనే కోల్ కత్తా నైట్ రైడర్స్ టీమ్ సరికొత్త హిస్టరీని క్రియేట్ చేసింది. ఈ ఘనత సాధించిన ఏకైక టీమ్ గా కేకేఆర్ నిలిచింది. ఆ వివరాల్లోకి వెళితే..
Somesekhar
ఐపీఎల్ 2024 సీజన్ సరికొత్త రికార్డులకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తూ వస్తోంది. ఇప్పటికే ఎన్నో క్రేజీ రికార్డులు బద్దలు అయిన విషయం తెలిసిందే. తాజాగా కేకేఆర్ వర్సెస్ సన్ రైజర్స్ మధ్య జరిగిన క్వాలిఫయర్-1లో 8 వికెట్ల తేడాతో కోల్ కత్తా టీమ్ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇక ఈ సీజన్ ఆరంభం నుంచి అదరగొడుతున్న కేేకేఆర్ తన పేరిట ఓ అరుదైన రికార్డ్ ను లిఖించుకుంది. 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఈ ఘనత సాధించిన ఏకైక జట్టుగా కేకేఆర్ నిలిచింది. ఇంతకీ ఆ రికార్డ్ ఏంటంటే?
ఐపీఎల్ 2024 సీజన్ లో కోల్ కత్తా నైట్ రైడర్స్ అద్భుతమైన ప్రదర్శనతో దూసుకెళ్తోంది. లీగ్ దశలో 14 మ్యాచ్ ల్లో 9 విజయాలతో 20 పాయింట్లు సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. ఇక నిన్న సన్ రైజర్స్ తో జరిగిన క్వాలిఫయర్ 1 మ్యాచ్ లో కూడా ఇదే ఆటతీరును కొనసాగించి.. ఫైనల్ కు దూసుకెళ్లింది. ఈ నేపథ్యంలో ఓ క్రేజీ రికార్డు ను సొంతం చేసుకుంది కోల్ కత్తా టీమ్. అదేంటంటే? 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో అత్యధిక నెట్ రన్ రేట్ (+1.428) ను నమోదు చేసిన టీమ్ గా కేకేఆర్ సరికొత్త చరిత్ర సృష్టించింది. దీంతో రికార్డులందు.. ఈ రికార్డు వేరయా అంటున్నారు నెటిజన్లు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ 19.3 ఓవర్లలో 159 పరుగులకే ఆలౌట్ అయ్యింది. జట్టులో రాహుల్ త్రిపాఠి(55), క్లాసెన్(32), ప్యాట్ కమ్మిన్స్(30) పరుగులు చేశారు. అనంతరం 160 రన్స్ టార్గెట్ ను కేవలం 13.4 ఓవర్లలోనే ఊదేసింది. వెంకటేశ్ అయ్యర్(51*), శ్రేయస్ అయ్యర్(58*) పరుగులతో అజేయంగా నిలిచి జట్టుకు విజయాన్ని అందించారు. మరి 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక నెట్ రన్ రేట్ సాధించిన జట్టుగా నిలిచిన కేకేఆర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
– Qualified into the final.
– 9 wins in league stage.
– KKR top of the Points table for the first time.
– Highest NRR ever in IPL history.
– 58*(24) in Qualifier 1.TAKE A BOW, CAPTAIN SHREYAS IYER. 💪 pic.twitter.com/v1HLIZQEVw
— Johns. (@CricCrazyJohns) May 21, 2024