KKR vs PBKS: చరిత్ర సృష్టించిన కేకేఆర్.. IPL హిస్టరీలో ఏ జట్టుకూ సాధ్యం కాని రీతిలో..!

పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో కోల్ కత్తానైట్ రైడర్స్ టీమ్ ఐపీఎల్ చరిత్రలోనే సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇప్పటి వరకు ఈ ఘనత ఏ ఐపీఎల్ టీమ్ సాధించకపోవడం గమనార్హం. ఆ వివరాల్లోకి వెళితే..

పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో కోల్ కత్తానైట్ రైడర్స్ టీమ్ ఐపీఎల్ చరిత్రలోనే సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇప్పటి వరకు ఈ ఘనత ఏ ఐపీఎల్ టీమ్ సాధించకపోవడం గమనార్హం. ఆ వివరాల్లోకి వెళితే..

IPL 2024లో భాగంగా పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో కోల్ కత్తా నైట్ రైడర్స్ టీమ్ విజృంభించింది. టాస్ గెలిచి ఎందుకు బౌలింగ్ తీసుకున్నామా? అని ఆలోచించుకునే టైమ్ కూడా ఇవ్వకుండా కేకేఆర్ ఓపెనర్లు సునీల్ నరైన్, ఫిలిప్ సాల్ట్ పంజాబ్ బౌలర్లపై దండయాత్ర చేశారు. దీంతో కేకేఆర్ టీమ్ 261 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఈ క్రమంలోనే ఓ క్రేజీ రికార్డును తనపేరిట సువర్ణాక్షరాలతో లిఖించుకుంది. ఐపీఎల్ చరిత్రలోనే ఏ జట్టుకు కూడా ఇది సాధ్యం కాలేదు. మరి ఆ ఘనత ఏంటి? తెలుసుకుందాం పదండి.

పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో కేకేఆర్ బ్యాటర్లు దంచికొట్టారు. వచ్చిన ప్లేయర్ వచ్చినట్లుగా బ్యాట్ కు పనిచెప్పడంతో.. భారీ స్కోర్ ను నమోదు చేసింది కోల్ కత్తా. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన కేకేఆర్ టీమ్ కు ఓపెనర్లు నరైన్-సాల్ట్ లు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. వీరిద్దరు పంజాబ్ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ.. తొలి వికెట్ కు 137 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అనంతరం 71 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద నరైన్ పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత సాల్ట్ సైతం 75 రన్స్ చేసి ఔట్ అయ్యాడు. కానీ పరుగుల వేగం మాత్రం తగ్గలేదు.

ఆ తర్వాత వచ్చిన వెంకటేశ్ అయ్యర్(39), రస్సెల్(24), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(28) చకచక పరుగులు చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 261 రికార్డు రన్స్ చేసింది. ఈ క్రమంలోనే ఓ రేర్ ఫీట్ ను సొంతం చేసుకుంది కేకేఆర్ టీమ్. అదేంటంటే? ఈడెన్ గార్డెన్స్ లో 250+ స్కోర్ చేసిన తొలి టీమ్ గా కేకేఆర్ నిలిచింది. ఈ మైదానంలో 261 పరుగులు కొట్టడం ఇదే తొలిసారి. ఐపీఎల్ చరిత్రలోనే గాక.. ఇంటర్నేషనల్ టీ20 మ్యాచ్ ల్లో కూడా ఇక్కడ ఇప్పటి వరకు ఈ స్కోర్ చేయలేదు. దీంతో ఈడెన్ గార్డెన్స్ లో ఈ ఘనత సాధించిన తొలి టీమ్ గా కేకేఆర్ నిలిచింది. మరి కేకేఆర్ ఈ రికార్డ్ సాధించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments