Somesekhar
జూనియర్ మలింగగా పేరుగాంచిన శ్రీలంక ఫాస్ట్ బౌలర్ నువాన్ తుషార బంతితో అద్బుతం చేశాడు. బంగ్లాదేశ్ తో జరిగిన టీ20 మ్యాచ్ లో హ్యాట్రిక్ తో అదరగొట్టాడు.
జూనియర్ మలింగగా పేరుగాంచిన శ్రీలంక ఫాస్ట్ బౌలర్ నువాన్ తుషార బంతితో అద్బుతం చేశాడు. బంగ్లాదేశ్ తో జరిగిన టీ20 మ్యాచ్ లో హ్యాట్రిక్ తో అదరగొట్టాడు.
Somesekhar
మరికొన్ని రోజుల్లో ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభం కానుంది. అయితే సీజన్ స్టార్ట్ కాకముందే.. ముంబై ఇండియన్స్ యాజమాన్యంతో పాటుగా ఎంఐ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. దానికి కారణం ఐపీఎల్ 2024 మినీ వేలంలో కొనుగోలు చేసిన ప్లేయర్ హ్యాట్రిక్ తో సత్తాచాటడమే. శ్రీలంక ఫాస్ట్ బౌలర్ నువాన్ తుషార బంతితో అద్బుతం చేశాడు. జూనియర్ మలింగగా పేరుగాంచిన ఈ పేసర్ బంగ్లాదేశ్ తో జరిగిన టీ20 మ్యాచ్ లో నిప్పులు చెరిగే బంతులతో హ్యాట్రిక్ నమోదు చేశాడు.
నువాన్ తుషార.. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ లో మారుమ్రోగుతున్న పేరు. తాజాగా బంగ్లాదేశ్ తో జరిగిన 3వ టీ20 మ్యాచ్ లో తుషార సంచలన బౌలింగ్ తో చెలరేగాడు. హ్యాట్రిక్ తో మ్యాచ్ ను ఒంటిచేత్తో గెలిపించాడు. అతడు వేసిన నాలుగో ఓవర్ లో వరుసగా నజ్ముల్ శాంటో, తౌహిద్ హృదయ్, మహ్మదుల్లాను పెవిలియన్ కు పంపాడు. ఇద్దరిని బౌల్డ్ చేసి, ఒకరిని ఎల్బీగా వెనక్కిపంపాడు. దీంతో టీ20 క్రికెట్ చరిత్రలో హ్యాట్రిక్ తీసిన 5వ శ్రీలంకన్ బౌలర్ గా తుషార నిలిచాడు. మూడు వికెట్లు తీయడంతో పాటుగా ఈ ఓవర్ ను మెయిడెన్ వేశాడు. ఆ తర్వాత వేసిన ఓవర్ లో కూడా పదునైన యార్కర్ తో సౌమ్యా సర్కార్ ను బోల్తా కొట్టించాడు.
కాగా.. తుషార మెరుపు స్పెల్ తో కేవలం 32 రన్స్ కే 6 వికెట్లు కోల్పోయింది బంగ్లాదేశ్. ఇక జూనియర్ మలింగ హ్యాట్రిక్ తీయడంతో.. ముంబై ఇండియన్స్ శిబిరంలో ఆనందం నెలకొంది. ఎంఐ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఫీలవుతున్నారు. 2024 ఐపీఎల్ మినీ వేలంలో ఇతడిని ఏకంగా రూ. 4.8 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతో డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ జస్ప్రీత్ బుమ్రాతో కలిసి బౌలింగ్ వేస్తే.. ప్రత్యర్థులకు చెమటలు పట్టాల్సిందే అంటూ ఎంఐ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. అనంతరం 175 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన బంగ్లా టీమ్ తుషార దెబ్బకు 146 రన్స్ కే ఆలౌట్ అయ్యింది. మరి హ్యాట్రిక్ తీసిన జూనియర్ మలింగపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Hat-trick hero! 🔥
Nuwan Thusara’s slingy pace tore through Bangladesh’s lineup, etching his name in history.
.
.#BANvsSL #FanCode pic.twitter.com/cuB8p9DLAs— FanCode (@FanCode) March 9, 2024
ఇదికూడా చదవండి: ఇంగ్లండ్‌పై సిరీస్ విజయంతో ఏం సాధించాడు? రోహిత్ ప్లానేంటి? WC కంటే పెద్ద టార్గెట్!