World Cup: ఆసీస్‌తో మ్యాచ్‌.. బరిలోకి దిగిన జార్వో!

భారత క్రికెట్‌ అభిమానులందరికీ జార్వో మామ సుపరిచితమే. ఇండియా-ఇంగ్లండ్‌ టెస్ట్‌ సిరీస్‌ సందర్భంగా తాను కూడా టీమిండియా ప్లేయర్‌ అంటూ గ్రౌండ్‌లోకి వచ్చేసి.. వైరల్‌గా మారాడు. ఆ తర్వాత మళ్లీ కనిపించలేదు. కానీ, తాజాగా వన్డే వరల్డ్‌ కప్‌ 2023లో భారత్‌ ఆడుతున్న తొలి మ్యాచ్‌తోనే జార్వో మళ్లీ దర్శనమిచ్చాడు. భారత్‌-ఆస్ట్రేలియా మధ్య చెన్నైలోని చిదంబరం క్రికెట్‌ స్టేడియంలో మ్యాచ్‌ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో జార్వో ఏకంగా టీమిండియా జెర్సీ ధరించి ఫీల్డింగ్‌ చేసేందుకు వచ్చేశాడు.

అతను టీమిండియా ఆటగాడు కాదని గమనించిన గ్రౌండ్‌ స్టాప్‌ వెంటనే అప్రమత్తమై అతన్ని బయటికి తీసుకెళ్లారు. అయితే.. ఈ గ్యాప్‌లో జార్వో.. ఏకంగా విరాట్‌ కోహ్లీ, కేఎల్‌ రాహుల్‌తో కూడా మాట్లాడాడు. వాళ్లు కూడా జార్వోని బయటికి వెళ్లాలని కోరారు. అయితే.. జార్వోది పూర్తి పేరు డేనియల్ జార్విస్. ఇతను ఇంగ్లండ్‌కు చెందిన యూట్యూబర్. 2021లో ఇంగ్లండ్‌-భారత్‌ మధ్య జరిగిన టెస్టు సిరీస్‌లో భాగంగా రెండు మ్యాచ్‌ల్లో గ్రౌండ్‌లోకి ఒకసారి బౌలింగ్‌ చేసేందుకు అలాగే.. మరోసారి బ్యాటింగ్‌ చేసేందుకు ఏకంగా పిచ్‌ వరకు వచ్చేశాడు. ఇప్పుడు టీమిండియా జెర్సీతో 69 నంబర్‌తో పాటు తన పేరుతో ఉన్న జెర్సీ వేసుకుని వచ్చేసి వైరల్‌గా మారాడు.

అయితే.. వరల్డ్‌ కప్‌ లాంటి ప్రతిష్టాత్మక టోర్నీలో కూడా ఇలాంటి సెక్యూరిటీ వైఫల్యాలు ఏంటని క్రికెట్‌ అభిమానులు మండిపడుతున్నారు. జార్వో లాంటి ఓ సాధారణ వ్యక్తి, సెక్యూరిటీ కళ్లుగప్పి ఏకంగా ఆటగాళ్ల వరకు వచ్చేస్తుండటంపై క్రికెట్‌ ఫ్యాన్స్‌ ఆటగాళ్ల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆల్రెడీ ఒక సారి గ్రౌండ్‌లోకి వచ్చేసి వ్యక్తి.. ఇలా పదే పదే గ్రౌండ్‌లోకి దూసుకోచ్చేస్తుండటంపై చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: 29 బంతుల్లోనే సెంచరీ! AB డివిలియర్స్‌ రికార్డు బ్రేక్‌

Show comments