Somesekhar
పాకిస్తాన్ తో జరిగిన తొలి టీ20లో 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది పసికూన ఐర్లాండ్ టీమ్. చివరి ఓవర్ వరకూ ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ లో ఐరిష్ జట్టు అద్భుత విజయాన్ని నమోదు చేసింది.
పాకిస్తాన్ తో జరిగిన తొలి టీ20లో 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది పసికూన ఐర్లాండ్ టీమ్. చివరి ఓవర్ వరకూ ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ లో ఐరిష్ జట్టు అద్భుత విజయాన్ని నమోదు చేసింది.
Somesekhar
మాటల్లో గొప్పలు చెప్పుకునే పాకిస్తాన్.. చేతల్లోకి వచ్చేసరికి తుస్సుమనడం మనకు తెలియనిది కాదు. ప్రపంచలోనే బెస్ట్ ఆటగాళ్లు మా టీమ్ లో ఉన్నారని చెప్పుకునే పాకిస్తాన్ కు భారీ షాకిచ్చింది పసికూన ఐర్లాండ్. మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా నిన్న డబ్లిన్ వేదికగా జరిగిన తొలి టీ20లో 5 వికెట్లతో పాక్ ను చిత్తుచేసింది. ఈ మ్యాచ్ లో అద్భుతంగా రాణించిన ఐర్లాండ్ ఆటగాళ్లు పాక్ ను మట్టికరిపించారు. ఈ మ్యాచ్ కు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..
ఐర్లాండ్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ ప్రారంభం అయ్యింది. అందులో భాగంగా డబ్లిన్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్ లో 5 వికెట్ల తేడాతో పాకిస్తాన్ ను ఓడించింది. దీంతో మూడు మ్యాచ్ ల సిరీస్ లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది ఐర్లాండ్. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 182 పరుగుల భారీ స్కోర్ సాధించింది. పాక్ జట్టులో కెప్టెన్ బాబర్ అజం 57 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలవగా.. మిగతావారిలో ఆయూబ్(45), ఇఫ్తికర్ అహ్మద్(37*) పరుగులతో రాణించారు.
అనంతరం 183 పరుగుల టార్గెట్ ను 5 వికెట్లు నష్టపోయి 19.5 ఓవర్లలో ఛేదించింది ఐర్లాండ్. ఓపెనర్ ఆండ్రీవ్ బల్బర్నీ 77 పరుగులతో రాణించి, జట్టుకు విజయాన్ని అందించాడు. హ్యారీ టెక్టర్ 36 రన్స్ చేసి విజయంలో తనవంతు పాత్ర పోషించాడు. ఇక చివర్లో కాంప్ హెర్(15*), డెలానీ(10*) నాటౌట్ గా నిలిచి జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించారు. ఇక ఈ ఓటమితో పాక్ పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. పసికూనపై కూడా గెలవలేని మీరు ఇతరులపై విమర్శలు గుప్పించడం ఇకనైనా మానుకోండి అంటూ సూచిస్తున్నారు. మరి పాక్ ను 5 వికెట్లతో ఐర్లాండ్ చిత్తు చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
IRELAND BEAT PAKISTAN!!! What an incredible series opener we’ve just witnessed! A historic victory for @cricketireland 🇮🇪👏👏👏
.
.#IREvPAKonFanCode #IREvPAK #FanCode pic.twitter.com/prvSBt37L5— FanCode (@FanCode) May 10, 2024