కెప్టెన్లకు గుడ్​బై.. BCCIతో మీటింగ్​ తర్వాత IPL ఫ్రాంచైజీల సంచలన నిర్ణయం!

ఐపీఎల్ ఫ్రాంచైజీలతో ఇటీవల భారత క్రికెట్ బోర్డు సమావేశమైన సంగతి తెలిసిందే. మెగా ఆక్షన్​కు ముందు పలు కీలక అంశాలపై జట్ల యజమానులతో బోర్డు పెద్దలు డిస్కస్ చేశారు.

ఐపీఎల్ ఫ్రాంచైజీలతో ఇటీవల భారత క్రికెట్ బోర్డు సమావేశమైన సంగతి తెలిసిందే. మెగా ఆక్షన్​కు ముందు పలు కీలక అంశాలపై జట్ల యజమానులతో బోర్డు పెద్దలు డిస్కస్ చేశారు.

ఐపీఎల్ ఫ్రాంచైజీలతో ఇటీవల భారత క్రికెట్ బోర్డు సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఆఖర్లో జరిగే మెగా ఆక్షన్​కు సంబంధించిన పలు కీలక అంశాలపై జట్ల యజమానులతో బోర్డు పెద్దలు డిస్కస్ చేశారు. రైట్ టు మ్యాచ్, రిటెన్షన్ ప్రాసెస్​తో పాటు రిటెయిన్ చేసుకునే ఆటగాళ్ల పరిమితి వంటి అంశాలపై ఈ మీటింగ్​లో బీసీసీఐ డిస్కస్ చేసినట్లు తెలిసింది. ఈ మీటింగ్​కు సంబంధించి పలు అంశాలు బాగా వైరల్ అయ్యాయి. ఇదిలా ఉంటే.. ఈ సమావేశం తర్వాత పలు ఫ్రాంచైజీలు తమ కెప్టెన్లను వదులుకునేందుకు సిద్ధమవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా 3 జట్లు తమ కెప్టెన్​లకు గుడ్​బై చెప్పనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

రీసెంట్​గా జరిగిన మీటింగ్​లో ఎక్కువ మటుకు ఫ్రాంచైజీలు కనీసం ఆరుగురు ఆటగాళ్లను రీటెయిన్ చేసుకునేందుకు అనుమతించాలని కోరగా.. అందుకు బోర్డు ఓకే చెప్పందని సమాచారం. ఈ నేపథ్యంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తమ కెప్టెన్లను విడిచిపెట్టి.. వాళ్ల స్థానంలో కొత్తవారిని నియమించుకునే ఆలోచనలో ఉన్నట్లు క్రికెట్ వర్గాల్లో వినిపిస్తోంది. మెగా ఆక్షన్​కు ముందు తమ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్​ను రిలీజ్ చేయాలని అనుకుంటోందట ఆర్సీబీ. 36 ఏళ్ల డుప్లెసిస్ ఈ ఏడాది ఐపీఎల్​లో 438 పరుగులు చేయడంతో పాటు టీమ్​ను ప్లేఆఫ్స్​కు చేర్చాడు. కానీ ఫ్యూచర్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని అతడ్ని వదులుకొని ఎవరైనా టీమిండియా యంగ్ ప్లేయర్​ను సారథిగా నియమించాలని బెంగళూరు ఓనర్స్ భావిస్తున్నారట.

ఐపీఎల్​లో ఒక్కసారి కూడా ట్రోఫీ నెగ్గని చెత్త రికార్డు ఉన్న పంజాబ్ కూడా కెప్టెన్సీ మార్పు అంశంపై సీరియస్​గా ఆలోచిస్తోందని తెలుస్తోంది. ప్రస్తుత సారథి శిఖర్ ధావన్ పూర్ ఫామ్​తో బాధపడుతున్నాడు. ఈ సీజన్​ ఆరంభంలోనే గాయపడి టీమ్​కు దూరమయ్యాడు. అతడి స్థానంలో కెప్టెన్సీ చేసిన సామ్ కర్రన్ జట్టును ప్లేఆఫ్స్ చేర్చడంలో ఫెయిల్ అయ్యాడు. ఈ నేపథ్యంలో సరైన నాయకుడి కోసం పంజాబ్ వెతుకులాట మొదలైందని.. అలాంటి ఆటగాడు దొరికితే ఎన్ని కోట్లు పోసైనా దక్కించుకోవాలని పట్టుదలతో ఉందని సమాచారం. సరైన కెప్టెన్ లేకే టీమ్​ ఇలా తయారైందని.. అందుకే ఈసారి సారథ్య మార్పే ప్రధాన అంశంగా ముందుకెళ్తున్నారని తెలుస్తోంది.

ఐపీఎల్-2024లో లక్నో సూపర్ జియాంట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ మీద ఆ టీమ్ ఓనర్ సంజీవ్ గోయెంకా సీరియస్ అయిన విషయం వైరల్​గా మారింది. ఓటమి చెందినంత మాత్రాన అందరి ముందు రాహుల్​ను తిట్టడం ఏంటని అప్పట్లో లక్నో యాజమాన్యంపై అభిమానులు ఫైర్ అయ్యారు. ఈ ఘటనతో రాహుల్ హర్ట్ అయ్యాడని.. జట్టును అతడు వీడటం ఖాయమని పుకార్లు వస్తున్నాయి. అటు లక్నో ఓనర్స్ కూడా రాహుల్​ను రిలీజ్ చేసి.. ఎవరైనా మంచి యంగ్​స్టర్​ను సారథిగా ఎంపిక చేయాలని భావిస్తున్నారని వినిపిస్తోంది. అదే నిజమైతే కెప్టెన్​ను మార్చుతున్న మూడో ఫ్రాంచైజీగా లక్నో నిలుస్తుంది. ఢిల్లీ క్యాపిటల్స్ కూడా రిషబ్ పంత్ ప్లేస్​లో ఇంకో కెప్టెన్​ను నియమించే ఛాన్స్ ఉందని.. అతడు సీఎస్​కేకు వెళ్లడం ఖాయమంటూ ఆ మధ్య రూమర్స్ వచ్చాయి. అయితే ఇప్పుడు దీనిపై ఎలాంటి చప్పుడు లేదు. ఒకవేళ ఆ టీమ్ కూడా అదే తోవలో వెళ్తే ఏకంగా లీగ్​లో నలుగురు కొత్త కెప్టెన్స్ వస్తారు.

Show comments