Somesekhar
నువ్వానేనా అన్నట్లు సాగిన ఈ పోరులో చివరి వరకు పోరాడిన ముంబై 31 రన్స్ తేడాతో సన్ రైజర్స్ పై ఓడిపోయింది. ఈ మ్యాచ్ లో SRH విజయానికి 5 కారణాలు ఉన్నాయి.. అవేంటో ఓసారి పరిశీలిద్దాం పదండి.
నువ్వానేనా అన్నట్లు సాగిన ఈ పోరులో చివరి వరకు పోరాడిన ముంబై 31 రన్స్ తేడాతో సన్ రైజర్స్ పై ఓడిపోయింది. ఈ మ్యాచ్ లో SRH విజయానికి 5 కారణాలు ఉన్నాయి.. అవేంటో ఓసారి పరిశీలిద్దాం పదండి.
Somesekhar
హైదరాబాద్ ను తుఫాన్ ముంచెత్తింది. ఆ తుఫాన్ పేరు సన్ రైజర్స్. ఐపీఎల్ చరిత్రలో నిలిచిపోయేలా జరిగిన ఈ మ్యాచ్.. ప్రేక్షకులకు ఫుల్ కిక్కిచ్చింది. ఇరు జట్ల బ్యాటర్లు సిక్సులు, ఫోర్ల వర్షం కురిపించడంతో రికార్డు స్కోర్ నమోదు అయ్యింది. ఐపీఎల్ చరిత్రలోనే పలు రికార్డులు ఈ మ్యాచ్ లో బద్దలు అయ్యాయి. నువ్వానేనా అన్నట్లు సాగిన ఈ పోరులో చివరి వరకు పోరాడిన ముంబై 31 రన్స్ తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్ లో SRH విజయానికి 5 కారణాలు ఉన్నాయి.. అవేంటో ఓసారి పరిశీలిద్దాం పదండి.
SRH విజయానికి 5 కారణాలు
సన్ రైజర్స్ విజయానికి కచ్చితంగా వారి బ్యాటింగే ప్రధాన కారణమని చెప్పొచ్చు. టాస్ గెలిచి తాము బౌలింగ్ తీసుకోవడం ఎంత పెద్ద తప్పో తెలుసుకోవడానికి ముంబైకి ఎంతో సేపు పట్టలేదు. హైదరాబాద్ ఓపెనర్లు మయాంక్ అగర్వాల్-ట్రావిస్ హెడ్ ఆరంభం నుంచే ముంబై బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. వీరిద్దరు 4.1 ఓవర్లోనే 45 పరుగుల మెరుపు శుభారంభం ఇచ్చారు. మయాంక్ ఔట్ అయిన తర్వాత మరింతగా రెచ్చిపోయాడు హెడ్. కేవలం 18 బంతుల్లోనే ఫిఫ్టీ మార్క్ ను చేరుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన అభిషేక్ శర్మ తానేమీ తక్కువ తినలేదనట్లుగా 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదీ హెడ్ రికార్డును బద్దలు కొట్టాడు. హెడ్(62), అభిషేక్ శర్మ(63), మార్క్రమ్(42) పరుగులు చేయగా.. చివర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు క్లాసెన్. 34 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్స్ లతో 80 పరుగులతో అజేయంగా నిలిచాడు.
సన్ రైజర్స్ 277 పరుగులు చేసిందంటే.. దానికి కారణం ట్రావిస్ హెడ్-అభిషేక్ శర్మ అందించిన భాగస్వామ్యామే. వీరిద్దరు ఆకాశమేహద్దుగా చెలరేగి ముంబై బౌలర్లకు చుక్కలు చూపించారు. ఎడాపెడా బౌండరీలు బాదుతూ.. స్కోర్ బోర్డ్ ను పరుగులు పెట్టించారు. హెడ్ 18 బంతుల్లో ఫిఫ్టీ కొడితే.. అభిషేక్ శర్మ కేవలం 16 బాల్స్ లోనే ఆ మార్క్ ను అందుకున్నాడు. వీరిద్దరు 4.1 ఓవర్లకు 45 ఉన్న స్కోర్ ను 7.5 ఓవర్లకు 113 దగ్గరికి చేర్చారు. రెండో వికెట్ కు 68 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. దీంతో రన్ రేట్ విపరీతంగా పెరిగిపోవడంతో.. మిగతా బ్యాటర్లు ఒత్తిడి లేకుండా బ్యాట్ ఝళిపించారు.
హైదరాబాద్ విజయానికి ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా చెత్త కెప్టెన్సీ కూడా ఓ కారణమే. బౌలర్లు పరిస్థితులకు తగ్గట్లుగా ఎలా వాడుకోవాలో తెలీక విఫలమైయ్యాడు. మరీ ముఖ్యంగా బుమ్రాకు స్టార్టింగ్ ఓవర్ ఇవ్వలేదు. అతడి చేతికి నాలుగొవ ఓవర్ కి గానీ బంతి రాలేదు. అయితే ఆ తర్వాత అయినా మరో ఓవర్ బుమ్రాకు ఇస్తాడని అందరూ అనుకున్నారు కానీ ఇవ్వలేదు. ఏకంగా ఇన్నింగ్స్ 13 ఓవర్ ను బుమ్రా చేతికి ఇచ్చాడు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ధారాళంగా పరుగులు సమర్పించుకుంటున్న మెపాకాకు 4 ఓవర్లు ఇచ్చి భారీ మూల్యం చెల్లించుకున్నాడు. సన్ రైజర్స్ విజయానికి పాండ్యా చెత్త కెప్టెన్సీ కూడా ఓ కారణం.
అభిషేక్ శర్మ పెవిలియన్ చేరిన తర్వాత క్రీజ్ లోకి వచ్చాడు హెన్రిచ్ క్లాసెన్. అప్పటికి టీమ్ స్కోర్ 11 ఓవర్లకు 161/3గా ఉంది. అయితే అదే రన్ రేట్ ను మెయింటెన్ చేస్తూ వచ్చాడు క్లాసెన్. ముంబై బౌలర్లపై పూర్తి ఆధిపత్యాన్ని చెలాయిస్తూ.. ఫోర్లు, సిక్సర్లతో వారిపై విరుచుకుపడ్డాడు. క్లాసెన్ బ్యాటింగ్ చేస్తుంటే.. స్కోర్ 300 పరుగులు దాటుందని అందరూ అనుకున్నారు. అందుకు తగ్గట్లుగానే అతడి ఆట కొనసాగింది. ఓవరాల్ గా 34 బంతులు ఎదుర్కొని 4 ఫోర్లు, 7 సిక్స్ లతో 80 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడికి తోడు మార్క్రమ్ 42 పరుగులతో రాణించాడు.
లక్ష్యం 278 పరుగులు.. దీంతో ఏ జట్టుకైనా ఈజీగానే గెలుస్తాం అన్న ధీమా ఉంటుంది. అయితే అది అవతల వైపు ఉన్నజట్టును బట్టి ఉంటుంది. ముంబై కూడా కొండంత టార్గెట్ ఉండటంతో.. మెరుపు ఆరంభంతోనే ఇన్నింగ్స్ ప్రారంభించింది. రోహిత్ శర్మ-ఇషాన్ కిషన్ ముంబైకి సూపర్ స్టార్ట్ ఇచ్చారు. తొలి వికెట్ కు 3.2 ఓవర్లకే 56 రన్స్ జోడించారు. హైదరాబాద్ బౌలర్లు కూడా మెుదట ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. కానీ చివర్లో కట్టుదిట్టంగా బంతులు వేసి.. ముంబై బ్యాటర్లపై ఒత్తిడి తీసుకురావడంలో విజయం సాధించారు. కెప్టెన్ కమ్మిన్స్ 3 ఓవర్లలో 35 రన్స్ ఇచ్చి కీలకమైన రోహిత్, తిలక్ ల వికెట్లు పడగొట్టాడు. 19వ ఓవర్ వేసిన కమ్మిన్స్ కేవలం 7 పరుగులు మాత్రమే ఇచ్చి హైదరాబాద్ విజయాన్ని ఖాయం చేశాడు. మెుదటి నుంచి ఎక్కువ పరుగులు ఇస్తూ వచ్చిన జైదేవ్ ఉనద్కత్ కూడా 16వ ఓవర్లో కేవలం 5 రన్స్ మాత్రమే ఇచ్చి.. విజయానికి బాటలు వేశాడు.
ఇదికూడా చదవండి: SRH vs MI: దటీజ్ రోహిత్.. కెప్టెన్సీ అంటే ఏంటో హార్దిక్‌కు చూపించిన హిట్‌మ్యాన్!