Nidhan
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ ఊచకోత అంటే ఎలా ఉంటుందో చెన్నై బౌలర్లకు చూపించాడు. అతడు ఒకే ఓవర్లో ఏకంగా 27 రన్స్ బాదాడు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ ఊచకోత అంటే ఎలా ఉంటుందో చెన్నై బౌలర్లకు చూపించాడు. అతడు ఒకే ఓవర్లో ఏకంగా 27 రన్స్ బాదాడు.
Nidhan
ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఓడి హైదరాబాద్‌కు వచ్చిన చెన్నై సూపర్ కింగ్స్‌కు చుక్కలు చూపించింది సన్‌రైజర్స్. భారీ బ్యాటింగ్ లైనప్ కలిగిన సీఎస్కేను 165 పరుగులకే కట్టడి చేశారు ఎస్ఆర్హెచ్ బౌలర్లు. శివమ్ దూబె (24 బంతుల్లో 42) తప్పితే మిగిలిన వాళ్లు సన్‌రైజర్స్ బౌలర్లను ఎదుర్కొనేందుకు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. స్లో పిచ్‌పై పర్ఫెక్ట్ లైన్ అండ్ లెంగ్త్‌లో వేరియేషన్స్‌తో బంతులు వేస్తూ చెన్నై బ్యాటర్లను కట్టిపడేశారు. ఆ తర్వాత ఛేజింగ్‌లో విధ్వంసం అంటే ఎలా ఉంటుందో సీఎస్కేకు చూపించాడు అభిషేక్ శర్మ. స్లో పిచ్ అంటూ పరుగులు తీసేందుకు ప్రత్యర్థి జట్టు ఇబ్బంది పడిన చోట ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు అభిషేక్. 12 బంతుల్లోనే 37 పరుగులు చేశాడు. ఒక బౌలర్‌ను టార్గెట్ చేసుకొని ఊచకోత కోశాడీ ఓపెనర్.
మొదటి బాల్ నుంచే హిట్టింగ్ స్టార్ట్ చేసిన అభిషేక్.. సీఎస్కే లెఫ్టార్మ్ పేసర్ ముకేశ్ చౌదరీని లక్ష్యంగా చేసుకొని మరింత చెలరేగిపోయాడు. అతడు వేసిన ఓవర్లో ఏకంగా 27 పరుగులు పిండుకున్నాడు. ముకేశ్ ఓవర్లో తొలి బంతిని బౌండరీకి పంపాడు ఎస్ఆర్హెచ్ ఓపెనర్. ఆ తర్వాతి బంతిని డిఫెన్స్ చేసిన అభిషేక్.. నెక్స్ట్ బాల్ సిక్స్ కొట్టాడు. నాలుగో బంతి డాట్ అయింది. ఐదో బంతి నో బాల్ కాగా దాన్ని స్టాండ్స్‌లోకి పంపాడు. ఆ తర్వాత ఫ్రీ హిట్ బాల్‌ను కూడా సిక్స్ బాదేశాడు. ఆఖరి బంతికి ఫోర్ కొట్టి ఓవర్‌ను గ్రాండ్‌గా ముగించాడు. అభిషేక్ దెబ్బకు ముకేశ్ మళ్లీ బౌలింగ్‌కు రాలేదు. అతడి ఊచకోత వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్స్ అభిషేక్ బ్యాటింగ్, సిక్స్ హిట్టింగ్ ఎబిలిటీ, టెక్నిక్‌ను మెచ్చుకుంటున్నారు.
ఇక, నిన్నటి మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన సీఎస్కే 20 ఓవర్లకు 165 పరుగులు చేసింది. ఈ టార్గెట్‌ను మరో 11 బంతులు ఉండగానే ఎస్ఆర్హెచ్ ఛేదించింది. అభిషేక్‌తో పాటు మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్ (24 బంతుల్లో 31), ఎయిడెన్ మార్క్రమ్ (36 బంతుల్లో 50) రాణించారు. ఆఖర్లో షాబాజ్ అహ్మద్ (18), నితీష్ కుమార్ రెడ్డి (14) కూడా ఆకట్టుకున్నారు. వైజాగ్ కుర్రాడు నితీష్ రెడ్డి సిక్స్ కొట్టి మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు. ఈ మ్యాచ్‌లో విజయానికి సన్‌రైజర్స్ బౌలర్లతో పాటు బ్యాటర్లు రాణించడమే కారణమని చెప్పాలి. అయితే ఎక్కువ క్రెడిట్ మాత్రం బౌలర్లకు ఇవ్వాలి. స్ట్రాంగ్ బ్యాటింగ్ యూనిట్ కలిగిన సీఎస్కేను వాళ్లు నిలువరించిన తీరు అద్భుతం. ఆ తర్వాత మెచ్చుకోవాల్సింది హెడ్-అభిషేక్‌నే. వీళ్లిద్దరూ కలసి ఫస్ట్ వికెట్‌కు 2.4 ఓవర్లలో 46 పరుగులు జోడించారు. మరి.. అభిషేక్ శర్మ బ్యాటింగ్ విధ్వంసం మీద మీ ఒపీనియన్‌ను కామెంట్ చేయండి.
Sunrisers’ Abhishek Sharma turns the game on its head with a record-breaking over, scoring a jaw-dropping 27 runs! 🏏
Watch this epic match live in HD and without ads only on tapmad!#SRHvCSK | #TATAIPL | #HojaoAdFree | #tapmad pic.twitter.com/PHrWaVdzAU
— tapmad (@tapmadtv) April 5, 2024