IPL 2024: సరికొత్త చరిత్రకు వేదికైన DC vs LSG మ్యాచ్.. ఐపీఎల్ హిస్టరీలో ఇదే తొలిసారి!

నిన్న జరిగిన ఢిల్లీ వర్సెస్ లక్నో మ్యాచ్ ఓ క్రేజీ రికార్డుకు వేదికగా నిలిచింది. ఇలా జరగడం ఐపీఎల్ చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం. మరి ఆ రికార్డ్ ఏంటి? చూద్దాం పదండి.

నిన్న జరిగిన ఢిల్లీ వర్సెస్ లక్నో మ్యాచ్ ఓ క్రేజీ రికార్డుకు వేదికగా నిలిచింది. ఇలా జరగడం ఐపీఎల్ చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం. మరి ఆ రికార్డ్ ఏంటి? చూద్దాం పదండి.

IPL 2024 సీజన్ ముగింపు దశకు చేరుకుంది. ప్రారంభం నుంచి ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తూ.. దూసుకెళ్తోంది ఈ సీజన్. గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతున్నారు ఆటగాళ్లు. మరీ ముఖ్యంగా ఈ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ కొన్ని మ్యాచ్ ల్లో తన విశ్వరూపం చూపించింది. దాంతో ప్రపంచ రికార్డులు నమోదు అయ్యాయి. ఇక  నిన్న జరిగిన ఢిల్లీ వర్సెస్ లక్నో మ్యాచ్ కూడా ఓ క్రేజీ రికార్డుకు వేదికగా నిలిచింది. ఇలా జరగడం ఐపీఎల్ చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం. మరి ఆ రికార్డ్ ఏంటి? చూద్దాం పదండి.

ఐపీఎల్ చరిత్రలోనే 2024 సీజన్ అరుదైన ఘనతను నమోదు చేసింది. నిన్న ఢిల్లీ వర్సెస్ లక్నో మ్యాచ్ లో సరికొత్త చరిత్ర ఆవిష్కృతం అయ్యింది. 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సిక్సర్లు నమోదు అయిన సీజన్ గా నిలిచింది. ఇప్పటి వరకు 1125 సిక్సర్లు ఈ ఐపీఎల్ లో నమోదు అయ్యాయి. ఇక ఢిల్లీ-లక్నో మ్యాచ్ లో ఇరు జట్ల ఆటగాళ్లు కలిసి 20 సిక్సులు బాదారు. ఈ సీజన్ లో మెుదటి నుంచి బ్యాటర్లు సిక్సుల వర్షం కురిపిస్తున్నారు. మరీ ముఖ్యంగా సన్ రైజర్స్ ఆటగాళ్లు సిక్సర్ల సునామీలు సృష్టించారు.

కాగా.. 2023 సీజన్ లో 1124 సిక్సులు బాదగా.. 2022లో 1062 సిక్సర్లు నమోదు అయ్యాయి. ఇదిలా ఉండగా.. ఈ సీజన్ లో ఇప్పటి వరకు అత్యధిక సిక్సులు కొట్టిన జట్టుగా అగ్రస్థానంలో కొనసాగుతోంది సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్. SRH 146 సిక్సులు కొడితే.. 141 సిక్సర్లతో ఆర్సీబీ రెండో ప్లేస్ లో కొనసాగుతోంది. మరి 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సిక్సర్లు నమోదు అయిన సీజన్ గా 2024 నిలవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments