IPL ఆరంభానికి ముందు రాజస్థాన్​కు బిగ్ షాక్.. మ్యాచ్ విన్నర్ దూరం!

ఐపీఎల్-2024 సీజన్ ఆరంభానికి ముందు రాజస్థాన్ రాయల్స్ టీమ్​కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. గెలిపిస్తాడనుకుంటే మ్యాచ్ విన్నర్ ఆ జట్టుకు దూరమయ్యాడు.

ఐపీఎల్-2024 సీజన్ ఆరంభానికి ముందు రాజస్థాన్ రాయల్స్ టీమ్​కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. గెలిపిస్తాడనుకుంటే మ్యాచ్ విన్నర్ ఆ జట్టుకు దూరమయ్యాడు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్-2024 శుక్రవారం నుంచి స్టార్ట్ కానుంది. మండు వేసవిలో ప్రేక్షకులకు వినోదాన్ని పంచేందుకు క్యాష్ రిచ్ లీగ్ రెడీ అయిపోయింది. అన్ని ఫ్రాంచైజీలు ఈసారి కప్పు మీద కన్నేశాయి. అందుకు తగ్గట్లే పర్ఫెక్ట్ టీమ్ కాంబినేషన్స్​తో, పకడ్బందీ ప్లానింగ్​తో సిద్ధంగా ఉన్నాయి. మొదటి మ్యాచ్ నుంచి అదరగొడుతూ లీగ్​లో డామినేషన్ చూపించాలని భావిస్తున్నాయి. సంజూ శాంసన్ నేతృత్వంలోని రాజస్థాన్ రాయల్స్ కూడా ఈసారి బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇవ్వాలని చూస్తోంది. అయితే ఐపీఎల్ ఆరంభానికి ముందు ఆ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలిందని తెలుస్తోంది. టీమ్ గెలుపులో కీలకంగా ఉంటాడని భావించిన ఓ మ్యాచ్ విన్నర్ జట్టుకు దూరమయ్యాడని సమాచారం. ఎవరా ప్లేయర్ అనేది ఇప్పుడు చూద్దాం..

రాజస్థాన్ స్టార్ స్పిన్నర్ ఆడమ్ జంపా ఐపీఎల్-2024 నుంచి వైదొలిగాడని సమాచారం. పర్సనల్ రీజన్స్ వల్ల టోర్నీ నుంచి అతడు నిష్కమించాడని క్రికెట్ వర్గాల్లో వినిపిస్తోంది. జంపా పూర్తి ఫిట్​గా ఉన్నాడని.. కానీ వ్యక్తిగత కారణాలతో ఐపీఎల్​కు దూరంగా ఉండాలని అతడు డిసైడ్ అయ్యాడని అంటున్నారు. గత సీజన్​లో రాజస్థాన్ తరఫున 6 మ్యాచులు ఆడాడు జంపా. అలాంటోడు ఇప్పుడు అర్ధంతరంగా వెళ్లిపోవడం రాయల్స్​కు ఎదురుదెబ్బేనని చెప్పాలి. ఎందుకంటే ఆ జట్టులో సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అవ్విన్, మణికట్టు మాంత్రికుడు యుజ్వేంద్ర చాహల్ రూపంలో ఇద్దరు బెస్ట్ స్పిన్నర్లు ఉన్నారు. కానీ వాళ్లకు ఏదైనా ఇంజ్యురీ అయితే బ్యాకప్ ఆప్షన్ లేకుండా పోయింది. జంపా నిష్క్రమించడంతో రాజస్థాన్ స్పిన్ విభాగంలో ఇబ్బందులు ఎదుర్కోవడం తప్పేలా లేదు.

రాజస్థాన్​కు జంపా కంటే ముందే మరో షాక్ తగిలింది. ఇంజ్యురీ కారణంగా పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ ఐపీఎల్ నుంచి పూర్తిగా వైదొలిగాడు. అతడి ప్లేసులో మరో స్పీడ్​స్టర్​ను ఇంకా తీసుకోలేదు. ఇప్పుడు జంపా రూపంలో మరో ఎదురుదెబ్బ తగలడంతో రాయల్స్ మేనేజ్​మెంట్​కు ఏం చేయాలో పాలుపోవడం లేదు. ప్రసిద్ధ్, జంపా లేని లోటును కెప్టెన్ సంజూ శాంసన్ ఎలా పూడుస్తారో చూడాలి. ఇక, ఈసారి రాజస్థాన్ జట్టు పటిష్టంగా కనిపిస్తోంది. శాంసన్, జాస్ బట్లర్, షిమ్రాన్ హెట్​మెయిర్, యశస్వి జైస్వాల్​, ధృవ్ జురెల్​తో ఆ టీమ్ బ్యాటింగ్ సూపర్ స్ట్రాంగ్​గా కనిపిస్తోంది. ట్రెంట్ బౌల్ట్, బర్గర్, పావెల్, అశ్విన్, చాహల్ లాంటి స్టార్ బౌలర్లతో బౌలింగ్ విభాగం కూడా బలంగా కనిపిస్తోంది. మరి.. జంపా రూపంలో రాజస్థాన్​కు షాక్ తగలడం మీద మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

Show comments