IPLలో తేలిపోతున్న వరల్డ్ కప్ ప్లేయర్లు! కానీ.. ఆందోళన అవసరం లేదు!

T20 World Cup 2024, IPL 2024: టీ20 వరల్డ్‌ కప్‌ టీమ్‌ ప్రకటించిన తర్వాత.. సెలెక్ట్‌ అయిన ఆటగాళ్లు ఐపీఎల్‌లో చెత్త ప్రదర్శన కనబరుస్తున్నారు. కానీ, వారి ఫామ్‌పై అంతగా కంగారు పడాల్సిన పనిలేదు. అసలు విషయం తెలిస్తే మీరూ కూడా టెన్షన్‌ పడకుండా.. రిలాక్స్‌ అవుతారు. మరి ఎందుకు కంగారు పడొద్దో ఇప్పుడు తెలుసుకుందాం..

T20 World Cup 2024, IPL 2024: టీ20 వరల్డ్‌ కప్‌ టీమ్‌ ప్రకటించిన తర్వాత.. సెలెక్ట్‌ అయిన ఆటగాళ్లు ఐపీఎల్‌లో చెత్త ప్రదర్శన కనబరుస్తున్నారు. కానీ, వారి ఫామ్‌పై అంతగా కంగారు పడాల్సిన పనిలేదు. అసలు విషయం తెలిస్తే మీరూ కూడా టెన్షన్‌ పడకుండా.. రిలాక్స్‌ అవుతారు. మరి ఎందుకు కంగారు పడొద్దో ఇప్పుడు తెలుసుకుందాం..

ఐపీఎల్‌ 2024 హోరాహోరీగా సాగుతున్న సమయంలోనే టీ20 వరల్డ్‌ కప్‌ 2024 కోసం భారత సెలెక్టర్లు జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. 15 మందితో కూడిన స్క్వౌడ్‌తో పాటు, మరో నలుగురు స్టాండ్‌ బై ఆటగాళ్లను ఎంపిక చేశారు. గత ఏడాది కాలంగా టీ20 క్రికెట్‌లో టీమిండియా తరఫున చేస్తున్న ప్రదర్శన, డొమెస్టిక్‌ టీ20 క్రికెట్‌లో చూపిన ప్రతిభ, ఐపీఎల్‌లో ఆడుతున్న తీరు.. ఇలా అన్ని విషయాలను పరిగణలోకి తీసుకుని టీమ్‌ను ఎంపిక చేశారు సెలెక్టర్లు. అయితే.. టీ20 వరల్డ్‌ కప్‌ కోసం ఎంపికైన ఆటగాళ్లలో చాలా మంది ప్రస్తుతం చెత్త ప్రదర్శన చేస్తున్నారు. టీమ్‌ ప్రకటించక ముందు వరకు అద్భుతంగా రాణించిన యుజ్వేంద్ర చాహల్‌, అర్షదీప్‌ సింగ్‌, శివమ్‌ దూబే, రోహిత్‌ శర్మ, సంజు శాంసన్‌, సూర్యకుమార్‌ యాదవ్‌.. టీమ్‌ ప్రకటన తర్వాత తేలిపోతున్నారు. దీంతో.. భారత క్రికెట్‌ అభిమానులు కంగారు పడుతున్నారు.

ఇలా ఆడితే టీ20 వరల్డ్‌ కప్‌ గెలిచినట్టే.. అంటూ నిరాశ పడుతున్నారు. కానీ, వారందరూ ఒక విషయం మర్చిపోతున్నారు. టీ20 వరల్డ్‌ కప్‌ కోసం ఎంపికై, ప్రస్తుతం ఐపీఎల్‌లో విఫలం అవుతున్న ఆటగాళ్ల గురించి అస్సలు ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఎందుకంటే.. టీ20 వరల్డ్‌ కప్‌ జరిగేది ఇండియాలో కాదు. వెస్టిండీస్‌, అమెరికాలో వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఐపీఎల్‌ను ఎక్కువ మంది చూడాలనే ఒక స్ట్రాటజీతో పిచ్‌లన్నీ బ్యాటింగ్‌కు అనుకూలంగా మార్చి.. మ్యాచ్‌లు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్లాట్‌ పిచ్‌లపై బౌలర్లు విఫలం అవ్వడంపై భయపడాల్సిన పనిలేదు.

వెస్టిండీస్‌ పిచ్‌లు చాలా స్లోగా ఉండి, స్పిన్నర్లకు టర్న్‌ లభిస్తుంది. సో.. అక్కడి పిచ్‌లపై మన స్పిన్నర్లు, పేసర్లు కచ్చితంగా ప్రభావం చూపే అవకాశం మెండుగా ఉంది. అలాగే స్లో పిచ్‌లపై విరాట్‌ కోహ్లీ అద్భుతంగా ఆడగలడు. చాహల్‌, కుల్దీప్‌ యాదవ్‌లు వెస్టిండీస్‌ పిచ్‌లపై మోస్ట్‌ డేంజరస్‌ బౌలర్లుగా మారుతారు. ఇక అమెరికా పిచ్‌ల విషయానికి వస్తే.. ఇక్కడి పిచ్‌లు వేరే చోటు నుంచి తీసుకొచ్చి రెడీమెడ్‌గా తయారు చేస్తున్నారు. అమెరికాలో క్రికెట్‌ను ప్రొత్సహించేందుకు అక్కడ మ్యాచ్‌లు నిర్వహిస్తుండటంతో.. కచ్చితంగా కాస్త బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. సో.. ఇప్పుడు బ్యాటింగ్‌లో విఫలం అయ్యే సంజు శాంసన్‌, సూర్యకుమార్‌ యాదవ్‌ లాంటి ఆటగాళ్లు అక్కడి పిచ్‌లపై రెచ్చిపోయే అవకాశం గట్టిగా ఉంది.

పైగా ఐపీఎల్‌ వేరు, టీ20 వరల్డ్‌ కప్‌ వేరు.. ఈ రెండు టోర్నీలకు చాలా తేడా ఉంటుంది. ఐపీఎల్‌ పక్కా కమర్షియల్‌ కావడంతో భారీ స్కోర్లకు కోసం బౌలర్లను బలి చేస్తూ.. ఫ్లాట్‌ పిచ్‌లు రెడీ చేస్తూ ఉంటారు. కానీ, ఐసీసీ నిర్వహించే పిచ్‌లు బ్యాటర్లు, బౌలర్లకు సమ అనుకూలంగా ఉంటాయి. అలాగే ఐపీఎల్‌ మ్యాచ్‌లను ఆటగాళ్లు కూడా మరీ అంత సీరియస్‌గా తీసుకుని కూడా ఆడరు. ఎందుకంటే వరుస మ్యాచ్‌లు, బిజీ షెడ్యూల్‌తో అలసిపోతుంటారు. కానీ, వరల్డ్‌ కప్‌ లాంటి మెగా టోర్నీలో ఒక దేశానికి ప్రతినిథ్యం వహిస్తున్నప్పుడు అలా ఉండదు.. ప్రాణం పెట్టి, తమ బెస్ట్‌ను ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. అందుకే ఇప్పుడు ఐపీఎల్‌లో మన బౌలర్ల ప్రదర్శన చూసి పెద్దగా కంగారు పడాల్సిన పనిలేదు. టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో టీమిండియా మంచి ప్రదర్శన కనబరుస్తుందని క్రికెట్‌ నిపుణులు సైతం అభిప్రాయపడుతున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments