టీ20 వరల్డ్‌ కప్‌.. పాకిస్థాన్‌పై ఇండియానే గెలుస్తుంది: పాక్‌ క్రికెటర్‌

Kamran Akmal, IND vs PAK, T20 World Cup 2024: టీ20 వరల్డ్‌ కప్‌లో పాకిస్థాన్‌పై ఇండియానే కచ్చితంగా గెలుస్తుందని.. పాకిస్థాన్‌ స్టార్‌ క్రికెటర్‌ తేల్చి చెప్పాడు. మరి అతను అలా ఎందుకు అన్నాడో ఇప్పుడు తెలుసుకుందాం..

Kamran Akmal, IND vs PAK, T20 World Cup 2024: టీ20 వరల్డ్‌ కప్‌లో పాకిస్థాన్‌పై ఇండియానే కచ్చితంగా గెలుస్తుందని.. పాకిస్థాన్‌ స్టార్‌ క్రికెటర్‌ తేల్చి చెప్పాడు. మరి అతను అలా ఎందుకు అన్నాడో ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్‌ అభిమానులంతా ఎదురుచూస్తున్న టీ20 వరల్డ్‌ కప్‌ మరి కొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. అమెరికా, వెస్టిండీస్‌ సంయుక్త వేదికగా జూన్‌ 2 నుంచి పొట్టి ప్రపంచ కప్‌ పోటీలు మొదలవుతాయి. జూన్‌ 5న ఐర్లాండ్‌తో జరిగే మ్యాచ్‌తో టీమిండియా తమ వరల్డ్‌ కప్‌ వేటను మొదలుపెట్టనుంది. కానీ, అందరూ ఎదురుచూసేది మాత్రం జూన్‌ 9న ఇండియా-పాకిస్థాన్‌ మ్యాచ్‌ గురించే. అయితే.. ఈ మ్యాచ్‌లో టీమిండియానే గెలుస్తుందని భారత క్రికెట్‌ అభిమానులు, టీమిండియా క్రికెటర్లు అనడంలో ఎలాంటి విశేషం లేదు.. కానీ, పాకిస్థాన్‌పై ఇండియానే గెలుస్తుందంటూ.. ఓ పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్‌ బల్లగుద్ది చెబుతున్నాడు. ఆ మాట చెప్పింది పాక్‌ మాజీ వికెట్‌ కీపర్‌ కమ్‌ బ్యాటర్‌ కమ్రాన్‌ అక్మల్‌.

పాకిస్థాన్‌పై ఇండియా గెలవడం అనేది ఒక సంప్రదాయంగా కొనసాగుతోంది. వరల్డ్‌ కప్స్‌లో పాకిస్థాన్‌పై టీమిండియాదే పేచేయి అని అక్మల్‌ ఒప్పుకున్నాడు. ఏదో టీ20 వరల్డ్‌ కప్‌ 2021లో తప్పా.. ఇండియాపై పాకిస్థాన్‌ ఎప్పుడూ గెలవలేదని.. ఇప్పుడు కూడా గెలవదని తేల్చి చెప్పేశాడు. పైగా ప్రస్తుతం పాకిస్థాన్‌ టీమ్‌ ఉన్న ఫామ్‌ను చూస్తే కూడా ఆ జట్టు ఏ కోణంలో కూడా టీమిండియాకు కనీసం పోటీ ఇచ్చేలా లేదు. టీ20 వరల్డ్‌ కప్‌ 2024కి ముందు ఇంగ్లండ్‌తో నాలుగు టీ20ల సిరీస్‌ ఆడిన పాకిస్థాన్‌ రెండు మ్యాచ్‌లు రద్దు అవ్వగా రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయి.. 2-0తో ఓటమి పాలైంది.

ఇక ఇండియా పాకిస్థాన్‌ మ్యాచ్‌ అంటే ఎలాంటి సందడి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ హైవోల్టేజ్ మ్యాచ్‌ను స్టేడియంలో చూసేందుకు క్రికెట్‌ అభిమానులు టికెట్ల కోసం పోటీ పడుతుంటారు. భారత్-పాక్ మ్యాచ్‌‌కు ఉన్న క్రేజ్‌ను ఐసీసీ కూడా క్యాష్ చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఏ వరల్డ్ కప్ జరిగినా.. ఇండియా, పాకిస్థాన్‌ను ఓకే గ్రూప్‌లో ఉండి.. ఈ రెండు జట్ల మధ్య కచ్చితంగా ఒక మ్యాచ్‌ అయినా జరిగేలా చూస్తోంది. పైగా రెండు జట్లు బాగా ఆడితే.. ఒకటి కంటే ఎక్కువ మ్యాచ్‌లు కూడా జరగొచ్చు. అది కూడా ఐసీసీకి లాభమే. ఈ టీ20 వరల్డ్ కప్‌లో ఇండియా, పాకిస్థాన్ గ్రూప్-ఏలో ఉన్నాయి. జూన్‌ 9న న్యూయార్క్‌లోని నసావు స్టేడియంలో దాయాదుల పోరు జరగనుంది. మరి పాకిస్థాన్‌పై ఇండియానే గెలుస్తుందని ఒక పాక్‌ ప్లేయర్‌ అంత బలంగా చెప్పడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments