Nidhan
భారత జట్టు కోసం తాత్కాలిక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మరో సాహసం చేశాడు. అతడు చేసిన ఆ పనేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
భారత జట్టు కోసం తాత్కాలిక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మరో సాహసం చేశాడు. అతడు చేసిన ఆ పనేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Nidhan
సౌతాఫ్రికా సిరీస్‌ను టీమిండియా ఓటమితో స్టార్ట్ చేసింది. తొలి మ్యాచ్‌ను పూర్తిగా రద్దు చేయించిన వరుణుడు.. రెండో టీ20కూ అడ్డు తగిలాడు. దీంతో డక్‌వర్త్ లూయిస్ ప్రకారం జరిగిన ఈ మ్యాచ్‌లో భారత జట్టు 5 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన మన టీమ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. రింకూ సింగ్ (68), సూర్యకుమార్ యాదవ్ (56) మెరుపులతో భారీ స్కోరు చేయగలిగింది భారత్. స్కోరు బోర్డు మీదకు 6 రన్స్ కూడా చేరకుండానే 2 వికెట్లు కోల్పోయిన జట్టును కెప్టెన్ సూర్య ఆదుకున్నాడు. తిలక్ వర్మ (29) సాయంతో ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. ఆ తర్వాత రింకూతో కలసి మంచి పార్ట్నర్షిప్ నెలకొల్పాడు.
వేగంగా పరుగులు చేసే క్రమంలో సూర్యకుమార్ ఔటైనా రింకూ మాత్రం పట్టుదలతో ఆడాడు. స్ట్రైక్ రొటేట్ చేస్తూనే చెత్త బాల్ దొరికిన ప్రతిసారి బౌండరీలు, సిక్సులు కొట్టాడు. అతడు కొట్టిన ఒక బాల్ దెబ్బకు మీడియా బాక్స్ అద్దం పగిలిపోయింది. డక్‌వర్త్ లూయిస్ ప్రకారం ప్రొటీస్ టార్గెట్‌ను 15 ఓవర్లలో 152గా సవరించారు. దాన్ని 13.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేజ్ చేసేసింది. భారత బౌలర్లలో ముకేశ్ కుమార్ 2 వికెట్లు పడగొట్టాడు. మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్‌కు చెరో వికెట్ దక్కింది. సఫారీ బ్యాటర్లలో హెండ్రిక్స్ (49) టాప్ స్కోరర్‌గా ఉన్నాడు. గ్రౌండ్లో తేమ ఉండటంతో టీమిండియా బౌలర్లకు బాల్ మీద పట్టు చిక్కలేదు. దీంతో అనుకున్న ప్రదేశాల్లో బంతులు విసిరేందుకు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. దీన్ని ఉపయోగించుకొని హెండ్రిక్స్ సహా ఇతర బ్యాటర్లు చెలరేగి ఆడారు. ఆఖర్లో మన బౌలర్లు కొన్ని బ్రేక్ త్రూలు ఇచ్చినా అప్పటికే మ్యాచ్ చేజారింది.
ఇక, ఈ మ్యాచ్‌లో భారత ఇన్నింగ్స్‌లో కెప్టెన్ సూర్యకుమార్ బ్యాటింగ్ కాస్త స్పెషల్ అనే చెప్పాలి. ఓపెనర్లు ఇద్దరూ త్వరత్వరగా ఔటవ్వడం, సఫారీ పేసర్లు విజృంభించి బౌలింగ్ చేస్తుండటంతో బ్యాటింగ్ కష్టంగా మారింది. ఈ టైమ్‌లో మిస్టర్ 360 తన ఎక్స్‌పీరియెన్స్ మొత్తాన్ని బయటకు తీసి ఆడాడు. స్ట్రైక్ రొటేట్ చేస్తూనే బౌండరీలు, సిక్సులు కొడుతూ ప్రత్యర్థి టీమ్ బౌలర్లను భయపెట్టాడు. అతడి ఇన్నింగ్స్ వల్లే జట్టు నిలబడింది. సూర్య ఇచ్చిన ఎంకరేజ్‌మెంట్‌తోనే ఆఖర్లో రింకూ భారీ షాట్లు ఆడుతూ జట్టుకు భారీ స్కోరును అందించాడు. అయితే సూర్యకు సంబంధించిన మరో అంశం ఇప్పుడు హైటైల్ అవుతోంది. అదే అతడి ఫిట్నెస్. ఆ మధ్య కాస్త బొద్దుగా కనిపించిన ఈ పించ్ హిట్టర్.. ఇప్పుడు పర్ఫెక్ట్ ఫిజిక్‌తో కనిపిస్తున్నాడు. ఈ విషయంపై సోషల్ మీడియాలో సూర్య ఓ పోస్ట్ పెట్టాడు. నాలుగు నెలల్లోనే తనలో ఎంత మార్పు వచ్చిందో చెప్పాడు.
కెప్టెన్ సూర్య చేసిన పనిపై నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. బరువు తగ్గడం అనేది ఒక్కరోజులో అయ్యే పని కాదు. వేగంగా బరువు తగ్గాలనుకునే క్రమంలో బెడిసికొడితే కెరీర్ రిస్క్‌లో పడే ఛాన్స్ కూడా ఉంది. అయినా సూర్య ఏమాత్రం భయపడకుండా టీమ్ కోసం వెయిట్ తగ్గాడు. బ్యాటింగ్, ఫీల్డింగ్‌లో మరింతగా రాణించాలనే ఉద్దేశంతో ఈ పని చేసినట్లు తెలుస్తోంది. దీని ప్రభావం సౌతాఫ్రికాతో సెకండ్ టీ20లో కనిపించింది. ఫీల్డింగ్‌లో మిస్టర్ 360 హుషారుగా కనిపించాడు. బ్యాటింగ్ టైమ్‌లోనూ వికెట్ల మధ్య వేగంగా పరుగులు తీస్తూ జోష్‌లో ఉన్నాడు. మరి.. భారత టీమ్ కోసం సూర్య చేసిన ఈ సాహసంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: IND vs SA: సూర్యకుమార్ బెస్ట్ కెప్టెన్ అనడానికి ఇదే ఉదాహరణ! హ్యాట్సాఫ్!