క్రికెట్లో కొన్ని మ్యాచులకు ఉండే హైప్ అంతా ఇంతా కాదు. కొన్ని జట్లు గ్రౌండ్లో తలపడుతుంటే చూడాలని క్రికెట్ అభిమానులు కోరుకుంటారు. అలా అత్యంత ఆసక్తిని రేకెత్తించే మ్యాచులుగా భారత్, పాకిస్థాన్ మ్యాచులని చెప్పొచ్చు. ఈ రెండు జట్లు బరిలోకి దిగుతున్నాయంటే స్టేడియాలు నిండిపోవాల్సిందే. ఈ దాయాది జట్లు పోటీపడుతుంటే అది మ్యాచ్‌లా కాకుండా ఒక యుద్ధాన్ని తలపిస్తుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. టీమ్స్ మధ్యే కాదు మ్యాచ్‌ను చూసే అభిమానులు కూడా దీన్ని వార్లాగే చూస్తారు. గ్రౌండ్లో ఇరు జట్ల అభిమానులు తమ దేశాల పేర్లు, ఇష్టమైన ప్లేయర్ల పేర్లు చెబుతూ స్టేడియాన్ని మోతెక్కిస్తారు. ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్‌లకు టీఆర్పీ రేటింగ్స్ కూడా ఒక రేంజ్లో వస్తాయి.
ఓటీటీల్లోనూ భారత్-పాక్ మ్యాచ్‌కు స్ట్రీమింగ్ కౌంట్ భారీ లెవల్లోనే ఉంటుంది. దీంతో ఈ మ్యాచ్‌లకు యాడ్స్ ఇచ్చేందుకు ప్రముఖ బ్రాండ్లన్నీ పోటీపడతాయి. వ్యూస్ పరంగా, బిజినెస్ పరంగా, ఎంటర్టైన్మెంట్ పరంగా చూసుకున్నా భారత్, పాక్ మ్యాచ్ ఎంతో కీలకం. అయితే ఈసారి మాత్రం ఈ మ్యాచ్ మీద అంతగా బజ్ కనిపించడం లేదు. ఆసియా కప్-2023లో తమ తొలి మ్యాచ్‌లోనే పాక్‌తో తలపడనుంది భారత్. ఈ మ్యాచ్‌కు ఇంకా ఒక్క రోజే సమయం ఉంది. కానీ ఎందుకో మునుపటిలా దాయాదుల పోరుకు ముందు ఉండాల్సిన బజ్ కనిపించడం లేదు. రేపు భారత్, పాకిస్థాన్ మ్యాచ్ అంటే ఈ రోజు ఉండాల్సినంత బజ్ లేదు. బజ్ క్రియేట్ చేయడంలో బీసీసీఐ పూర్తిగా విఫలమైందనే విమర్శలు వస్తున్నాయి.
ఈసారి ఆసియా కప్ నిర్వహణ పాక్, శ్రీలంక బోర్డులదే అయినప్పటికీ ఈ మ్యాచ్ కోసం బీసీసీఐ చేయాల్సిన ప్రయత్నాలు చేయట్లేదని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ మ్యాచ్ కోసం బజ్ క్రియేట్ చేయడంలో మన బోర్డు ప్రయత్నాలు శూన్యం అని ఎక్స్‌పర్ట్స్‌తో పాటు ఫ్యాన్స్ కూడా అంటున్నారు. పాక్‌తో మ్యాచ్‌కు ముందు ఆ జట్టుతో మ్యాచ్‌లు ఆడిన భారత మాజీ క్రికెటర్ల బైట్స్ గానీ.. పాత వీడియోలు గానీ పోస్ట్ చేయడం లేదు బీసీసీఐ. హై ఓల్టేజ్ మ్యాచ్‌గా చెప్పుకునే ఇండో-పాక్ పోరుకు ఉండాల్సినంత హైప్ తీసుకురావడంలో బీసీసీఐ అన్ని విధాలా ఫెయిలైందనే కామెంట్స్ వస్తున్నాయి. మరి.. భారత్-పాక్ మ్యాచ్ విషయంలో మిన్నకుండిపోయిన బీసీసీఐ తీరుపై మీరేం అనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి:
దాదా నా మాట వినకుండా ఆ మ్యాచ్ ఆడించాడు: సెహ్వాగ్