Nidhan
వైజాగ్ టెస్టులో అద్భుతమైన బౌలింగ్‌తో టీమిండియా గెలుపులో జస్ప్రీత్ బుమ్రా కీలకపాత్ర పోషించాడు. అలాంటోడ్ని మూడో టెస్టుకు పక్కన పెడుతున్నారు.
వైజాగ్ టెస్టులో అద్భుతమైన బౌలింగ్‌తో టీమిండియా గెలుపులో జస్ప్రీత్ బుమ్రా కీలకపాత్ర పోషించాడు. అలాంటోడ్ని మూడో టెస్టుకు పక్కన పెడుతున్నారు.
Nidhan
వైజాగ్ టెస్టులో టీమిండియా గ్రాండ్ విక్టరీ సాధించింది. 106 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తుగా ఓడించింది. బజ్‌బాల్ క్రికెట్‌తో కాసేపు ప్రత్యర్థి జట్టు కంగారుపెట్టినా.. ఆ టీమ్‌ను మన బౌలర్లు మడతపెట్టారు. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్‌కు తోడుగా మిగతా బౌలర్లు కూడా బాగా బౌలింగ్ చేయడంతో ఇంగ్లండ్‌కు ఓటమి తప్పలేదు. ఈ మ్యాచ్‌లో బజ్‌బాల్ బెండు తీయడంలో, మ్యాచ్‌ను భారత్ వైపు తిప్పడంలో కీలకపాత్ర పోషించింది బుమ్రానే. యశస్వి జైస్వాల్, శుబ్‌మన్ గిల్ భారీ ఇన్నింగ్స్‌లతో అదరగొట్టారు. వాళ్ల కాంట్రిబ్యూషన్‌ను కాదనడానికి లేదు. కానీ బజ్‌బాల్‌తో భయపెట్టిన ఇంగ్లండ్‌ను భారీ స్కోర్లు చేయకుండా.. టార్గెట్ చేరుకోలేమనే భయాన్ని పుట్టించి పడగొట్టింది మాత్రం బుమ్రానే. మ్యాచ్ మొత్తం మీద 9 వికెట్లు తీసిన ఏస్ పేసర్.. ఇంగ్లీష్ బ్యాటర్లను ఓ రేంజ్లో పోయించాడు. అయితే అలాంటోడ్ని మూడో టెస్టుకు దూరం పెట్టనున్నారని తెలుస్తోంది.
రెండో టెస్టులో రోహిత్ సేన గెలుపులో ప్రధాన పాత్ర పోషించిన బుమ్రా మూడో టెస్టుకు దూరం కానున్నట్లు క్రికెట్ వర్గాల్లో వినిపిస్తోంది. రాజ్‌కోట్ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో పేసుగుర్రానికి రెస్ట్ ఇవ్వనున్నట్లు సమాచారం. ఆఖరి రెండు టెస్టుల్లో మరింత ఉత్సాహంగా ఉండేందుకు టీమ్ మేనేజ్మెంట్ ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. అయితే దీని మీద జట్టు నుంచి గానీ బీసీసీఐ నుంచి గానీ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ మూడో టెస్టులో బుమ్రాను పక్కన పెట్టడం ఖాయమని క్రికెట్ వర్గాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలో రేపటి భారత జట్టు ప్రకటనపై మరింత ఆసక్తి నెలకొంది. ఒకవేళ బుమ్రా ఆడకపోతే అతడి ప్లేసులో ఎవర్ని ఆడిస్తారో చూడాలి. మొదటి టెస్టులో ఆడిన హైదరాబాదీ మహ్మద్ సిరాజ్‌ను జస్ప్రీత్ ప్లేసులో దింపుతారా? లేదా కొత్తగా మరో బౌలర్‌ను స్క్వాడ్‌లోకి తీసుకొస్తారా అనేది చూడాలి.
కాగా, విశాఖపట్నం ఆతిథ్యం ఇచ్చిన రెండో టెస్టుకు భారత చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ హాజరయ్యారు. ఆట నాలుగో రోజు ఆయన గ్రౌండ్‌కు వచ్చారు. మ్యాచ్ అయిపోయాక కెప్టెన్ రోహిత్ శర్మతో కలసి అగార్కర్ మాట్లాడుతూ కనిపించారు. ఆ సమయంలో హిట్‌మ్యాన్ టీమ్ ప్లేయర్ల వైపు తన చేతి వేలిని చూపిస్తూ ఏదో సీరియస్‌గా చెప్పాడు. ప్రస్తుత సమాచారం ప్రకారం.. ఈ సిరీస్‌లోని మిగిలిన మూడు టెస్టులకు సంబంధించి జట్టు ప్రకటన రేపు ఉండనుంది. టీమ్ అనౌన్స్మెంట్ విషయంలో ఇంకో ప్లేయర్ కోసం అందరూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అతడే సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ. వ్యక్తిగత కారణాల వల్ల తొలి రెండు మ్యాచులకు దూరంగా ఉన్న కింగ్.. సిరీస్‌లోని మిగిలిన మ్యాచుల్లోనైనా ఆడతాడా? లేదా సిరీస్ మొత్తానికి దూరంగా ఉంటాడా? అనేది జట్టు ప్రకటన తర్వాతే క్లారిటీ రానుంది. మరి.. బుమ్రాను మూడో టెస్టులో ఆడించాలా? వద్దా? మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.
Jasprit Bumrah could be rested from the 3rd Test against England in Rajkot. (Cricbuzz). pic.twitter.com/GhFxbpNU3e
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 5, 2024