Nidhan
ఉప్పల్ టెస్టులో విజయంతో ఫుల్ జోష్‌లో ఉన్న ఇంగ్లండ్ టీమ్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వైజాగ్‌లో జరగనున్న రెండో టెస్టుకు ఆ జట్టులోని స్టార్ ప్లేయర్ దూరమయ్యాడు.
ఉప్పల్ టెస్టులో విజయంతో ఫుల్ జోష్‌లో ఉన్న ఇంగ్లండ్ టీమ్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వైజాగ్‌లో జరగనున్న రెండో టెస్టుకు ఆ జట్టులోని స్టార్ ప్లేయర్ దూరమయ్యాడు.
Nidhan
ఉప్పల్ టెస్టులో నెగ్గి ఫుల్ జోష్‌లో ఉంది ఇంగ్లండ్. భారత్‌ను బజ్‌బాల్ క్రికెట్‌తో ఓడించామనే సంతోషంలో ఉంది. సొంతగడ్డపై టీమిండియాను ఓడించడం అసాధ్యమనే మాటలకు చెక్ పెట్టామని భావిస్తోంది. ఒక మ్యాచ్‌లో గెలిచారు కాబట్టి మరో రెండు టెస్టుల్లో నెగ్గి సిరీస్‌ను పట్టేయాలని చూస్తోంది. అయితే అదంత ఈజీ కాదు. మున్ముందు మరింత కఠిన పరీక్షల్ని ఆ టీమ్ ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఓడిపోయిన బాధలో ఉన్న రోహిత్ సేన తిరిగి అటాక్ చేస్తుంది. ఈ తరుణంలో అపోజిషన్ టీమ్‌కు ఓ పిడుగు లాంటి వార్త. రెండో టెస్టుకు ముందు ఇంగ్లండ్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టులోని స్టార్ ప్లేయర్ ఒకరు విశాఖపట్నం టెస్టుకు దూరమయ్యాడు. అతడే స్పిన్నర్ జాక్ లీచ్.
విశాఖపట్నంలోని వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్టేడియం ఆతిథ్యం ఇస్తున్న రెండో టెస్టులో నెగ్గి సిరీస్‌లో తమ ఆధిక్యాన్ని 2-0కు పెంచుకోవాలని ఇంగ్లండ్ భావిస్తోంది. భారత్‌ను ఓడించేందుకు అవసరమైతే నలుగురు స్పిన్నర్లతో బరదిలోకి దిగుతామని ఆ జట్టు కోచ్ బ్రెండన్ మెకల్లమ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ తరుణంలో ఇంగ్లీష్ టీమ్‌కు బిగ్ షాక్. స్టార్ స్పిన్నర్ లీచ్ రెండో టెస్టులో ఆడటం లేదు. మోకాలి గాయంతో బాధపడుతున్న లీచ్ ప్రస్తుతం ఇంగ్లండ్ మెడికల్ టీమ్ పర్యవేక్షణలో ఉన్నాడు. ఉప్పల్‌లో జరిగిన మొదటి టెస్టులో అతడు ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డాడు. రెండో రోజు గేమ్‌లో బాల్‌ను ఆపే క్రమంలో డైవ్ చేసిన లీచ్ తీవ్రంగా గాయపడ్డాడు. నొప్పితో విలవిల్లాడిన స్పిన్నర్ ఎక్కువ శాతం డ్రెస్సింగ్ రూమ్‌కే పరిమితం అయ్యాడు. ఆ తర్వాత మోకాలికి స్ట్రాపింగ్ వేసుకొని బరిలోకి దిగాడు. ఇంజ్యురీ వల్ల అతడు అంత ఎఫెక్టివ్‌గా బౌలింగ్ చేయలేకపోయాడు. రెండో ఇన్నింగ్స్‌లో 10 ఓవర్లు వేసిన లీచ్ ఒక వికెట్ తీశాడు.
జాక్ లీచ్ ఇంజ్యురీ మీద ఇంగ్లండ్ టీమ్ స్పిన్ కోచ్ జీతన్ పటేల్ రియాక్ట్ అయ్యాడు. తాకిన చోటే రెండు సార్లు తాకడంతో అతడి గాయం తీవ్రత మరింత ఎక్కువైందని అన్నాడు. అయితే గాయంతో బాధపడుతున్నా తొలి టెస్టులో అతడు అద్భుతంగా బౌలింగ్ చేశాడని జీతన్ పటేల్ ప్రశంసించాడు. లీచ్ రెండో టెస్టులో ఆడటం లేదని.. అతడికి అయిన గాయం ఇంకా నయం కాలేదని స్వయంగా ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ కన్ఫర్మ్ చేశాడని బెల్ఫాస్ట్ టెలిగ్రాఫ్.యూకే అనే వెబ్సైట్ ప్రచురించింది. అయితే ఎంతో ఎక్స్‌పీరియెన్స్ కలిగిన జాక్ లీచ్ దూరమైతే ఇంగ్లీష్ టీమ్‌కు ఇబ్బందులు తప్పవు. అతడి స్థానంలో యంగ్‌స్టర్ షోయబ్ బషీర్ అరంగేట్రం చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. వీసా సమస్యలతో ఉప్పల్ టెస్టుకు అందుబాటులో లేకుండా పోయిన బషీర్.. ఇటీవలే ఇండియాలో అడుగుపెట్టాడు. రెండో టెస్టులో నలుగురు స్పిన్నర్లతో దిగుతామని మెకల్లమ్ చెప్పిన నేపథ్యంలో బషీర్ డెబ్యూ ఖాయంలా కనిపిస్తోంది. మరి.. రెండో టెస్టుకు లీచ్ దూరమైన నేపథ్యంలో ఆ ప్రభావం ఇంగ్లండ్ మీద పడుతుందని మీరు భావిస్తున్నట్లయితే కామెంట్ చేయండి.
Jack Leach ruled out of the 2nd Test Vs India. pic.twitter.com/bkwzNoChhQ
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 31, 2024