Nidhan
టీ20 వరల్డ్ కప్-2024లో టీమిండియాకు ఓ సెంటిమెంట్ బాగా కలిసొస్తోంది. దీంతో ఈసారి కప్పు మనదేనని అంతా అంటున్నారు. ఏంటా సెంటిమెంట్? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
టీ20 వరల్డ్ కప్-2024లో టీమిండియాకు ఓ సెంటిమెంట్ బాగా కలిసొస్తోంది. దీంతో ఈసారి కప్పు మనదేనని అంతా అంటున్నారు. ఏంటా సెంటిమెంట్? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
Nidhan
టీ20 ప్రపంచ కప్-2024లో భారత జట్టు హవా నడుస్తోంది. ఆడిన మూడు మ్యాచుల్లో నెగ్గిన రోహిత్ సేన.. దర్జాగా సూపర్-8లోకి అడుగు పెట్టింది. కెనడాతో జరగాల్సిన ఆఖరి మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. వరుణుడు ఎంతటికీ కరుణించకపోవడంతో ఒక్క బాల్ కూడా పడకుండానే మ్యాచ్ రద్దయింది. దీంతో ఇరు జట్లకు ఒక్కో పాయింట్ కేటాయించారు. దీంతో 7 పాయింట్లతో భారత్ టేబుల్ టాపర్‌గా నిలిచింది. ఇదే గ్రూప్ నుంచి సూపర్-8కు చేరిన మరో జట్టు యూఎస్ఏ 5 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. దాయాది పాకిస్థాన్ 2 పాయింట్లతో కెనడా కంటే దిగువన నిలిచింది. గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లు పూర్తవడంతో సూపర్-8 మీద రోహిత్ సేన ఫోకస్ చేస్తోంది. ఏయే జట్ల మీద ఎలాంటి ప్లానింగ్‌తో ముందుకెళ్లాలి అనేది కసరత్తులు చేస్తోంది. అయితే ఇంకా సూపర్ పోరులు మొదలవక ముందే టీమిండియాదే కప్పు అని అభిమానులు అంటున్నారు.
సూపర్-8తో పాటు నాకౌట్ దశ మ్యాచ్‌లు ముగిస్తే గానీ ఫైనల్ చేరే టీమ్స్ మీద క్లారిటీ రాదు. అయితే ఫ్యాన్స్ మాత్రం ఈసారి టీమిండియాదే కప్పు అని నమ్మకంగా చెబుతున్నారు. ఓ సెంటిమెంట్ మన జట్టుకు కలిసొస్తోందని అంటున్నారు. కెనడాతో మ్యాచ్ రద్దవడమే దీనికి ఎగ్జాంపుల్ అని కామెంట్స్ చేస్తున్నారు. పొట్టి కప్పులో భారత్ ఆడాల్సిన మ్యాచ్ వాన వల్ల రద్దయినప్పుడు ఛాంపియన్‌గా నిలిచిందని గుర్తు చేస్తున్నారు. టీ20 వరల్డ్ కప్-2007లో మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలోని టీమిండియా విజేతగా నిలిచింది. ఆ ఏడాది జరిగిన చాలా విషయాలు ఇప్పుడు మళ్లీ రిపీట్ అవుతున్నాయి. తొలి టీ20 ప్రపంచ కప్‌లో స్కాట్లాండ్తో భారత జట్టు ఆడాల్సిన మ్యాచ్ వర్షం వల్ల ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయింది. ఆ టోర్నీలో టీమిండియాలో శ్రీశాంత్ రూపంలో ఓ కేరళ ప్లేయర్ ఉన్నాడు. ఇదే ఇప్పుడు పునరావృతం అయింది.
ప్రస్తుత ప్రపంచ కప్‌లో కెనడాతో భారత్ ఆడాల్సిన మ్యాచ్ వర్షం కారణంగానే రద్దయింది. ఈసారి టీమిండియా స్క్వాడ్‌లో సంజూ శాంసన్ రూపంలో కేరళ నుంచి ఓ ఆటగాడు ఉన్నాడు. దీంతో టీమిండియాకు అన్ని శకునాలు కలిసొస్తున్నాయని చెబుతున్నారు ఫ్యాన్స్. అరంగేట్ర ప్రపంచ కప్‌లో, అలాగే ప్రస్తుత వరల్డ్ కప్‌లోనూ ఆతిథ్య దేశాలు తొలి మ్యాచుల్లో విజయాలు సాధించాయని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. అదే విధంగా మ్యాచ్ టై అయిన తర్వాత పాకిస్థాన్ ఓడిన సంగతిని గుర్తు చేస్తున్నారు. అప్పుడు బౌలౌట్‌లో భారత్‌పై ఓడిన పాక్.. ఈసారి యూఎస్ఏ చేతుల్లో సూపర్ ఓవర్లో మట్టికరిచింది. ఆతిథ్య దేశం మీద టీమిండియా లెఫ్టార్మ్ పేసర్స్ 4 వికెట్లు తీయడం గురించి కూడా చెబుతున్నారు. ఇలా అరంగేట్ర ప్రపంచ కప్‌లోని చాలా సెంటిమెంట్లు ఇప్పుడు రిపీట్ అవుతున్నాయని.. కాబట్టి ఈసారి కప్పు రోహిత్ సేనదేనని బల్ల గుద్ది చెబుతున్నారు అభిమానులు. మరి.. టీమిండియా కప్పు కొడుతుందని మీరు భావిస్తే కామెంట్ చేయండి.