IND vs AUS: ఆసీస్ తో వన్డే సిరీస్.. జట్టులోకి సీనియర్ ప్లేయర్ ఎంట్రీ!

ఆసీస్ తో వన్డే సిరీస్.. జట్టులోకి సీనియర్ ప్లేయర్ ఎంట్రీ!

  • Author Soma Sekhar Published - 07:39 AM, Tue - 19 September 23
  • Author Soma Sekhar Published - 07:39 AM, Tue - 19 September 23
ఆసీస్ తో వన్డే సిరీస్.. జట్టులోకి సీనియర్ ప్లేయర్ ఎంట్రీ!

వరల్డ్ కప్ ముంగిట ఆసియా కప్ ను కైవసం చేసుకుని ఫుల్ జోష్ లో ఉంది టీమిండియా. ఇక ఇదే ఊపును మరో రెండు రోజుల్లో ఆసీస్ తో ప్రారంభం అయ్యే వన్డే సిరీస్ లో కూడా చూపించాలని భావిస్తోంది. ఆసీస్ తో జరిగి మూడు వన్డే మ్యాచ్ ల సిరీస్ కోసం అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ భారత జట్టును ప్రకటించింది. తొలి రెండు వన్డేలకు స్టార్ ప్లేయర్లు అయిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యాలకు విశ్రాంతినిచ్చింది. అలాగే శ్రీలంకతో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో గాయపడిన అక్షర్ పటేల్ ను తొలి రెండు వన్డేలకు పక్కన పెట్టారు. అయితే జట్టులోకి వరల్డ్ కప్ కు ఎంపిక చేయని సీనియర్ ఆటగాడికి ఈ సిరీస్ లో చోటు దక్కడం గమనార్హం.

ఆసీస్ తో జరిగే మూడు వన్డే మ్యాచ్ ల సిరీస్ కోసం టీమిండియా జట్టును ప్రకటించింది బీసీసీఐ. ఈ సిరీస్ కోసం అజిత్ అగార్కర్ నేతృత్వంలో సెలక్షన్ కమిటీ ఆటగాళ్లను ఎంపిక చేసింది. ఈసారి కూడా టీమిండియా ప్రయోగాల బాటపట్టిందనే చెప్పాలి. వరల్డ్ కప్ ముంగిట యంగ్ ప్లేయర్ల సత్తా పరీక్షించడానికి సిద్దమైంది. అందులో భాగంగానే గైక్వాడ్, తిలక్ వర్మ, ప్రసిద్ద్ కృష్ణ లాంటి యంగ్ ప్లేయర్లకు ఛాన్స్ ఇచ్చింది. ఇక ఆసీస్ తో జరిగే తొలి రెండు వన్డేలకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, పాండ్యాలకు విశ్రాంతిని ఇచ్చారు.

కాగా.. ఈ రెండు వన్డేలకు టీమిండియా కెప్టెన్ గా కేఎల్ రాహుల్ వ్యవహరించనున్నాడు. వైస్ కెప్టెన్ గా స్టార్ ఆల్ రౌండర్ జడేజాను ఎంపిక చేశారు. మూడో వన్డేకు వీరు ముగ్గురు జట్టులోకి చేరతారు. మరోవైపు లంకతో మ్యాచ్ లో గాయపడ్డ అక్షర్ పటేల్ ను కూడా తొలి రెండు వన్డేలకు పక్కన పెట్టారు. అయితే మూడో వన్డే వరకు అతడు ఫిట్ నెస్ నిరూపించుకుంటే.. జట్టులోకి తీసుకోవచ్చు. ఇదిలా ఉండంగా.. వరల్డ్ కప్ లో చోటు దక్కించుకోవడంతో విఫలం అయిన అశ్విన్ ను అనూహ్యంగా ఆసీస్ తో సిరీస్ కు ఎంపిక చేశారు. ఇక మరోసారి తెలుగు కుర్రాడు తిలక్ వర్మకు ఛాన్స్ ఇచ్చారు. సెప్టెంబర్ 22 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది. వరల్డ్ కప్ ముంగిట ఈ సిరీస్ ఇరు జట్లకు ప్రాక్టీస్ గా ఉపయోగపడనుంది.

భారత జట్టు(తొలి రెండు వన్డేలకు)

కేఎల్ రాహుల్(కెప్టెన్), రవీంద్ర జడేజా(వైస్ కెప్టెన్), గైక్వాడ్, గిల్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్, తిలక్ వర్మ, శార్దూల్ ఠాకూర్, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), సుందర్, బుమ్రా, షమీ, అశ్విన్, సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ.

మూడో వన్డేకు టీమిండియా:

రోహిత్ శర్మ(కెప్టెన్)పాండ్యా(వైస్ కెప్టెన్), గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్,కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, జడేజా, శార్దూల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్, (అక్షర్ పటేల్), కుల్దీప్ యాదవ్, అశ్విన్, బుమ్రా, సిరాజ్, షమీ.

Show comments