టీమిండియా ప్లేయింగ్‌ ఎలెవన్‌! సెమీస్‌లో ఒక్క మార్పుతో బరిలోకి..?

ఇండియా వర్సెస్‌ న్యూజిలాండ్‌ సెమీ ఫైనల్‌ కోసం యావత్‌ క్రికెట్‌ ప్రపంచ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. మరి ఇంత ప్రతిష్టాత్మకమైన మ్యాచ్‌లో భారత జట్టు ఎలాంటి ప్లేయింగ్‌ ఎలెవన్‌తో దిగుతుందనేది కూడా ముఖ్యమే. జట్టులో మార్పులు చేస్తుందా? లేకా విన్నింగ్‌ టీమ్‌ కొనసాగిస్తుందా? ఇప్పుడు విశ్లేషిద్దాం..

ఇండియా వర్సెస్‌ న్యూజిలాండ్‌ సెమీ ఫైనల్‌ కోసం యావత్‌ క్రికెట్‌ ప్రపంచ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. మరి ఇంత ప్రతిష్టాత్మకమైన మ్యాచ్‌లో భారత జట్టు ఎలాంటి ప్లేయింగ్‌ ఎలెవన్‌తో దిగుతుందనేది కూడా ముఖ్యమే. జట్టులో మార్పులు చేస్తుందా? లేకా విన్నింగ్‌ టీమ్‌ కొనసాగిస్తుందా? ఇప్పుడు విశ్లేషిద్దాం..

లీగ్‌ దశలో తొమ్మిదికి తొమ్మిది మ్యాచ్‌లు గెలిచి ఓటమి ఎరుగని జట్టుగా సెమీస్‌కు చేరింది టీమిండియా. బుధవారం ముంబైలోని వాంఖడే క్రికెట్‌ స్టేడియంలో న్యూజిలాండ్‌తో సెమీస్‌లో తలపడనుంది. ఈ హైఓల్టేజ్‌ మ్యాచ్‌ కోసం క్రికెట్‌ లోకం అంతా ఎదురుచూస్తోంది. లీగ్‌లో న్యూజిలాండ్‌ను టీమిండియా చిత్తుగా ఓడించినా.. సెమీస్‌ అనగానే రెండు జట్లు కూడా ఎంతో పటిష్టంగానే కనిపిస్తున్నాయి. అయితే.. నాకౌట్‌ మ్యాచ్‌ల్లో న్యూజిలాండ్‌పై టీమిండియాకు అంత మంచి రికార్డ్‌ లేకపోవడమే కాస్త కలవరపెడుతున్న అంశం. పైగా 2019 వన్డే వరల్డ్‌ కప్‌లోనూ కివీస్‌ చేతిలోనే భారత్‌ ఓటమి పాలుకావడంతోనే మళ్లీ అదే సీన్‌ రిపీట్‌ అవుతుందేమోనని భారత క్రికెట్‌ అభిమానులు భయపడుతున్నారు.

అయితే.. ప్రస్తుతం టీమిండియా అన్ని విభాగాల్లో అదరగొడుతూ.. ఎప్పుడలేన్నంత సూపర్‌ ఫామ్‌లో ఉండటంతో ఈ సారి న్యూజిలాండ్‌ ఆటలు సాగవని, కివీస్‌ను ఓడించి టీమిండియా ఫైనల్‌లో అడుగుపెడుతుందని చాలా మంది గట్టి నమ్మకంతో ఉన్నారు. కానీ, సెమీస్‌ లాంటి కీలక మ్యాచ్‌లో భారత్‌ ఎలాంటి టీమ్‌తో బరిలోకి దిగుతుందనే విషయంపై ఆసక్తి నెలకొంది. వైస్‌ కెప్టెన్‌ హార్ధిక్‌ పాండ్యా గాయంతో జట్టుకు దూరం కావడంతో టీమ్‌లో మార్పులు చేయాల్సి వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సూర్యకుమార్‌ యాదవ్‌ ఎక్స్‌ట్రా బ్యాటర్‌ రూపంలో ఆడుతున్నాడు. టీమ్‌ కూడా ఐదుగురు క్వాలిటీ బౌలర్లతో బరిలోకి దిగుతోంది. ఐదుగురు బౌలర్లు సైతం మంచి టచ్‌లో ఉండటంతో ఎవ్వర్ని పక్కనపెట్టాడనికి లేదు.

కానీ, న్యూజిలాండ్‌ జట్టులో ఎక్కువగా లెఫ్ట్‌ హ్యాండర్లు ఉండటంతో రవిచంద్రన్‌ అశ్విన్‌ను ప్లేయింగ్‌ ఎలెవన్‌లోకి తీసుకునే అవకాశం ఉందని సమాచారం. పైగా ముంబై పిచ్‌పై అశ్విన్‌ను ఆడటం అంత ఈజీకాదు. కానీ, రోహిత్‌ శర్మ మాత్రం విన్నింగ్‌ టీమ్‌ను మార్చేందుకు ఉద్దేశంలో లేము అని కూడా ఇంతకుముందు వెల్లడించాడు. మరి స్ట్రాటజీ ప్రకారం సూర్య స్థానంలో అశ్విన్‌ను ఆడిస్తారా? విన్నింగ్‌ టీమ్‌ను ఎందుకు డిస్టబ్‌ చేయడం అని సూర్యనే కొనసాగిస్తారో చూడాలి. ఒక వేళ జరిగితే ఈ ఒక్క మార్పు మినహా మరే మార్పు లేకుండా టీమిండియా, న్యూజిలాండ్‌తో మరిలోకి దిగే అవకాశం ఉంది. మరి సెమీస్‌లో టీమ్‌లో మార్పు చేయాలా? అవసరం లేదా? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇండియా ప్లేయింగ్‌ ఎలెవన్‌: రోహిత్‌ శర్మ(కెప్టెన్‌), శుబ్‌మన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లీ, శ్రేయస్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్‌(వైస్‌ కెప్టెన్‌), సూర్యకుమార్‌ యాదవ్‌/రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా, జస్ప్రీత్‌ బుమ్రా, షమీ, సిరాజ్‌, కుల్దీప్‌ యాదవ్‌.

Show comments