Nidhan
Duleep Trophy 2024, IND B vs IND A, Shubman Gill: దులీప్ ట్రోఫీ ఓపెనింగ్ మ్యాచ్‌లో ఓటమిపాలైంది శుబ్‌మన్ గిల్ టీమ్. అభిమన్యు ఈశ్వరన్ సారథ్యంలోని ఇండియా బీ చేతుల్లో గిల్ సేన మట్టికరిచింది. కెప్టెన్ సహా స్టార్లంతా విఫలమవడం టీమ్‌కు శాపంగా మారింది.
Duleep Trophy 2024, IND B vs IND A, Shubman Gill: దులీప్ ట్రోఫీ ఓపెనింగ్ మ్యాచ్‌లో ఓటమిపాలైంది శుబ్‌మన్ గిల్ టీమ్. అభిమన్యు ఈశ్వరన్ సారథ్యంలోని ఇండియా బీ చేతుల్లో గిల్ సేన మట్టికరిచింది. కెప్టెన్ సహా స్టార్లంతా విఫలమవడం టీమ్‌కు శాపంగా మారింది.
Nidhan
దులీప్ ట్రోఫీ-2024 ఓపెనింగ్ మ్యాచ్‌లో ఓటమిపాలైంది శుబ్‌మన్ గిల్ టీమ్. అభిమన్యు ఈశ్వరన్ సారథ్యంలోని ఇండియా బీ చేతుల్లో గిల్ సేన మట్టికరిచింది. కెప్టెన్ సహా స్టార్లంతా విఫలమవడం ఇండియా-ఏకు శాపంగా మారింది. 275 పరుగుల లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన ఆ జట్టు 198 పరుగులకే కుప్పకూలింది. కేఎల్ రాహుల్ (121 బంతుల్లో 57) మినహా మిగతా బ్యాటర్లంతా ఫెయిల్ అయ్యారు. కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (21) సహా రియాన్ పరాగ్ (31), ధృవ్ జురెల్ (0), శివమ్ దూబె (14), మయాంక్ అగర్వాల్ (3) ఇలా అందరూ చేతులెత్తేశారు. దీంతో 76 పరుగుల తేడాతో ఆ టీమ్‌కు ఓటమి తప్పలేదు.
ఛేజింగ్‌కు దిగిన ఇండియా ఏకు సరైన స్టార్ట్ దొరకలేదు. మయాంక్ అగర్వాల్ రెండో ఓవర్లోనే ఔట్ అయ్యాడు. ఆ తర్వాత గిల్-పరాగ్ జోడీ రెండో వికెట్‌కు 44 పరుగులు జోడించారు. కానీ తక్కువ వ్యవధిలో ఇద్దరూ పెవిలియన్‌కు చేరుకున్నారు. ఫోర్త్ డౌన్లో బ్యాటింగ్‌కు దిగిన రాహుల్ ఫైటర్‌లా పోరాడాడు. ఇండియా బీ బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు. సాలిడ్ డిఫెన్స్‌తో చుక్కలు చూపించాడు. ఒకవైపు జురెల్, తనుష్ కోటియన్ (0) ఔట్ అయినా రాహుల్ మాత్రం క్రీజులో పాతుకుపోయాడు. టెయిలెండర్ కుల్దీప్ యాదవ్ (14)తో కలసి ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లాడు రాహుల్. ఇద్దరూ కలసి ప్రత్యర్థి బౌలర్లను చాలా సేపు విసిగించారు. అయితే కీలక టైమ్‌లో కేఎల్ ఔట్ అవడంతో ఇండియా ఏ ఆశలు అవిరయ్యాయి. ఆ తర్వాత కుల్దీప్, ఆవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మద్ అండతో ఆకాశ్ దీప్ (42 బంతుల్లో 43) కాసేపు మెరుపులు మెరిపించాడు.
క్రీజులో ఉన్నంత సేపు భారీ షాట్లతో విధ్వంసం సృష్టించాడు ఆకాశ్‌దీప్. 3 బౌండరీలు కొట్టిన అతడు.. 4 భారీ సిక్సులు బాదాడు. ఆఖరి వికెట్‌గా అతడు వెనుదిరిగాడు. ఇక, తొలి ఇన్నింగ్స్‌లో భారీ సెంచరీతో మ్యాచ్‌కు డిసైడింగ్ ఫ్యాక్టర్‌గా మారిన సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడు ముషీర్ ఖాన్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 182 పరుగులు బాదిన ఈ యంగ్ సెన్సేషన్.. సెకండ్ ఇన్నింగ్స్‌లో 12 పరుగులు చేశాడు. అతడు ఆ ఇన్నింగ్స్ ఆడకపోయి ఉంటే మ్యాచ్ రిజల్ట్ వేరేలా ఉండేదేమో. ఇక, ఈ మ్యాచ్‌లో ఇండియా ఏ ఓటమికి ప్రధాన కారణం బ్యాటర్ల ఫెయిల్యూర్ అనే చెప్పాలి. కేఎల్ రాహుల్ మినహా ఏ ఒక్క బ్యాటర్ కూడా అంచనాలను అందుకోలేదు. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 37 పరుగులు చేసిన రాహుల్.. రెండో ఇన్నింగ్స్‌లో 57 పరుగులు చేశాడు. అతడికి మిగతా వారి నుంచి సపోర్ట్ అంది ఉంటే ఇండియా ఏ అలవోకగా విజయతీరాలకు చేరేది.
The winning moment for India B.
– A solid win to start Duleep Trophy for them, great booster for players. 👏pic.twitter.com/G1nJsxdTGB
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 8, 2024