క్రికెట్ చరిత్రలో తొలిప్లేయర్ గా రోహిత్ రికార్డు.. ఇది హిట్ మ్యాన్ కే సాధ్యం!

Rohit Sharma: ధర్మశాల వేదికగా ఇంగ్లండ్ తో జరుగుతున్న చివరి టెస్ట్ లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అత్యంత అరుదైన ఘనతను సాధించాడు. దీంతో క్రికెట్ చరిత్రలో ఈ రికార్డు నెలకొల్పిన మెుట్టమెుదటి ప్లేయర్ గా నిలిచాడు. మరి ఆ రికార్డు ఏంటి? ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

Rohit Sharma: ధర్మశాల వేదికగా ఇంగ్లండ్ తో జరుగుతున్న చివరి టెస్ట్ లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అత్యంత అరుదైన ఘనతను సాధించాడు. దీంతో క్రికెట్ చరిత్రలో ఈ రికార్డు నెలకొల్పిన మెుట్టమెుదటి ప్లేయర్ గా నిలిచాడు. మరి ఆ రికార్డు ఏంటి? ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

టీమిండియా పర్యటనలో ఉన్న ఇంగ్లండ్ టీమ్ ను ఓ ఆటాడుకుంటున్నారు భారత ప్లేయర్లు. ఇప్పటికే సిరీస్ ను 3-1తో కైవసం చేసుకున్న టీమిండియా.. ఇదే జోరును నామమాత్రమైన 5వ టెస్ట్ లోనూ చూపిస్తోంది. ఇక ఈ సిరీస్ లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ రికార్డుల మీద రికార్డులు బద్దలుకొడుతూ దూసుకెళ్తున్నాడు. తాజాగా ధర్మశాల వేదికగా జరుగుతున్న చివరి మ్యాచ్ లో కూడా అత్యంత అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. క్రికెట్ చరిత్రలోనే ఈ రికార్డు సాధించిన తొలి ప్లేయర్ గా నిలిచాడు హిట్ మ్యాన్. మరి ఆ రికార్డు ఏంటి? దీంతో పాటుగా అతడు సాధించిన మరో ఘనత ఏంటి? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

రోహిత్ శర్మ.. ఇటు బ్యాటర్ గా, అటు కెప్టెన్ గా టీమిండియాకు తిరుగులేని విజయాలను అందిస్తూ.. అద్భుతమైన ప్లేయర్ గా ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటూ ఉంటున్నాడు. ఇక తాజాగా ఇంగ్లండ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో సైతం ఇదే జోరును కొనసాగిస్తున్నాడు. ధర్మశాల వేదికగా జరుగుతున్న చివరి మ్యాచ్ లో హిట్ మ్యాన్ ఓ అరుదైన ఘనతను సాధించాడు. ఈ మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ లో అశ్విన్ బౌలింగ్ లో మార్క్ వుడ్ క్యాచ్ ను అద్భుతంగ అందుకున్నాడు కెప్టెన్ రోహిత్ శర్మ. దీంతో ఈ క్యాచ్ పట్టడం ద్వారా అంతర్జాతీయ క్రికెట్ లోని మూడు ఫార్మాట్స్ లో 60కి పైగా క్యాచ్ లు అందుకున్న మెుట్టమెుదటి ప్లేయర్ గా ఘనమైన చరిత్రను తన పేరిట లిఖించుకున్నాడు హిట్ మ్యాన్. ఇలా మూడు ఫార్మాట్స్ లో 60కి పైగా క్యాచ్ లను అందుకున్న ఆటగాడు మరొకరు లేరు.

కాగా.. ఎక్కువగా బ్యాటింగ్ లో రికార్డులు బద్దలు కొట్టే హిట్ మ్యాన్, ఇప్పుడు క్యాచ్ ల్లో ప్రపంచ రికార్డు సాధించాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ లో 218 పరుగులకే ఆలౌట్ కాగా.. బ్యాటింగ్ ప్రారంభించిన ఇండియా బజ్ బాల్ ఆటతో అదరగొడుతోంది. ప్రస్తుతం 20 ఓవర్లకి వికెట్ నష్టపోయి 104 పరుగులు చేసింది. జైస్వాల్-రోహిత్ జోడీ తొలి వికెట్ కు సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. హాఫ్ సెంచరీ చేసిన చిచ్చరపిడుగు జైస్వాల్ 57 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద బషీర్ బౌలింగ్ లో స్టంపౌట్ అయ్యాడు. మరో వైపు రోహిత్ 47 రన్స్ తో అర్దసెంచరీకి దగ్గరలో ఉన్నాడు. ఈ రికార్డుతో పాటుగా మరోటి కూడా సాధించాడు హిట్ మ్యాన్. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ హిస్టరీలో అత్యధిక సిక్స్ లు బాదిన తొలి ఇండియన్ బ్యాటర్ గా చరిత్ర సృష్టించాడు. మరి అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో రోహిత్ సాధించిన ఈ అరుదైన రికార్డుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: మోడ్రన్ మాస్టర్స్​కు మొగుడు.. క్రికెట్​ను ఏలుతున్న బ్యాటర్లకు పీడకలగా జడ్డూ!

Show comments