iDreamPost

మోడ్రన్ మాస్టర్స్​కు మొగుడు.. క్రికెట్​ను ఏలుతున్న బ్యాటర్లకు పీడకలగా జడ్డూ!

  • Published Mar 07, 2024 | 3:19 PMUpdated Mar 07, 2024 | 3:19 PM

టీమిండియా స్టార్ ఆల్​రౌండర్ రవీంద్ర జడేజా అంటేనే వాళ్లు భయపడుతున్నారు. తోపు బౌలర్లు అందర్నీ చితకబాదిన ఆ మోడర్న్ మాస్టర్స్ జడ్డూ పేరు చెబితేనే జడుసుకుంటున్నారు.

టీమిండియా స్టార్ ఆల్​రౌండర్ రవీంద్ర జడేజా అంటేనే వాళ్లు భయపడుతున్నారు. తోపు బౌలర్లు అందర్నీ చితకబాదిన ఆ మోడర్న్ మాస్టర్స్ జడ్డూ పేరు చెబితేనే జడుసుకుంటున్నారు.

  • Published Mar 07, 2024 | 3:19 PMUpdated Mar 07, 2024 | 3:19 PM
మోడ్రన్ మాస్టర్స్​కు మొగుడు.. క్రికెట్​ను ఏలుతున్న బ్యాటర్లకు పీడకలగా జడ్డూ!

రవీంద్ర జడేజా.. ఈ టీమిండియా స్టార్ గురించి క్రికెట్ అభిమానులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. అద్భుతమైన స్పిన్ బౌలింగ్, అదే స్థాయి బ్యాటింగ్​తో స్టార్ ఆల్​రౌండర్​గా ఎదిగాడు జడేజా. ఫీల్డింగ్​లో ప్రస్తుత క్రికెట్​లో అతడ్ని మించినోడు లేడు. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్.. ఇలా ప్రతి విభాగంలోనూ తనదైన శైలిలో రాణిస్తూ భారత జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు జడ్డూ. ముఖ్యంగా టెస్టుల్లో రోహిత్ సేన వరుస విక్టరీలు సాధిస్తుందంటే అందులో అతడికి ఎక్కువ క్రెడిట్ ఇవ్వాల్సిందే. బౌలింగ్​లో బ్రేక్ త్రూ కావాలన్నా, బ్యాటింగ్​లో వికెట్లు పడిన సమయంలో టీమ్​ను ఆదుకోవాలన్నా జడ్డూ మీదే రోహిత్ ఆధారపడతాడు. అలాంటి ఈ డాషింగ్ లెఫ్టాండర్ దిగ్గజ బ్యాటర్లకు పీడకలగా మారాడు. ఈ జనరేషన్​లో బ్యాటింగ్​ గ్రేట్​లుగా పేరు తెచ్చుకున్న వారికి ఓ రేంజ్​లో పోయిస్తున్నాడు జడ్డూ.

ప్రస్తుత తరంలో ఆస్ట్రేలియా సీనియర్ బ్యాటర్ స్టీవ్ స్మిత్, ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్​ తోపులుగా పేరు తెచ్చుకున్నారు. ముఖ్యంగా టెస్టుల్లో వీళ్లిద్దరూ టాప్ లెవల్​లో ఆడుతున్నారు. క్రీజులో కుదురుకోవడం, ఓపిగ్గా గంటల కొద్దీ బ్యాటింగ్ చేయగలగడం, ఎంతటి బౌలర్​ను అయినా చీల్చి చెండాడటం వీరికి వెన్నతో పెట్టిన విద్య. ఈ జనరేషన్​లో బెస్ట్ అనదగ్గ వారందరి బౌలింగ్​లోనూ వీళ్లిద్దరూ భారీగా రన్స్ చేశారు. కానీ జడేజా ముందు మాత్రం స్మిత్, రూట్ పప్పులు ఉడకడం లేదు. అతడి బౌలింగ్​ను ఎదుర్కోవడంలో వాళ్లిద్దరూ తరచూ ఫెయిల్ అవుతున్నారు. దానికి రికార్డులే ప్రూఫ్​. ఇప్పటిదాకా టెస్టుల్లో స్మిత్​ను ఏకంగా 8 సార్లు ఔట్ చేశాడు జడేజా.

స్మిత్​నే కాదు.. జో రూట్​ను కూడా లాంగ్ ఫార్మాట్​లో 8 సార్లు వెనక్కి పంపాడు జడేజా. ప్రతి టీమ్​లోని టాప్ బౌలర్​ బౌలింగ్​ను చిత్తు చేస్తూ పరుగుల వరద పారిస్తున్న ఈ ఇద్దరు బ్యాటర్లు.. భారత స్టార్​ బౌలింగ్​లో మాత్రం తడబడుతున్నారు. ధర్మశాల ఆతిథ్యం ఇస్తున్న ఐదో టెస్టు తొలి ఇన్నింగ్స్​లోనూ జడ్డూ బౌలింగ్​లో ఔట్ అయ్యాడు రూట్. జడ్డూ వేసిన బాల్​ను అర్థం చేసుకోలేక డిఫెన్స్ చేయబోయి ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్, అదనపు వేగంతో బంతులు వేయగలగడం, వేరియేషన్స్​తో బౌలింగ్ చేయగలగడం.. సిచ్యువేషన్, పిచ్​కు తగ్గట్లు బౌలింగ్​లో మార్పులు చేసుకోవడం వల్లే జడేజా ఇంతగా సక్సెస్ అవుతున్నాడని అనొచ్చు.

ఎంతో ఓపిగ్గా ఆడే స్మిత్, రూట్​కు పెద్దగా బలహీనతలు లేవు. కానీ తన బలమైన వేరియేషన్స్, ఎక్స్​ట్రా పేస్, లైన్ అండ్ లెంగ్త్​, మంచి టర్న్​తో మ్యాజిక్ చేసి ఆ ఇద్దర్నీ తప్పు చేసేలా చేస్తున్నాడు జడ్డూ. అతడి మాయలో పడి వాళ్లు కూడా వికెట్లు సమర్పించుకుంటున్నారు. దీనిపై సోషల్ మీడియాలో నెటిజన్స్ రియాక్ట్ అవుతున్నారు. మోడ్రన్ మాస్టర్స్​కు జడేజా మొగుడిలా తయారయ్యాడని కామెంట్స్ చేస్తున్నారు. జడ్డూతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుందని చెబుతున్నారు. మరి.. జడ్డూ బౌలింగ్ మీద మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

ఇదీ చదవండి: సర్ఫరాజ్​ను నమ్మని రోహిత్! చేతులారా వికెట్ మిస్! ఇలా చేశాడేంటి..?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి