Shamar Joseph: నిన్న మ్యాచ్ గెలిచాడు.. నేడు మనసులు గెలిచాడు! ఇది కదా దేశభక్తి అంటే!

నిన్న మ్యాచ్ గెలిచిన వెస్టిండీస్ నయా సంచలనం షమర్ జోసెఫ్.. నేడు అభిమానుల మనసు గెలుచుకున్నాడు. అతడు చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

నిన్న మ్యాచ్ గెలిచిన వెస్టిండీస్ నయా సంచలనం షమర్ జోసెఫ్.. నేడు అభిమానుల మనసు గెలుచుకున్నాడు. అతడు చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఒకే ఒక్క మ్యాచ్.. అతడి జీవితాన్నే మలుపుతిప్పింది. పైగా ఆడింది రెండు టెస్ట్ లు మాత్రమే. తన సంచలన బౌలింగ్ తో ప్రపంచాన్ని మెుత్తం తనవైపు తిప్పుకున్నాడు విండీస్ నయా పేస్ గుర్రం షమర్ జోసెఫ్. గబ్బా వేదికగా జరిగిన రెండో టెస్ట్ లో ఆస్ట్రేలియాను 8 పరుగుల తేడాతో విండీస్ చిత్తు చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ మ్యాచ్ లో 7 వికెట్లు తీసి సంచలన బౌలింగ్ తో 27 సంవత్సరాల తర్వాత జట్టుకు కంగారూ గడ్డపై తొలి విజయాన్ని అందించాడు. దీంతో ఒక్కసారిగా అతడిపై ప్రశంసల వర్షం కురిసింది. తాజాగా అతడు మాట్లాడిన మాటలతో అభిమానుల మనసు మరోసారి గెలుచుకున్నాడు.

షమర్ జోసెఫ్.. ఆడింది రెండు మ్యాచ్ లే. కానీ ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో అతడో సూపర్ హీరో. ఆస్ట్రేలియా గడ్డపై ఆసీస్ టీమ్ ను బెంబేలెత్తించాడు ఈ కరేబియన్ పేస్ గుర్రం. బుల్లెట్లలాంటి బంతులతో కంగారూ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. తన కాలి వేలికి గాయం అయినప్పటికీ.. ఆ బాధను భరిస్తూనే బౌలింగ్ కు దిగి, ఓ అద్భుతాన్ని ఆవిష్కరించాడు. ఇక ఈ విజయంతో, సంచలన బౌలింగ్ తో జోసెఫ్ పై ప్రపంచ వ్యాప్తంగా పొగడ్తల వర్షం కురుస్తోంది. ఇదిలా ఉండగా.. పాకిస్తాన్ సూపర్ లీగ్ లో పెషావర్ జల్మీ జట్టు తరఫున ఆడేందుకు కాంట్రక్ట్ కుదుర్చుకున్నాడు ఈ యువ బౌలర్. అలాగే మరికొన్ని టీ20 లీగ్ లకు సంబంధించిన నిర్వాహకులు జోసెఫ్ కోసం క్యూ కడుతున్నాయి. దీంతో అతడిపై కాసుల వర్షం కురుస్తోంది. ఒక్కసారి ఫ్రాంచైజీ లీగ్ లో ఆడితే చాలు.. అతడు కోటీశ్వరుడు అయిపోతాడు. ఇలాంటి సమయంలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసి తన దేశ భక్తిని చాటుకున్నాడు షమర్ జోసెఫ్.

తాజాగా ఓ స్పోర్ట్స్ ఛానల్ తో విండీస్ చిచ్చర పిడుగు షమర్ జోసెఫ్ మాట్లాడుతూ..”నేను ఎల్లప్పుడూ వెస్టిండీస్ టీమ్ కు ఆడటానికి సిద్ధంగా ఉంటాను. అయితే నేను ఎంత డబ్బులు తీసుకుంటాను, వస్తాయి అన్నది తర్వాత విషయం. నా డ్రీమ్ దేశానికి ఆడటం, విజయాలు అందించడం. దాని కోసం ఎంత కష్టమైనా పడతాను. క్రికెట్ అంటే ఎంతో ఇష్టమైన నాకు విండీస్ అది ఆడే అవకాశాన్ని ఇచ్చింది. దేశ రుణాన్ని విజయాల ఇచ్చి తీర్చుకుంటాను” అంటూ చెప్పుకొచ్చాడు జెసెఫ్. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో.. నెటిజన్లు షమర్ పై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఇది కదా దేశ భక్తి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. డబ్బుల కోసం ఫ్రాంచైజీ క్రికెట్ ఆడటానికి మెుగ్గు చూపుతున్న ఈ రోజుల్లో దేశం కోసం ఆడతానని చెప్పిన ఈ యంగ్ సెన్సేషన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments