బుచ్చిబాబు టోర్నీ విజేతగా హైదరాబాద్.. ఛత్తీస్​గఢ్​పై గ్రాండ్ విక్టరీ!

Buchi Babu Tournament 2024, HYD vs CGR: హైదరాబాద్ జట్టు అద్భుతం చేసి చూపించింది. ఓ ప్రతిష్టాత్మక ట్రోఫీని కొట్టేసింది. ఫైనల్ మ్యాచ్​లో ఛత్తీస్​గఢ్​ను ఓడించి ఛాంపియన్​గా నిలిచింది.

Buchi Babu Tournament 2024, HYD vs CGR: హైదరాబాద్ జట్టు అద్భుతం చేసి చూపించింది. ఓ ప్రతిష్టాత్మక ట్రోఫీని కొట్టేసింది. ఫైనల్ మ్యాచ్​లో ఛత్తీస్​గఢ్​ను ఓడించి ఛాంపియన్​గా నిలిచింది.

హైదరాబాద్ జట్టు అద్భుతం చేసి చూపించింది. ఈ మధ్య మంచి ఆటతీరుతో ఆకట్టుకుంటున్న టీమ్.. మరోమారు సత్తా చాటింది. ఓ ప్రతిష్టాత్మక ట్రోఫీని పట్టేసింది. తమ రియల్ పవర్ ఏంటో మరోమారు చూపెట్టింది. ఆల్ఇండియా బుచ్చిబాబు టోర్నమెంట్​లో ఛాంపియన్​గా నిలిచింది. తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ టోర్నమెంట్​లో హైదరాబాద్ టీమ్ సూపర్బ్​గా ఆడి టైటిల్​ను కొట్టేసింది. ఛత్తీస్​గఢ్​తో జరిగిన ఫైనల్ మ్యాచ్​లో 243 పరుగుల భారీ తేడాతో నెగ్గి ట్రోఫీని కైవసం చేసుకుంది. హైదరాబాద్ సంధించిన 518 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన ప్రత్యర్థి జట్టు 247 పరుగులకే కుప్పకూలింది. దీంతో మన టీమ్ నూతన విజేతగా ఆవిర్భవించింది.

బ్యాటింగ్ ఫెయిల్యూర్ ఛత్తీస్​గఢ్​ ఓటమికి కారణంగా చెప్పొచ్చు. ఆ టీమ్ ఓపెనర్ ఆయుష్ పాండే (134 బంతుల్లో 117) సెంచరీతో ఆఖరి వరకు ఫైట్ చేశాడు. అతడితో పాటు మరో ఓపెనర్ శశాంక్ చంద్రకర్ (45 బంతుల్లో 50) మంచి ఇన్నింగ్స్​తో టీమ్​కు గట్టి పునాది వేశాడు. అయితే ఈ ఇద్దరు మినహా మిగతా బ్యాటర్లంతా చేతులెత్తేశారు. హైదరాబాద్​ ఘనవిజయానికి బౌలర్లే రీజన్ అని చెప్పాలి. ప్రతి బౌలర్ తన వంతుగా టీమ్ సక్సెస్​లో కాంట్రిబ్యూట్ చేశారు. ముఖ్యంగా తనయ్ త్యాగరాజన్ 5 వికెట్లతో ప్రత్యర్థి జట్టు వెన్ను విరిచాడు. అనికేత్ రెడ్డి 2 వికెట్లు పడగొట్టాడు. రోహిత్ రాయుడు, నితేష్ కన్నాల, తన్మయ్ అగర్వాల్ చెరో వికెట్​తో సత్తా చాటారు. అపోజిషన్ టీమ్ బ్యాటర్లను వరుస విరామాల్లో ఔట్ చేస్తూ ఎక్కడా కోలుకోకుండా చేశారు హైదరాబాద్ బౌలర్లు. అందుకే విజయంలో వాళ్లకు ఎక్కువ క్రెడిట్ ఇవ్వాల్సిందే.

హైదరాబాద్ తరఫున బౌలింగ్​లో తనయ్ త్యాగరాజన్​ 5 వికెట్లతో హీరోగా నిలిచాడు. మ్యాచ్ మొత్తం మీద అతడు 8 వికెట్లు పడగొట్టాడు. ఛత్తీస్​గఢ్​ ఏ దశలోనూ కమ్​బ్యాక్ ఇవ్వకుండా అడ్డుకున్నాడు. అటు బ్యాటింగ్​లో ఈ పనిని రోహిత్ రాయుడు చూసుకున్నాడు. అతడు ఫస్ట్ ఇన్నింగ్స్​లో 155 పరుగుల ఫెంటాస్టిక్ నాక్ ఆడాడు. అతడి భారీ సెంచరీ వల్లే వల్లే టీమ్ తొలి ఇన్నింగ్స్​లో 417 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్​కు దిగిన ఛత్తీస్​గఢ్​ మొదటి ఇన్నింగ్స్​లో 281 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో 236 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్​ను స్టార్ట్ చేసిన హైదరాబాద్ 274 పరుగులు చేసింది. భారీ టార్గెట్​తో బరిలోకి దిగిన ఛత్తీస్​గఢ్​ 247 పరుగులకు కుప్పకూలి ట్రోఫీని మిస్ చేసుకుంది. మరి.. బుచ్చిబాబు టోర్నమెంట్​లో హైదరాబాద్ టీమ్ ఛాంపియన్​గా నిలవడంపై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

Show comments