హైదరాబాద్ లో CCL మ్యాచ్ లు.. వారందరికీ ఫ్రీ ఎంట్రీ!

హైదరాబాద్ లో జరిగే సెలబ్రిటీ క్రికెట్ లీగ్ మ్యాచ్ లకు వారందరికీ ఫ్రీ ఎంట్రీ ఇస్తున్నట్లు హెచ్ సీఏ అధ్యక్షుడు జగన్ మోహన్ రావు ప్రకటించారు. ఫ్రీ ఎంట్రీకి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

హైదరాబాద్ లో జరిగే సెలబ్రిటీ క్రికెట్ లీగ్ మ్యాచ్ లకు వారందరికీ ఫ్రీ ఎంట్రీ ఇస్తున్నట్లు హెచ్ సీఏ అధ్యక్షుడు జగన్ మోహన్ రావు ప్రకటించారు. ఫ్రీ ఎంట్రీకి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

భారతదేశంలో క్రికెట్ కు ఎలాంటి ఆదరణ ఉందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇక ఐపీఎల్ లాంటి టోర్నీలు వచ్చినప్పటి నుంచి క్రికెట్ క్రేజ్ మరింతగా పెరిగింది. ఇక మన స్టార్ హీరోలు కూడా పలు క్రికెట్ టోర్నీలో పాల్గొంటారన్న సంగతి తెలిసిందే. సెలబ్రిటీ క్రికెట్ లీగ్ లో టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, సాండిల్ వుడ్ ఇండస్ట్రీలకు చెందిన స్టార్లు ఈ లీగ్ లో పాల్గొంటారు. మరికొన్ని రోజుల్లో అభిమానులను అలరించడానికి సీసీఎల్ మన ముందుకు రాబోతోంది. రెండు దశల్లో జరగనున్న ఈ టోర్నీలో కొన్ని మ్యాచ్ లకు హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం ఆతిథ్యమివ్వనున్నట్లు HCA అధ్యక్షుడు జగన్ మోహన్ రావు తెలిపారు. అదీకాక ఈ మ్యాచ్ లు చూడ్డానికి ఓ బంపర్ ఆఫర్ కూడా ఇచ్చాడు. వారందరికీ ఫ్రీ ఎంట్రీ అంటూ ప్రకటించాడు.

సెలబ్రిటీ క్రికెట్ లీగ్.. సినీ తారలు తమ నటనతోనే కాక, తమ ఆటతో కూడా అభిమానులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఈ లీగ్ లో మెుత్తం 8 జట్లు ఆడనున్నాయి. తెలుగు వారియర్స్, ముంబై హీరోస్, కేరళ స్టైకర్స్, భోజ్ పూరి దబాంగ్స్, బెంగాల్ టైగర్స్, చెన్నై రైనోస్, కర్ణాటక బుల్డోజర్స్, పంజాబ్ ది షేర్ టీమ్స్ టోర్నీలో పాల్గొంటున్నాయి. రెండు దశల్లో ఈ టోర్నీని నిర్వహించనున్నారు. తొలి దశలో మ్యాచ్ లు షార్జాలో జరుగుతుండగా.. రెండో దశ మ్యాచ్ లను మార్చి 1 నుంచి 3 వరకు హైదరాబాద్ లో జరుగుతాయని HCA అధ్యక్షుడు జగన్ మోహన్ రావు తెలిపారు. HYDలో మెుత్తం ఆరు మ్యాచ్ లు జరగనుండగా.. ఈ 6 మ్యాచ్ లకు ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. రోజుకు రెండు మ్యాచ్ ల చొప్పున మూడు రోజులు ఈ మ్యాచ్ లు జరగనున్నాయి.

అయితే ఈ మ్యాచ్ లకు విద్యార్థులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది హెచ్ సీఏ. ప్రతీ రోజు 10 వేల మంది విద్యార్థులకు ఫ్రీ ఎంట్రీ కల్పిస్తామని వెల్లడించాడు హెచ్ సీఏ అధ్యక్షుడు జగన్ మోహన్ రావు. ఇంటర్, డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్, మెడికల్ కళాశాలల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కాగా.. మ్యాచ్ లకు హాజరైయ్యేందుకు ఆసక్తి ఉన్న కళాశాల ప్రిన్సిపాల్స్ వారి కాలేజీల నుంచి వచ్చే స్టూడెంట్స్ కౌంట్, వారి పేర్లతో hca.ccl2024@gmail.com కి డీటైల్స్ మెయిల్ పంపాలని సూచించారు. అనంతరం అధికారుల పరిశీలన చేస్తారు. వచ్చే స్టూడెంట్స్ తమ కాలేజీ గుర్తింపు కార్డులతో రావాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.

ఇదికూడా చదవండి: నిన్న లాస్ట్ బాల్ సిక్స్ కొట్టిన సజనా.. ఓ తెలుగు సినిమాలో హీరోయిన్!

Show comments