శార్ధుల్‌కు సాయం చేయని ధోని! సంచలన విషయం బయటపెట్టిన భజ్జీ..

Harbhajan Singh: ధోని, రోహిత్ శర్మ తమ ఆట తీరుతో అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. తాజాగా ధోని, రోహిత్ శర్మ కెప్టెన్సీల గురించి మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

Harbhajan Singh: ధోని, రోహిత్ శర్మ తమ ఆట తీరుతో అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. తాజాగా ధోని, రోహిత్ శర్మ కెప్టెన్సీల గురించి మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

ఎంఎస్ ధోని, రోహిత్ శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇద్దరికి ఇండియాలో లక్షల్లో అభిమానులు వున్నారు. వీరు ఇద్దరూ ప్లేయర్లగా తమ ఆట తీరుతో అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఎంతమంది కొత్త ప్లేయర్లు వచ్చినా కానీ వీరి క్రేజ్ మాత్రం తగ్గనే తగ్గదు. వీరు ఇద్దరూ కేవలం ప్లేయర్లుగా మాత్రమే కాకుండా కెప్టెన్లగా కూడా బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు. ఎన్నో మ్యాచ్ లు గెలిపించి తమ సత్తా ఏంటో చూపించారు. ఇండియాకి ఎన్నో విజయాలని అందించారు. అయితే తాజాగా ధోని, రోహిత్ శర్మ కెప్టెన్సీ శైలుల గురించి భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ తరువర్ కోహ్లీ పోడ్‌కాస్ట్‌ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశాడు.

హర్భజన్ మాట్లాడుతూ.. “ధోని కెప్టెన్సీలో నేను భారత జట్టుతో పాటు ఐపీఎల్‌లో కూడా చెన్నై సూపర్ కింగ్స్‌ టీంలో ఆడాను. హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో కేన్ విలియమ్సన్ వరస బౌండరీలు బాదాడు. అతన్ని ఒత్తడిలోకి నెట్టాడు. అప్పుడు నేను షార్ట్ ఫైన్ లెగ్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్నాను. వెంటనే ధోని దగ్గరకి వెళ్లి శార్దూల్ తన బౌలింగ్ లెంగ్త్‌ను మార్చుకుంటే బాగుంటుందని చెప్పను. కానీ ధోని మాత్రం.. నేను ఇప్పుడు అతనితో చెబితే, శార్ధూల్ ఎప్పటికీ నేర్చుకోడు. అతనంతట అతనే నేర్చుకోనివ్వండి అంటూ నాతో అన్నాడు.” అని హర్భజన్ అన్నాడు.

ఇక రోహిత్ శర్మ గురించి మాట్లాడుతూ.. “రోహిత్ చాలా డిఫరెంట్. అతను ప్రతి ప్లేయర్‌తో మాట్లాడతాడు. ప్లేయర్ భుజం మీద చేయి వేసి తన నుంచి ఏమి ఆశిస్తున్నాడో స్పష్టంగా చెబుతాడు. ప్లేయర్ ని ప్రోత్సాహించి నమ్మకం కలిగిస్తాడు. టెస్టు కెప్టెన్‌ అయినప్పటి నుంచి రోహిత్ శర్మ బాగా మెరుగయ్యాడు.” అని హర్భజన్ అన్నారు. ప్రస్తుతం హర్భజన్ సింగ్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. సంచలనం సృష్టిస్తున్నాయి. మరి హర్భజన్ సింగ్ చేసిన ఈ సెన్సేషనల్ కామెంట్స్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.

Show comments