పాకిస్థాన్ ఓ వేస్ట్ టీమ్ అంటూ కిర్​స్టెన్​కు.. హర్భజన్ ఓపెన్ సజెషన్!

పాకిస్థాన్ నయా కోచ్​ గ్యారీ కిర్​స్టెన్​కు టీమిండియా లెజెండ్ హర్భజన్ సింగ్ కీలక సూచన చేశాడు. కిర్​స్టెన్​ పాక్​ను వదిలేసి.. ఆ టీమ్​లోకి వెళ్లాలని అన్నాడు.

పాకిస్థాన్ నయా కోచ్​ గ్యారీ కిర్​స్టెన్​కు టీమిండియా లెజెండ్ హర్భజన్ సింగ్ కీలక సూచన చేశాడు. కిర్​స్టెన్​ పాక్​ను వదిలేసి.. ఆ టీమ్​లోకి వెళ్లాలని అన్నాడు.

పాకిస్థాన్ టీమ్​ ఇప్పుడు కాంట్రవర్సీలకు అడ్డాగా మారింది. ఒకప్పుడు క్రికెట్​లో తమ పేస్ బౌలింగ్​తో డామినేట్ చేస్తూ పలు ఐసీసీ టైటిల్స్​ దక్కించుకున్న ఆ జట్టు.. ఇప్పుడు మునుపటి ప్రభ కోల్పోయింది. పసికూన జట్ల చేతుల్లోనూ ఓడిపోయే స్థితికి దిగజారింది. గత వన్డే వరల్డ్ కప్-2023లో గ్రూప్ దశలోనే ఇంటిదారి పట్టిన బాబర్ సేన.. ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచ కప్​లోనూ లీగ్ స్టేజ్​లోనే వెనుదిరిగింది. ఫేవరెట్ టీమిండియాతో పాటు ఆతిథ్య యూఎస్​ఏ చేతుల్లో ఓడింది. దీంతో అందరూ ఆ టీమ్​ను ట్రోల్ చేస్తున్నారు. ఇంత చెత్త ఆటతీరు ఎప్పుడూ చూడలేదని సొంత అభిమానులే పాక్​ ప్లేయర్లను విమర్శిస్తున్నారు. ఆ జట్టు పనైపోయిందని మాజీ క్రికెటర్లు కూడా దుయ్యబడుతున్నారు. అంతెందుకు ఆ టీమ్ కోచ్ గ్యారీ కిర్​స్టెన్ కూడా ఆటగాళ్ల ప్రదర్శనపై సీరియస్ అయ్యాడు.

పాకిస్థాన్​పై కిర్​స్టెన్ విమర్శలు గుప్పించాడు. జట్టులో ఐకమత్యం లేదని.. అసలు ఇది టీమే కాదన్నాడు. ఎన్నో ఏళ్లుగా అంతర్జాతీయ స్థాయిలో చాలా జట్లకు ట్రెయినింగ్ ఇచ్చానని.. కానీ ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడూ చూడలేదని కిర్​స్టెన్ చెప్పినట్లు పాకిస్థాన్ మీడియాలో కథనాలు వచ్చాయి. టీమిండియాతో మ్యాచ్​లో గెలిచే పరిస్థితిలో ఉండి కూడా ఓడిపోవడం దారుణమని.. తాను తీవ్ర నిరాశకు గురైనట్లు కిర్​స్టన్ వాపోయాడని ఆ కథనం పేర్కొంది. ఇంటర్నేషనల్ లెవల్​లో ఎన్నో సక్సెస్​లు చూశాడు కిర్​స్టన్. టీమిండియాకు కోచ్​గా ఉంటూ 2011 వన్డే వరల్డ్ కప్​ అందించాడు. అలాంటోడు ఇప్పుడు పాక్​కు కోచ్​గా వెళ్లాడు. కానీ పొట్టి కప్పులో ఆ టీమ్ అట్టర్ ఫ్లాప్ అయింది. ఈ నేపథ్యంలో టీమిండియా స్పిన్ దిగ్గజం హర్భజన్ సింగ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. కిర్​స్టెన్ పాక్​ టీమ్​ను వదిలేయాలని అతడు సూచించాడు.

పాకిస్థాన్ జట్టును కిర్​స్టన్ వీడటం మంచిదని, అక్కడ ఉండి టైమ్ వేస్ట్‌ చేసుకోవద్దని భజ్జీ అన్నాడు. పాక్​ను వీడి టీమిండియాకు కోచ్​గా రావాలని సూచించాడు. ‘గ్యారీ.. నీ టైమ్ వేస్ట్ చేసుకోకు. పాకిస్థాన్ జట్టును వదిలెయ్. టీమిండియాలో జాయిన్ అవ్వు. భారత టీమ్​కు కోచింగ్ ఇవ్వడానికి తిరిగొచ్చేయ్’ అని హర్భజన్ చెప్పాడు. కిర్​స్టన్ సూపర్ కోచ్ అంటూ ప్రశంసల్లో ముంచెత్తాడు. అతడు గొప్ప మెంటార్ అని, అలాంటోడు టీమ్​తో ఉంటే చాలా బెనిఫిట్ అని పేర్కొన్నాడు భజ్జీ. ప్రపంచ కప్-2011 గెలిచిన తమ టీమ్​కు కిర్​స్టెన్ మంచి ఫ్రెండ్ అన్నాడు. అతడు ఉండాల్సింది పాక్ టీమ్​తో కాదు.. భారత్​తో అంటూ హర్భజన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఇది చూసిన నెటిజన్స్.. అవును, కిర్​స్టెన్ టీమిండియాలోకి తిరిగొచ్చేయ్ అని కామెంట్స్ చేస్తున్నారు. అయితే మరికొందరు మాత్రం భారత జట్టుకు నయా కోచ్​గా గంభీర్ వస్తే బెటర్ అని.. కిర్​స్టన్ అక్కర్లేదని అంటున్నారు. మరి.. కిర్​స్టెన్ టీమిండియాలోకి రావాలంటూ హర్భజన్ చేసిన వ్యాఖ్యలపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

Show comments