పాకిస్థాన్​కు ఈ జన్మలో బుద్ధి రాదు.. హర్భజన్ సెన్సేషనల్ కామెంట్స్!

Harbhajan Singh: టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ పాకిస్థాన్​పై సీరియస్ అయ్యాడు. వాళ్లకు ఈ జన్మలో బుద్ధి రాదంటూ ఫైర్ అయ్యాడు.

Harbhajan Singh: టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ పాకిస్థాన్​పై సీరియస్ అయ్యాడు. వాళ్లకు ఈ జన్మలో బుద్ధి రాదంటూ ఫైర్ అయ్యాడు.

ఛాంపియన్స్ ట్రోఫీ-2025 కాంట్రవర్సీ ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు. వచ్చే ఏడాది జరిగే ఈ టోర్నీకి పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తోంది. ఈ టోర్నీకి ఇంకా చాలా టైమ్ ఉన్నా మ్యాచ్​ల షెడ్యూల్​ను ప్రకటించడానికి ఎక్కువ గడువు లేదు. దీంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) షెడ్యూల్ డ్రాఫ్ట్​ను తయారు చేసి ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)కి పంపించింది. అయితే టోర్నీలో పాల్గొనే దేశాలన్నీ పాక్​కు వస్తామని చెబుతుంటే.. భారత్ మాత్రం వచ్చేదే లేదని స్పష్టం చేసింది. ఇరు దేశాల మధ్య దౌత్య, రక్షణ పరమైన ఉన్న సమస్యలు, సరిహద్దు వివాదం దీనికి కారణాలుగా చెప్పొచ్చు. పాక్​కు వెళ్లడం ఎప్పుడో ఆపేసింది టీమిండియా. ఇప్పుడు కూడా ఆ దేశంలో మన ప్లేయర్లకు సేఫ్టీ ఉండదనే ఉద్దేశంతో రామంటూ బీసీసీఐ అంటోంది.

టీమిండియా మ్యాచుల్ని హైబ్రిడ్ పద్ధతిలో దుబాయ్ లేదా శ్రీలంకలో నిర్వహించాలని బీసీసీఐ అంటోంది. ఐసీసీలో మన బోర్డు మాట నడుస్తుందనేది తెలిసిందే. అందుకే భారత జట్టు పాక్​కు రావాల్సిందే అంటూ పీసీబీ హెచ్చరిస్తున్నా ఐసీసీ సైలెంట్​గా ఉంటోంది. టీమిండియా రాకపోతే ఆ జట్టు ప్లేస్​లో ఇంకో కంట్రీకి ఛాన్స్ ఇవ్వాలంటూ దాయాది అడ్డుపుల్ల వేస్తున్నా ఐసీసీ మాత్రం భారత్​కు ఫేవర్​గానే వ్యవహరిస్తోంది. తాజాగా ఈ వివాదంపై టర్బనేటర్ హర్భజన్ సింగ్ రియాక్ట్ అయ్యాడు. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాక్​కు వెళ్లేది లేదంటూ బీసీసీఐ తీసుకున్న నిర్ణయానికి తాను మద్దతు తెలుపుతున్నానని అన్నాడు. పాక్​లో మన ఆటగాళ్లు సురక్షితంగా ఉండలేరని చెప్పాడు.

పాక్​కు ఈ జన్మలో బుద్ధి రాదంటూ భజ్జీ ఫైర్ అయ్యాడు. అక్కడ పరిస్థితులు దారుణంగా ఉన్నాయని.. ఎప్పుడు ఎవరికి ఏం జరుగుతుందో చెప్పలేమన్నాడు. ‘భారత జట్టు పాకిస్థాన్​కు ఎందుకు వెళ్లాలి? అక్కడ భద్రతాపరమైన సమస్యలు ఉన్నాయి. అక్కడ ప్రతి రోజూ ఏదో ఒక భయానక ఘటన జరుగుతోంది. అక్కడికి వెళ్లడం సురక్షితం కాదని నేను భావిస్తున్నా. టీమిండియాను అక్కడికి పంపొద్దని బీసీసీఐ తీసుకున్న నిర్ణయం భేష్. దీనికి నేను సపోర్ట్ చేస్తా. మన ఆటగాళ్ల సేఫ్టీ కంటే ఏది కూడా ఇంపార్టెన్స్ కాదు’ అని హర్భజన్ స్పష్టం చేశాడు. భజ్జీ వ్యాఖ్యల్లో తప్పు లేదని.. అతడు చెప్పింది కరెక్ట్ అని నెటిజన్స్ అంటున్నారు. పాక్​కు వెళ్లడం సురక్షితం కాదంటన్నారు. మరి.. ఛాంపియన్స్ ట్రోఫీ వివాదంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

Show comments