World Cup 2023: ఆటగాళ్లకు నరకం చూపిస్తున్న BCCI.. మ్యాక్స్‌వెల్‌ షాకింగ్‌ స్టేట్‌మెంట్‌

నెదర్లాండ్స్‌పై ఫాస్టెస్ట్‌ సెంచరీతో చెలరేగిన మ్యాక్స్‌వెల్‌.. మ్యాచ్‌ తర్వాత బీసీసీఐపై సంచలన వ్యాఖ్యలతో విరుచుకుపడ్డాడు. బీసీసీఐ తీసుకుంది చెత్త నిర్ణయం అంటూ భారీ స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు. మరి మ్యాక్సీ కోపానికి కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

నెదర్లాండ్స్‌పై ఫాస్టెస్ట్‌ సెంచరీతో చెలరేగిన మ్యాక్స్‌వెల్‌.. మ్యాచ్‌ తర్వాత బీసీసీఐపై సంచలన వ్యాఖ్యలతో విరుచుకుపడ్డాడు. బీసీసీఐ తీసుకుంది చెత్త నిర్ణయం అంటూ భారీ స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు. మరి మ్యాక్సీ కోపానికి కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

వరల్డ్‌ కప్‌ 2023లో ఫాస్టెస్ట్‌ సెంచరీ బాదేసిన తర్వాత ఆస్ట్రేలియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ మ్యాక్స్‌వెల్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఏకంగా ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్‌ బోర్డ్‌, ఈ వరల్డ్‌ కప్‌ను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న బీసీసీఐని టార్గెట్‌ చేసి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. బీసీసీఐ చేస్తోంది ఓ చెత్త పని అంటూ భారీ స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు. బీసీసీఐ చేస్తున్న పని వల్ల ఆటగాళ్లు నరకం చూస్తున్నారని మండిపడ్డాడు. ఇంతకీ మ్యాక్స్‌వెల్‌ ఇంత ఘాటు వ్యాఖ్యలు చేయడానికి కారణం ఏంటంటే.. బుధవారం ఢిల్లీలోని అరుణ్‌ జైట్లీ క్రికెట్‌ స్టేడియంలో ఆస్ట్రేలియా-నెదర్లాండ్స్‌ మధ్య జరిగిన నేపథ్యంలో స్టేడియంలో లైట్‌ షోను ఏర్పాటు చేశారు.

మ్యాచ్‌ మధ్యలో ఏర్పాటు చేసిన ఈ లైట్‌ షో ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది. ఆ లైట్‌ షోకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా కూడా మారాయి. మ్యాచ్ మధ్యలో విరామాలు వస్తున్న సమయంలో ఈ లైట్‌ షోను బీసీసీఐ అన్ని మ్యాచ్‌ల్లోనూ నిర్వహిస్తోంది. అయితే.. బుధవారం ఆసీస్‌-నెదర్లాండ్స్‌ మధ్య మ్యాచ్‌ సందర్భంగా కూడా లైట్‌ షోను నిర్వహించారు. అయితే.. ఈ లైట్‌ షో విషయంలోనే మ్యాక్స్‌వెల్‌కు కోపం వచ్చింది. మ్యాచ్‌ ముగిసిన తర్వాత.. ఈ విషయంపై మ్యాక్సీ మాట్లాడుతూ.. లైట్‌ షో వల్ల చాలా ఇబ్బంది పడ్డానని, భయంకరమైన తలనొప్పి వచ్చిందని అన్నాడు.

లైట్‌ షో ముగిసిన తర్వాత చాలా సేపు కళ్ల మంటతో ఇబ్బంది పడినట్లు తెలిపాడు. అయితే.. మ్యాచ్‌ మధ్యలో ఇలాంటి లైట్‌ షో నిర్వహించలన్న నిర్ణయం చెత్త నిర్ణయం అన్నాడు. బిగ్‌ బాష్‌ లీగ్‌లో కూడా ఒకసారి ఇలాంటి లైట్‌ షో నిర్వహించారని అప్పుడు కూడా చాలా ఇబ్బంది పడినట్లు పేర్కొన్నాడు. అయితే.. ఈ లైట్‌ షో ప్రేక్షకులకు వినోదాన్ని అందించడానికి చేస్తారని, వారికి ఈ లైట్‌ షో బాగానే ఉంటుందని, కానీ, ఆటగాళ్లు మాత్రం నరకం చూస్తారని అన్నాడు. కాగా, ఈ మ్యాచ్‌లో మ్యాక్సీ​ ఏకంగా సెంచరీతో చెలరేగిన విషయం తెలిసిందే. వార్నర్‌తో పాటు మ్యాక్సీ సెంచరీ చేయడంతో ఆసీస్‌ 399 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. నెదర్లాండ్స్‌ 90 పరుగులకే ఆలౌట్‌ కావడంతో వన్డేల్లో భారీ విజయం నమోదైంది. మ్యాచ్‌ సంగతి అలా ఉంచితే.. లైట్‌ షోపై మ్యాక్స్‌వెల్‌ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: రోహిత్​పై డివిలియర్స్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. ఆ విషయంలో భయపెడుతున్నాడంటూ..!

Show comments