Glenn Maxwell Unfollows RCB On Instagram: RCB నుంచి స్టార్ ప్లేయర్​ బయటకు.. ఒక్క పనితో ఫుల్ క్లారిటీ!

RCB నుంచి స్టార్ ప్లేయర్​ బయటకు.. ఒక్క పనితో ఫుల్ క్లారిటీ!

IPL 2025: ఐపీఎల్-2025 మొదలవడానికి ఇంకా చాలా టైమ్ ఉంది. మెగా ఆక్షన్​ కూడా ఇప్పుడప్పుడే జరగదు. కానీ అప్పుడే కెప్టెన్ల దగ్గర నుంచి కోచ్​లు, ప్లేయర్ల వరకు టీమ్స్​లో చాలా మార్పులు జరిగిపోతున్నాయి.

IPL 2025: ఐపీఎల్-2025 మొదలవడానికి ఇంకా చాలా టైమ్ ఉంది. మెగా ఆక్షన్​ కూడా ఇప్పుడప్పుడే జరగదు. కానీ అప్పుడే కెప్టెన్ల దగ్గర నుంచి కోచ్​లు, ప్లేయర్ల వరకు టీమ్స్​లో చాలా మార్పులు జరిగిపోతున్నాయి.

ఐపీఎల్-2025 మొదలవడానికి ఇంకా చాలా టైమ్ ఉంది. మెగా ఆక్షన్​ కూడా ఇప్పుడప్పుడే జరగదు. కానీ అప్పుడే కెప్టెన్ల దగ్గర నుంచి కోచ్​లు, ప్లేయర్ల వరకు చాలా మార్పులు జరిగిపోతున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తమ హెడ్​ కోచ్​ పదవి నుంచి ఆస్ట్రేలియా లెజెండ్ రికీ పాంటింగ్​ను తొలగించింది. ఆయన స్థానంలో నూతన కోచ్ కోసం వెతుకులాట మొదలుపెట్టింది. ఆ టీమ్ కెప్టెన్ రిషబ్ పంత్​ కూడా డీసీని వీడటం ఖాయమనే వార్తలు వస్తున్నాయి. ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు ఆ టీమ్​లోని సీనియర్లు సూర్యకుమార్ యాదవ్, జస్​ప్రీత్ బుమ్రా ఎంఐ క్యాంప్​లో నుంచి బయటకు రావడం పక్కా అని వినిపిస్తోంది. ఒకవైపు ఢిల్లీ, ముంబై టీమ్స్ ఆటగాళ్ల నిష్క్రమణ గురించి న్యూస్ వస్తున్న టైమ్​లోనే మరోవైపు ఓ ఆర్సీబీ స్టార్ కూడా ఇదే బాటలో నడవడం చర్చనీయాంశంగా మారింది.

స్టార్ ఆల్​రైండర్ గ్లెన్ మాక్స్​వెల్ ఆర్సీబీ నుంచి వెళ్లిపోవడం ఖాయంగా మారింది. దీనిపై ఒక్క పనితో అతడు ఇన్​డైరెక్ట్​గా క్లారిటీ ఇచ్చాడు. ఆర్సీబీ ఇన్​స్టాగ్రామ్ హ్యాండిల్​ను మ్యాక్సీ అన్​ఫాలో చేశాడు. ఇన్నాళ్లూ పలు సోషల్ మీడియా ప్లాట్​ఫామ్స్​లో బెంగళూరును ఫాలో చేస్తూ వచ్చినా మాక్స్​వెల్ ఉన్నట్లుండి ఆ టీమ్​ను అన్​ఫాలో చేయడం కొత్త చర్చకు దారి తీసింది. జట్టులో నుంచి తీసేస్తున్నట్లు బెంగళూరు మేనేజ్​మెంట్ నుంచి మెసేజ్ రావడంతో మాక్సీ హర్ట్ అయ్యాడని.. అందుకే అధికారిక ప్రకటన రాకముందే ఆర్సీబీని వీడుతున్నట్లు హింట్ ఇచ్చాడని క్రికెట్ వర్గాల్లో వినిపిస్తోంది. కాగా, ఈ ఏడాది ఐపీఎల్ సీజన్​లో మాక్స్​వెల్ దారుణ ఆటతీరుతో తీవ్ర విమర్శలపాలయ్యాడు.

11 కోట్లు పెట్టి ఆర్సీబీ కొనుక్కున్న మాక్స్​వెల్.. ఈ సీజన్​లో 10 మ్యాచుల్లో కలిపి చేసింది 52 పరుగులే. ఇంటర్నేషనల్ క్రికెట్​తో పాటు ఇతర లీగ్స్​లో దుమ్మురేపుతున్న మాక్సీ.. బెంగళూరుకు ఆడుతూ మాత్రం తేలిపోతున్నాడు. అతడు అట్టర్​ఫ్లాప్ అవడం టీమ్​కు బిగ్ మైనస్​గా మారింది. గత సీజన్​లోనూ అతడు పెద్దగా పెర్ఫార్మ్ చేయలేదు. దీంతో ఐపీఎల్-2025కు ముందు నిర్వహించే మెగా ఆక్షన్​లో మాక్సీని ఆర్సీబీ రిలీజ్ చేయడం ఖాయమని అంతా డిసైడ్ అయ్యారు. అతడి ప్లేస్​లో మంచి ఆల్​రౌండర్​ను తీసుకుంటారని అనుకున్నారు. ఈ తరుణంలో ఆర్సీబీని సోషల్ మీడియాలో అన్​ఫాలో చేయడం ద్వారా తాను బయటకు వచ్చేసినట్లు మాక్సీ చెప్పకనే చెప్పాడని ఎక్స్​పర్ట్స్ అంటున్నారు. మరి.. ఆర్సీబీని మాక్స్​వెల్ అన్​ఫాలో చేయడంపై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

Show comments