SNP
Gautam Gambhir, Virat Kohli, IND vs SL: శ్రీలంకతో వన్డే సిరీస్‌కి ముందు కోహ్లీ నెట్స్‌లో చెమటచిందించాడు. నెట్స్‌లో అతను కొట్టిన షాట్‌కు చూసి గంభీర్ సైతం షాక్ అయ్యాడు. ఆ రియాక్షన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
Gautam Gambhir, Virat Kohli, IND vs SL: శ్రీలంకతో వన్డే సిరీస్‌కి ముందు కోహ్లీ నెట్స్‌లో చెమటచిందించాడు. నెట్స్‌లో అతను కొట్టిన షాట్‌కు చూసి గంభీర్ సైతం షాక్ అయ్యాడు. ఆ రియాక్షన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
SNP
శ్రీలంకతో వన్డే సిరీస్ కోసం భారత క్రికెటర్లు ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. కొత్త హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఆధ్వర్యంలో, సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలోని యంగ్ టీమిండియా.. ఇటీవలె శ్రీలంకను మూడు టీ20ల సిరీస్‌లో క్లీన్ స్వీప్ చేసిన విషయం తెలిసిందే. ఆల్‌రౌండర్ ప్రదర్శనతో లంకను వాళ్లగడ్డపైనే క్లీన్ స్వీప్ చేసి.. కెప్టెన్‌గా సూర్య, హెడ్ కోచ్‌గా గంభీర్ సూపర్ స్టార్ట్ అందుకున్నారు. ఇక రోహిత్ శర్మ కెప్టెన్సీలో వన్డే సిరీస్‌ను కూడా కైవసం చేసుకోవాలని భాతర జట్టు ఆటగాళ్లు గట్టి పట్టదలతో ఉన్నారు. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ నెట్స్‌లో ముమ్మరంగా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశారు.
టీ20 వరల్డ్ కప్ 2024 విజయం తర్వాత విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20 కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ మెగా టోర్నీ తర్వాత.. రోకో జోడి తొలిసారి గ్రౌండ్‌లోకి దిగనుంది. అందుకే భారత క్రికెట్ అభిమానులు ఈ సిరీస్‌పై ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. చాలా రోజుల తర్వాత.. ఇద్దరి ఆటను చూసేందుకు ఎగ్జైట్‌గా ఉన్నారు. అయితే.. విరాట్ కోహ్లీ టీ20 వరల్డ్ కప్‌లో అంత మంచి ప్రదర్శన చేయని విషయం తెలిసిందే. రోహిత్ శర్మతో కలిసి ఓపెనర్‌గా ఆడిన కోహ్లీ.. తన స్థాయికి తగ్గట్లు ఆడలేదు. ఒక్క ఫైనల్‌లో మాత్రమే అదరగొట్టాడు.
ఇప్పుడు శ్రీలంకతో వన్డే సిరీస్‌తో తన ఫామ్‌ను తిరిగి అందుకోవాలని భావిస్తున్నాడు. ఈ క్రమంలోనే నెట్స్‌లో చాలా సేపు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ రోహిత్ శర్మ పర్యవేక్షణలో నెట్స్‌లో కోహ్లీ భారీ భారీ షాట్లు ఆడాడు. కోహ్లీ కొడుతున్న షాట్లు చూసి.. గౌతమ్ గంభీర్ ఆశ్చర్యపోయాడు. కోహ్లీ కొట్ట బాల్ అలా గాల్లోకి వెళ్తుంటే.. గంభీర్ ఆ బాల్‌ను అలాగే చూస్తుండి పోయాడు. ప్రస్తుతం కోహ్లీ షాట్‌కు గంభీర్ ఇచ్చిన షాకింగ్ రియాక్షన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
T20I Series ✅
It’s now time for ODIs 😎🙌#TeamIndia | #SLvIND pic.twitter.com/FolAVEn3OG
— BCCI (@BCCI) August 1, 2024