టీమిండియాలోకి నెదర్లాండ్స్‌ మాజీ క్రికెటర్‌? వచ్చేది మామూలోడు కాదు!

Gautam Gambhir, Team India, Ryan Ten Doeschate, Netherlands: టీమిండియాలో భారీ ప్రక్షాళన జరుగుతోంది. ఈ మార్పులో భాగంగా నెదర్లాండ్స్‌ క్రికెటర్లు కూడా మన టీమ్‌లోకి వచ్చేస్తున్నారు. మరి దాని గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

Gautam Gambhir, Team India, Ryan Ten Doeschate, Netherlands: టీమిండియాలో భారీ ప్రక్షాళన జరుగుతోంది. ఈ మార్పులో భాగంగా నెదర్లాండ్స్‌ క్రికెటర్లు కూడా మన టీమ్‌లోకి వచ్చేస్తున్నారు. మరి దాని గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

టీ20 వరల్డ్‌ కప్‌ 2024 గెలిచిన తర్వాత.. భారత జట్టులో భారీ మార్పులే జరుగుతున్నాయి. టీ20 కెప్టెన్సీ, హెడ్‌ కోచ్‌, కోచింగ్‌ స్టాఫ్‌, బ్యాక్‌ రూమ్‌ స్టాఫ్‌ ఇలా అందరూ మారిపోతున్నారు. ఇందులో కొన్ని ముందే తెలిసినవే. టీ20 వరల్డ్‌ కప్‌తో హెడ్‌ కోచ్‌గా రాహుల్‌ ద్రవిడ్‌ పదవీ కాలం ముగియడంతో.. ఆయన స్థానంలో కొత్త కోచ్‌ వస్తాడని గత కొంత కాలంగా ప్రచారం జరుగుతూనే ఉంది. ఆ కొత్త గంభీరే అని చాలా మంది అనుకున్నారు.. పలు వార్తలు కూడా వచ్చాయి. అందరూ అనుకున్నట్లుగానే.. గౌతమ్‌ గంభీర్‌ను హెడ్‌ కోచ్‌గా నియమించింది బీసీసీఐ.

భారత జట్టుకు కోచ్‌గా పనిచేయాలని బీసీసీఐ తనను సంప్రదించినప్పుడే గంభీర్‌ కొన్ని కండీషన్లు పెట్టాడు. తనతో పాటు కొత్త కోచింగ్‌ స్టాఫ్‌ను తానే ప్రత్యేకంగా ఎంచుకుంటానని చెప్పాడు. దానికి బీసీసీఐ అంగీకరించింది. ఈ క్రమంలోనే ద్రవిడ్‌తో పాటు అసిస్టెంట్‌ కోచ్‌లుగా చేసిన వారి స్థానంలో కొత్త వారిని తీసుకోవాలని గంభీర్‌ ఫిక్స్‌ అయ్యాడు. తన మైండ్‌సెట్‌తో తన పనితో సింక్‌ అయ్యేవారు కావాలని గంభీర్‌ కోరుకుంటున్నాడు. ఈ క్రమంలోనే బ్యాక్‌రూమ్‌ స్టాఫ్ ఎంపికలో కూడా గంభీర్‌ తన మార్క్‌ను చూపిస్తున్నాడు. బ్యాక్‌ రూమ్‌ స్టాఫ్‌గా నెదర్లాండ్స్‌ మాజీ క్రికెటర్‌ ర్యాన్‌ టెన్‌ డస్కటే తీసుకోవాలని గంభీర్‌ భావిస్తున్నట్లు సమాచారం.

ఇప్పటికే ఈ విషయమై ర్యాన్‌తో మాట్లాడిన గంభీర్‌.. బీసీసీఐకి కూడా ఈ విషయాన్ని తెలిపినట్లు సమాచారం. ర్యాన్‌ టెన్‌ డస్కటే 2006 నుంచి 2011 మధ్య కాలంలో అంతర్జాతీయ క్రికెట్‌లో మెరిశాడు. అలాగే ఐపీఎల్‌లో కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌ తరఫున కూడా ఆడాడు. లోయర్‌ ఆర్డర్‌లో బ్యాటింగ్‌ చేస్తూ.. మంచి హిట్టింగ్‌తో మ్యాచ్‌లు గెలిపించేవాడు. కాళ్లపైకి వేసే బంతులను ఎంతో అందంగా ఫ్లిక్‌ షాట్‌తో భారీ సిక్సులు కొట్టడంతో టెన్‌ డస్కటే దిట్ట. అలాగే స్ట్రైయిట్‌ సిక్సులు కూడా కొట్టేవాడు. ఇక అంతర్జాతీయ క్రికెట్‌లో 33 వన్డేలు, 24 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఐపీఎల్‌లో 29 మ్యాచ్‌లు ఆడాడు. వన్డేల్లో 1541 పరుగులు సాధించాడు. అందులో 5 సెంచరీలు, 9 హాఫ్‌ సెంచరీలు చేశాడు. అలాగే టీ20ల్లో 533 పరుగులు ఉన్నాయి. గంభీర్‌ కేకేఆర్‌ మెంటర్‌గా పనిచేసిన సమయంలో ర్యాన్‌ టెన్‌ డస్కటే కూడా కోచింగ్‌ స్టాఫ్‌లో భాగంగా ఉన్నాడు. మరి టెన్‌ డస్కటేను అప్పట్లో టెండూల్కర్‌ అనే వాళ్లు. అలాంటి ఆటగాడిని టీమిండియా కోచింగ్‌ స్టాఫ్‌లోకి తీసుకోనుండటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments